Iraq attacks
-
బాంబులతో దద్దరిల్లిన ఇరాక్: 10 మంది మృతి
ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలు నిత్యం బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతుందని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. నిన్న చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల వల్ల దాదాపు 10 మంది మరణించారని తెలిపింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించింది. దియాల ప్రావెన్స్లో అత్యంత రద్దీగా ఉండే మీడియా కేంద్రం సమీపంలో రోడ్డు పక్కన ఉంచిన బాంబు పేలి ఐదుగురు మరణించగా, 11 మంది తీవ్ర గాయాలపాలైయ్యారని చెప్పింది. అలాగే సదియహ్ పట్టణంలోని మార్కెట్ వద్ద ఉంచిన బాంబు విస్పోటనంలో ముగ్గురు మరణించారని,11 మంది గాయపడ్డారని చెప్పింది. మకదాదియ నగరంలో ఓ పోలీసుపై కొందరు ఆగంతకులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మరణించాడని తెలిపింది. ఫల్లజ నగరంలో పార్క్ చేసిన కారు పేలి ముగ్గురు గాయపడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయని పేర్కొంది. హమామ్ అలీ పట్టణం పోలీస్ ఉన్నతాధికారి బాంబు పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారని, అయితే కొద్దిపాటి గాయాలు ఆయనకు తగిలాయని వెల్లడించింది. బాంబు పేలుళ్ల వల్ల పోలీసు జీపులు ధ్వంసమైన ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని మీడియా పేర్కొంది. -
ఇరాక్‌లో బాంబు పేలుళ్లు: 25 మంది మృతి
ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో గురువారం బాంబుల పేలుళ్లు సంభవించి దాదాపు 25 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఈ ఘటనలో మరో 47మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. భద్రత దళాలు లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు పేలుళ్లు జరిగాయని చెప్పారు. గాయపడిన వారంతా దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. రమదాలోని ఆర్మీ చెక్‌పోస్ట్‌పై ఆత్మహుతి జరిపిన దాడిలో 10 మంది సైనికులు మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారని తెలిపారు. అలాగే డుజైల్లో నగరంలో రోడ్డు పక్కన ఉన్న బాంబు పేలుడు సంభవించడంతో ఆ సమీపంలో పెళ్లి వేడుకలకు హాజరైన అతిథుల్లో ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో 21 మంది గాయాలపాలు అయ్యారు. అస్లాహ్ లోని ఇరాకీ ఆర్మీ చెక్ పోస్ట్‌పై ఆగంతకుడు జరిపిన తుపాకి కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. బాత్ నగరంలో రోడ్డు పక్కన బాంబు పేలి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఇద్దరు సైనికులు దుర్మరణం చెందారు. మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడడారు. ముసలా నగర తూర్పు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. వీటితోపాటు తాల్ అఫర్లో కారు బాంబు పేలి ఎనిమిది మంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. కిర్క్లోని ప్రభుత్వ కార్యాలయం వద్ద పార్కింగ్‌లో ఉంచిన కార్ విస్పోటనంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.