irrigate
-
కోటి ఎకరాల మాట బూటకం
17న వాస్తవ సాగునీటి దృశ్యాన్ని ఆవిష్కరిస్తాం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్ : కొత్తగా కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతున్న మాట వట్టి బూటకమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 90 శాతం దాకా పూర్తిచేసిన ప్రాజెక్టుల సంగతిని దాచిపెడుతున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టుల ఆయకట్టు కాకుండా ఇంకా కోటి ఎకరాలు తెలంగాణలో ఎక్కడుందో కేసీఆర్ చెప్పాలన్నారు. వాస్తవాలను దాచిపెట్టి, వక్రీకరించి, అబద్దాలను చెబుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు. 17న పవర్ ప్రజెంటేషన్... రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిపై ఈ నెల 17న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి హాల్లో ఈ ప్రదర్శన ఉం టుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాం లో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుదల, అందుకు తీసుకున్న చర్యలను వివరిస్తామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఆయకట్టు తగ్గిందని, దీనిని జిల్లాల వారీగా అంకెలతో సహా నిరూపిస్తామని సవాల్ చేశారు. -
నాలుగేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు
మల్లన్నసాగర్ సాధన సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకం, సీతారాంపల్లి, రామచంద్రబోస్, కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా కోటి ఎకరాలను సాగులోకి తెస్తామన్నారు. కాళేళ్వరం ఎత్తిపోతలు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి గోదావరి నీటితో రైతుల పాదాలు కడుగుతామని మంత్రి చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంవత్సరానికి రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టుల నిర్మాణం ఆగదన్నారు. గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలుస్తుందని, వాటిని మళ్లించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు రైతులను రెచ్చ0గొడుతూ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫెదారు రాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు హన్మంత్ సిందే, షకీల్ అహ్మద్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఉమా’ఉన్నంత కాలం నీళ్లు రావు
♦ మంత్రికి అవగాహన లేకే కృష్ణా బోర్డులో వాదన వినిపించలేదు ♦ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి కడప కార్పొరేషన్: రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నంత కాలం రాయలసీమకు మేలు జరగదని, సాగునీరు రావడం కష్టమేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమలోని జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులకు నీరందించడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచాలని అప్పటి సీఎం వైఎస్సార్ నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి వ్యతిరేకంగా ఉమా నాడు ధర్నా నిర్వహించారని, ప్రస్తుతం ఆయనే మంత్రిగా ఉన్నందున రాయలసీమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇక్కడి రైతుల్లో లేదన్నారు. నదీ జలాల విషయంలో ఎక్కువ శాతం నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకుంటూ కూడా ఢిల్లీలో జరిగిన కృష్ణాబోర్డు ఎదుట తమకు అన్యాయం జరిగిందని వివరించిందన్నారు. తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు సమగ్ర అవగాహనతో బోర్డు మీటింగ్‌కు హాజరు కాగా, ఏపీ మంత్రి మాత్రం అవగాహన లేకుండా వెళ్లినట్లు తెలుస్తోందన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఉన్న జనాభా నిష్పత్తి ఆధారంగా డెరైక్టరేట్, సెక్రటేరియేట్‌లోని అన్ని శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల గురించి బోర్డు మీటింగ్‌లో ఒక్క మాట కూడా మాట్లాడకోవడం దారుణమన్నారు. అవే తప్పులు చేస్తున్న ప్రభుత్వం విభజన సమయంలో జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఈనాటికీ ఆ ఊసే లేదని కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని నిలదీయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి పాల్గొన్నారు.