iron equipment
-
మూడ్ పాడైతే బ్లేడ్, నెయిల్ కట్టర్, తాళం... ఎనీథింగ్ హాంఫట్!
గాంధీ ఆస్పత్రి: అతడి పేరు గోవర్ధన కార్తీక్... డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు చేరాడు... ఏమాత్రం మూడ్ బాగోలేకపోయినా చేతికి అందిన దాన్ని గుటుక్కుమనిపిస్తాడు. ఇలా పక్షం రోజుల్లో బ్లేడ్, నెయిల్ కట్టర్, తాళం చెవితో పాటు, ఇనుప రేకు ముక్కల్నీ మింగేశాడు. ఇతగాడి వ్యవహారశైలితో అటు జైలు అధికారులు, ఇటు గాంధీ ఆస్పత్రి వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. చేతికి దొరికింది నోట్లో వేసుకుని... విజయవాడకు చెందిన కార్తీక్ (22) మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. వాటిని ఖరీదు చేయడానికి అవసరమైన డబ్బు కోసం విక్రతగా మారా డు. కొన్నాళ్ల క్రితం పోలీసులకు చిక్కిన ఈ పెడ్లర్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మత్తు మందులు దొరక్కో, జైల్లో పెట్టారనే అసహనమో తెలియదు కానీ ఇతగాడికి తరు మూడ్ పాడవుతూ ఉంటుంది. ఆ సమయంలో జైలులో తన చుట్టూ అందుబాటులో ఉన్న చిన్న, చిన్న ఇనుప వస్తువులను అమాంతం మింగేస్తుంటాడు. పక్షం రోజులుగా ఈ వ్యవహారశైలితో జైలు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు. అయితే ఎనిమా లేదంటే ఎండోస్కోపీ... గతంలో జైల్లో ఉండగానే తీవ్రమైన కడుపునొప్పి రావడంతో జైలు డాక్టర్లు పరీక్షించారు. ఈ నేపథ్యంలోనే అతడు ఇనుప వస్తువులు మింగిన విషయం బయటపడింది. కొన్నిసార్లు ఎనిమా ద్వారా బయటకు వచ్చేలా చేస్తుండగా... మరికొన్ని సార్లు మాత్రం ఆస్పత్రికి తీసుకురావాల్సి వచ్చింది. జైలు అధికారుల సూచన మేరకు గత నెల 28న మొదటిసారిగా గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో అడ్మిట్ అయ్యాడు. వైద్య పరీక్షల్లో కార్తీక్ కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ ద్వారా పెద్ద పేగుల మధ్య ఇరుకున్న చేతి బేడీలకు వేసే తాళం చెవిని బయటకు తీశారు. ప్రిజనర్స్ వార్డు నుంచి డిశ్చార్జీ చేసి జైలుకు తరలించగా నెయి ల్కట్టర్, బ్లేడ్లు మింగాడు. కొన్ని ఎనిమా ద్వారా బయటకు రాగా, మరికొన్ని ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు. తాజాగా సోమవారం మరోసారి... కార్తీక్ ఈసారి ఇనుప రేకు ముక్కను మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అతడిని జైలు అధికారులు ఈ నెల 7న మరోసారి గాంధీ ఆస్పత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చేర్చారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగ వైద్యులు సోమవారం తీవ్రంగా శ్రమించి ఎండోస్కోపీ విధానంలో అతడి పేగుల మధ్య ఇరుక్కున్న రేకు ముక్కను బయటకు తీశారు. ఆయా వస్తువులు పేగుల్లో ఇరుక్కోవడంతో తీవ్రమైన నొప్పితో బాధపడటమే కాకుండా ప్రాణా పాయం ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యలు చెప్తున్నారు. గాంధీ వైద్యులు పక్షం రోజుల్లో కార్తీక్‌కు మూడుసార్లు ఎండోస్కోపీ చేసి కడుపులో చిక్కుకున్న ఆయా వస్తువులను బయటకు తీశారు. రిమాండ్ ఖైదీ చేతికి ఎలా... చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కార్తీక్‌కు ప్రమాదకరమైన ఇనుప వస్తువులు ఎలా అందుబాటులోకి వస్తున్నాయన్నది కీలకంగా మారింది. ఈ విషయంపై అతడేమీ చెప్పట్లేదని, తమకూ అర్థం కావడం లేదని ఎండోస్కోపీ నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. కార్తీక్ కడుపులో నుంచి మూడుసార్లు తీసిన వస్తువులు ప్రమాదకరమైనవే అని గాంధీ ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెచ్ఓడీ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న కార్తీక్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, తక్షణమే మానసిక వైద్యులకు చూపించాలని సూచించానని ఆయన వివరించారు. (చదవండి: ఇంటర్ ఛేంజర్లతో ఇక్కట్లు!) -
అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెనాలి శిల్పులు
తెనాలి: ఇనుప వ్యర్థాలతో శిల్పకళా ఖండాలను తీర్చిదిద్దుతూ అంతర్జాతీయ గుర్తింపును పొందిన తెనాలికి చెందిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యారు. స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన ఈ తండ్రీకొడుకులు పదేళ్లుగా ఇనుప వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. వీటిలో 75 వేల ఇనుప నట్లతో మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ నిలువెత్తు విగ్రహాలు ఉన్నాయి. ఇవికాకుండా జీప్, ఆటో, స్కూటర్, మహిళ, సింహంతో సహా మరెన్నో కళాఖండాలను ఇనుప నట్లతో తయారు చేశారు. ఇంతవరకు 100 టన్నుల ఇనుప వ్యర్థాలను ఇందుకోసం వినియోగించారు. ఇంత భారీ మొత్తంలో ఐరన్ స్క్రాప్‌ను వాడి, తయారైన భారీ శిల్పకళాఖండాలను దేశంలోని పలు రాష్ట్రాలతో సహా విదేశాలకు పంపారు. వీటన్నిటిని గుర్తించి వెంకటేశ్వరరావు, రవిచంద్ర పేర్లు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసింది. ఈ మేరకు సంబంధిత సంస్థ శనివారం వీరికి అధికారిక సమాచారాన్ని పంపింది. -
పాత ఇనుమును పట్టించుకోరా..?
సింగరేణిలో పేరుకుపోతున్న స్క్రాప్ నిల్వలు మట్టిలో కలిసిపోతున్న ఇనుప సామగ్రి అమ్మకాలను పట్టించుకోని అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్న దొంగలు యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణి సంస్థలోని పాత ఇనుము దొంగలకు వరంగా మారింది. బొగ్గు ఉత్పత్తి కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రా లు, పనిముట్లను కాలం చెల్లిన తర్వాత విక్రయించడం, ఇతర ప్రాంతాలకు తరలించడం పట్ల సంబంధిత అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గనుల వద్ద నిల్వ ఉన్న పాత ఇనుమును దొంగలు ఎంచక్కా ఎత్తుకెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సింగరేణి వ్యాప్తంగా సుమారు రూ. వంద కోట్లకు పైగా ఐరన్ స్క్రాప్ గనుల్లో పేరుకుపోయినట్లు తెలిసింది. ఓసీపీల్లో గడువుతీరిన భారీ యంత్రా లు, గనులు మూసివేతతో వెలికితీసిన పాత ఇనుప సామగ్రి, గనుల్లో పాడైపోయిన యంత్ర విడిభాగాలు సుమారు ఐదేళ్లుగా ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయాయి. ఒక్క ఆర్జీ-2 ఏరియాలోనే సుమారు రూ. 10కోట్ల విలువచేసే ఇనుము గనులపై ఉండడం గమనార్హం. కాగా, కొన్నేళ్ల క్రితం మూతపడిన డివిజన్లోని జీడీకే-8, 8ఏ గనుల్లో వెలికితీసిన సామగ్రిని అధికారులు ఇతరగనులకు తరలించారు. అయితే పనికిరాని ఇనుమును విక్రయించకపోవడంతో అవి గనుల పై పేరుకుపోయింది. ఏళ్ల తరబడి మట్టిలోనే ఉంటుండడం తో తుప్పుపట్టి అమ్మ కానికి కూడా వీలులేకుండా పోతుందని కార్మికులు వాపోతున్నారు. దొంగలకు కాసులు కురిపిస్తున్న స్క్రాప్ యార్డులు.. గనులపై ఏళ్ల తరబడి స్క్రాప్ నిల్వలు ఉండడం దొంగలకు వరంగా మారింది. చిన్న ఇనుప ముక్క దొరికినా కూడా వందలాది రూపాయలు వస్తుండడంతో వారు స్క్రాప్ యా ర్డులపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బృందాలు గా ఏర్పడి విధినిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డులను బెదిరించి ఇనుమును ఎత్తుకెళ్తున్నట్లు సమాచారం. కాగా, కోట్లు విలువచేసే ఐరన్ సామగ్రి కళ్లముందే చోరీకి గురవుతుండడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఓసీపీ యార్డులో గడువుతీరిన భారీ యంత్రాలను స్క్రాప్‌లో వేస్తుండడంతో దొంగలు బరితెగించి అందులోని విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నట్లు తెలుస్తుంది. టెండర్ల విధానంలో మార్పు తీసుకురావాలి.. స్క్రాప్ టెండర్ల విధానంలో మార్పు తీసుకొచ్చి డివిజన్ల వారీగా స్క్రాప్ విక్రయించే పద్ధతికి శ్రీకారం చుట్టాలని కార్మికులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. పాత ఇనుము అమ్మకం గురించి ప్రభుత్వ సంస్థకు దరఖాస్తు చేసుకుని టెం డర్ పక్రియ మొదలు పెట్టేంతవరకు పుణ్యకాలం గడిచిపోతోందని వారు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై చొరవ తీసుకుని డివిజన్ల వారీగా సంస్థకు లబ్ధి చేకూరేలా టెండర్లు నిర్వహించాలని కోరుతున్నారు. ఆరునెలల్లో ఖాళీ చేయిస్తాం.. గనులైపై పేరుకుపోయిన స్క్రాప్‌ను ఇతర ప్రాంతాలకు తరలిం చేందుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంఏటీసీ ద్వారా టెం డర్ ప్రక్రియను పూర్తి చేసి స్క్రాప్‌ను విక్రయిస్తాం. ఒక్క ఇనుప ముక్కను కూడా విడిచిపెట్టకుండా చర్యలు తీసుకుంటాం. మరో ఆరునెలల్లో గనులపై నిలిచిపోయిన ఐరన్ స్క్రాప్‌ను తరలిస్తాం. - మనోహర్‌రావు, సింగరేణి డెరైక్టర్