Iraq government
-
తెలంగాణ వలస కార్మికుల షాక్! రూ.లక్ష జరిమానా కట్టి మీ దేశం వెళ్లండి!
సాక్షి, నిజామాబాద్: ఉపాధిని వెతుక్కుంటూ ఇరాక్ వెళ్లిన తెలంగాణ వలస కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో ఇంటికి చేరుకోవాలంటే రూ.లక్ష జరిమానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం నిర్దేశించింది. అకామ లేకపోవడంతో ఎవరూ పనిఇవ్వడం లేదని, పార్కులలో తలదాచుకుంటూ అష్టకష్టాలు పడుతున్న తమకు జరిమానా చెల్లించే స్తోమత లేదని వలస కార్మికులు వాపోతున్నారు. ఎర్బిల్ పట్టణంలో తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు సుమారు 20 మంది వరకు ఉండిపోయారు. గతంలో అకామ లేనివారిని ఇరాక్‌లో మన రాయబార కార్యాలయం అధికారులు జరిమానాను తప్పించి ఇంటికి పంపించారు. అలా వందలాది మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరుకున్నారు. కాగా కొంత మంది మాత్రం ఇంటికి రాకుండా ఇరాక్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇరాక్‌లో చట్టవిరుద్ధంగా ఉన్నవారిపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో వలస కార్మికులు ఇంటికి చేరుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ. వెయ్యి నుంచి 1,500 వరకు అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో రూ. లక్షకు పైగా) జరిమానా చెల్లిస్తేనే విదేశీ కార్మికులను వారి దేశాలకు వెళ్లడానికి అనుమతిస్తామని ఇరాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో ఉన్న తాము జరిమానా చెల్లించి, విమాన టికెట్‌ను కొనేందుకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలని వలస కార్మికులు వాపోతున్నారు. మంచిర్యాల్, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లా జిల్లాలకు చెందిన వలస కార్మికులు ఇరాక్‌లో ఉండిపోయారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇరాక్‌లోని వలస కార్మికులు ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ను ఆశ్రయించగా సదరు సంస్థ ప్రతినిధులు విదేశాంగ శాఖను సంప్రదించారు. వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రవాసీ మిత్ర సంస్థ ప్రతినిధులు సమాచారం అందించారు. ఇంటికి రప్పించడానికి చొరవ తీసుకోవాలి... గడువు ముగిసిపోవడంతో మాకు పనివ్వడం లేదు. కరోనా వల్ల అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఇంటికి రావాలంటే జరిమానా చెల్లించడానికి మా వద్ద డబ్బులు లేవు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని వలస కార్మికులను ఇంటికి రప్పించాలి. -
మా వారిని రక్షించండి
సాక్షి, జన్నారం(ఆదిలాబాద్) : అకారణంగా జైళ్లో వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న ఇరాక్ ప్రభుత్వం బారినుంచి తమ వారిని రక్షించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన బాధిత కుటుంబసభ్యులు ఢిల్లీబాట పట్టారు. తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాట్కూరి బసంతరెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో విదేశాంగశాఖ మంత్రిని కలిసేందుకు వెళ్లారు. ముందుగా సీఏఆర్ఏ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ మంద రాంచంద్రరెడ్డిని కలిశారు ఎందుకు పట్టుకెళ్లారో తెలియని పరిస్థితి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల ఎల్లయ్య, లచ్చవ్వ దంపతుల కొడుకు కుంటాల లచ్చన్న. ఆయనకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన షేర్ల లక్ష్మి, లచ్చన్న దంపతుల కుమారుడు రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నా రు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, అందరిలో ఉన్నతంగా బతుకాలనే ఉద్దేశంతో లచ్చన్న, రాజు 2015 ఆగస్టు 22న ఇరాక్ దేశం వెళ్లారు. వీసా కోసం నిజామాబాద్ జిల్లాకు చెం దిన ఏజెంట్‌కు రూ.1.50 లక్షలు చెల్లించారు. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్ మోసం చేశాడని తెలుసుకున్నారు. విజిట్ వీసాతో తమను పంపాడని తెలుసుకున్నారు. అకామా లేకుండా ఇరాక్‌లో ఉం డటం చాలా ఇబ్బంది. ఇది తెలిసి.. తెలిసిన వారి వద్ద ఉంటూ దొంగచాటున పనులు చేస్తూ జీవిం చారు. ఏడాది పాటు పనిచేసిన డబ్బులతో అకా మా చేయించుకున్నారు. అకామా వచ్చాక ఎర్బిల్లోని బాల పాఠశాలలో పనికి కుదిరారు. ఈ క్రమంలో ఏప్రిల్ 16న పోలీసులు వచ్చి ఎలాంటి కారణం చూపకుండా వీరిద్దరినీ పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారో..? ఎన్ని రోజులుంచుకుంటారో..? తెలియని పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల నుంచి మాట్లాడలే ఏప్రిల్ 16న పోలీసులు పట్టుకెళ్లక ముందు (మూడునెలల క్రితం) ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫోన్లు బంద్ అయ్యాయి. తాజాగా ఈ నెల 12న ఫోన్ చేసి.. తమను ఎందుకు జైళ్లో వేశారో తెలియదని.. తాము ఏ తప్పూ చేయలేదని.. చాలా టార్చర్ చేస్తున్నారని ఏడుస్తూ తెలిపారని శేర్ల రాజు కుటుంబ సభ్యులు అంటున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలలో జరిగిన సంఘటనపై వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారని, ఆ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదంటున్నారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సంఘటన ఏం జరిగిందో..? వీరిపాత్ర ఎంతవరకు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన పదిమంది కూడా ఢిల్లీకి వెళ్లినట్లు వారు పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిని కలిసి విన్నవిస్తాం ఇరాక్‌లో ఇరుక్కుపోయిన వారిని విడిపించేలా విదేశాంగ శాఖ మంత్రిని కలిసి విన్నవిస్తాం. వీరితోపాటు వివిధ జిల్లాలకు చెందిన పలువురి ఇదే పరిస్థితితో బాధపడుతున్నారు. వారందరిని తీసుకుని ఢిల్లీకి వెళ్లాం. ఇప్పటికే ఇరాక్ ఎంబసీ డైరెక్టర్ జనరల్ మణిపాల్‌సింగ్‌తో ఫోన్లో మాట్లాడాం. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే తప్ప వారు విడుదలయ్యే అవకాశం లేదు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. – పాట్కూరి బసంతరెడ్డి, గల్ఫ్‌వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు -
ఇరాక్ పోరులో భారతీయుడి మృతి
ముంబై: ఇరాక్‌లో జరుగుతున్న పోరులో మహారాష్ట్రకు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇరాక్ ప్రభుత్వ బలగాలతో పోరాడుతున్న ‘ఇస్లామిక్ స్టేట్’ మిలిటెంట్లలో చేరేందుకు థానే ప్రాంతం నుంచి నలుగురు వెళ్లారని, వారిలో ఆరిఫ్ ఫయ్యాజ్ మజీద్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఇరాక్‌లోని మోసుల్‌లో జరిగిన ఒక పేలుడులో మరణించాడని సమాచారం. ఆరిఫ్‌తో పాటు వెళ్లిన మరో వ్యక్తి మంగళవారం ఈ విషయాన్ని ఆరిఫ్ కుటుంబసభ్యులకు ఫోన్లో తెలిపారని మహారాష్ట్రలోని పోలీసు వర్గాలు తెలిపాయి. పవిత్ర కర్బాలా సందర్శనకు వెళ్తున్నామని చెప్పి ఆ నలుగురు ఈ మే నెలలో ఇరాక్ వెళ్లారని, అనంతరం ఇస్లామ్ రక్షణ కోసం యుద్ధంలో పాల్గొంటున్నానని ఆరిఫ్ తన తల్లిదండ్రులకు లేఖ రాశాడని వివరించాయి. ఇస్లామిక్ స్టేట్ దళాలు ఇంటర్నెట్ ద్వారా వారిని రిక్రూట్ చేసుకున్నాయని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నగదు లావాదేవీని పోలీసులు గుర్తిం చారు. తన కుమారుడినివెనక్కు తెప్పించాలం టూ ఆరిఫ్ తండ్రిమజీద్ జూలైలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారని సమాచారం.