‘డిస్నీ’ థీమ్‌తో ప్రెస్జీజ్ సరికొత్త వెంచర్
సాక్షి, బెంగళూరు : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ తన సరికొత్త వెంచర్‌ను ఆదివారం ప్రకటించింది. ప్రెస్టీజ్ లేక్‌సైడ్ హాబిటట్ పేరిట నిర్మించనున్న ఈ గృహసముదాయం ‘డిస్నీ’ థీమ్‌తో ఉంటుందని ఆ సంస్థ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ వెల్లడించారు. వైట్‌ఫీల్డ్‌లోని వర్తూరులో ఈ గృహసముదాయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఆదివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఈ గృహసముదాయంలోని ప్రతి గృహంలోని చిన్నారుల గదిని డిస్నీ పాత్రలతో కూడిన పెయింటింగ్స్‌తో రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను డిస్నీ యూటీవీతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు.
కేవలం గోడలపైనే కాకుండా చిన్నారుల కోసం తయారు చేసిన ఫర్నీచర్, టేబుల్‌వేర్, దుప్పట్లపై కూడా డిస్నీ పాత్రలను, కథలను పొందుపరచనున్నట్లు వెల్లడించారు. త ద్వారా తమ వెంచర్లోకి ప్రవేశించే ప్రతి చిన్నా రి తన బాల్యాన్ని ఎంతో అద్భుతంగా ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొత్తం 102 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ వెంచర్లో 271 విల్లాలు, 3,428 అపార్ట్మెంట్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.