వైమానిక దాడులు.. 71 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ సైన్యం ఉగ్రవాదులపై పంజా విసిరింది. అనూహ్య దాడులు చేసి వారిని మట్టుబెట్టింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాల సాయంతో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన వాహనాలపై వరుసగా బాంబు దాడులు చేసింది. ఈ క్రమంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండగా కొందరు సైనికులు, మరికొందరు పౌరులు కూడా ఉన్నారు.
అన్బార్, నినేవ్, సలాహుదీన్ ప్రావిన్స్‌ల్లో ఈ పరస్పర దాడులు జరిగాయి. ఉగ్రవాదులు రెండు ఫ్యూయెల్ ట్యాంకులను తీసుకెళ్తుండగా వాటిని సైన్యం ధ్వంసం చేసింది. దీంతోపాటు పలు ఆయుధ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ బలగాలు దాడులు పసిగట్టి తిప్పికొట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేసినప్పటికీ సైన్యం ధీటుగా వారిని ఎదుర్కొంది. ఇరాక్‌లో ఉగ్రవాదులను అణిచివేసేందుకు అమెరికా సహాయం చేస్తోంది. ఇందులో భాగంగా, యుద్ధ విమానాలను పంపిస్తోంది.