ముంబై: ఇరాక్‌లో జరుగుతున్న పోరులో మహారాష్ట్రకు చెందిన ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇరాక్ ప్రభుత్వ బలగాలతో పోరాడుతున్న ‘ఇస్లామిక్ స్టేట్’ మిలిటెంట్లలో చేరేందుకు థానే ప్రాంతం నుంచి నలుగురు వెళ్లారని, వారిలో ఆరిఫ్ ఫయ్యాజ్ మజీద్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఇరాక్‌లోని మోసుల్‌లో జరిగిన ఒక పేలుడులో మరణించాడని సమాచారం.
ఆరిఫ్‌తో పాటు వెళ్లిన మరో వ్యక్తి మంగళవారం ఈ విషయాన్ని ఆరిఫ్ కుటుంబసభ్యులకు ఫోన్‌లో తెలిపారని మహారాష్ట్రలోని పోలీసు వర్గాలు తెలిపాయి. పవిత్ర కర్బాలా సందర్శనకు వెళ్తున్నామని చెప్పి ఆ నలుగురు ఈ మే నెలలో ఇరాక్ వెళ్లారని, అనంతరం ఇస్లామ్ రక్షణ కోసం యుద్ధంలో పాల్గొంటున్నానని ఆరిఫ్ తన తల్లిదండ్రులకు లేఖ రాశాడని వివరించాయి. ఇస్లామిక్ స్టేట్ దళాలు ఇంటర్నెట్ ద్వారా వారిని రిక్రూట్ చేసుకున్నాయని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నగదు లావాదేవీని పోలీసులు గుర్తిం చారు. తన కుమారుడినివెనక్కు తెప్పించాలం టూ ఆరిఫ్ తండ్రిమజీద్ జూలైలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారని సమాచారం.
ఇరాక్ పోరులో భారతీయుడి మృతి
Published Thu, Aug 28 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement