Irrigation water resources
-
సాగునీటి వనరుల్లో ‘అనకాపల్లి’ ముందంజ
ఒక ప్రాంతం అభివృద్ధికి నీరు ఎంతో అవసరమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వ్యవసాయపరంగా జిల్లా బాగుండాలంటే సాగునీరందించే వనరులు అవసరం. ఒక మేజర్ ప్రాజెక్టుతోపాటు ఐదు జలాశయాలు అందుబాటులో ఉండడం కొత్త జిల్లా అనకాపల్లికి వరం కానుంది. నర్సీపట్నం: పునర్వ్యవస్థీకరణలో కొత్త జిల్లాగా అవతరించి న అనకాపల్లి.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నీటివనరుల్లో సింహభాగాన్ని చేజిక్కించుకుంది. ఏకైక మేజరు ప్రాజెక్టు ‘తాండవ’తోపాటు దాదాపుగా ప్రధాన నీటి పథకాలన్నీ అనకాపల్లిలోనే చేరాయి. ప్రధానంగా వ్యవసాయంతోపాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందేందుకు ఇవి దోహదం చేయనున్నాయి. పెద్దేరు, రైవాడ, కోనాం, కల్యాణపులోవ, రావణాపల్లి వంటి సాగునీటి ప్రాజెక్టులు ఈ జిల్లా పరిధిలో ఉండడంతో వరి సాగుకు అవసరమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతోపాటు భవిష్యత్తులో వచ్చే పోలవరం ఎడమ కాలువ ఆధారంగా ఈ జిల్లాలోనే అధిక విస్తీర్ణానికి సాగునీరందించే అవకాశం ఉంది. ఏటా నవంబరులో వచ్చే తుఫాన్ ప్రభావాల వల్ల రిజర్వాయర్లన్నీ నిండుతాయి. వర్షాలు కరుణించకపోయినా ఖరీఫ్‌లో ఈ నీటిని సమృద్ధిగా వాడుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయకట్టు రైతులకు వరి సాగు చేసేందుకు ఢోకా ఉండదు. దీనివల్ల పరోక్షంగా అధిక ఆదాయం సమకూరి రైతాంగం నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. అనకాపల్లి జిల్లా పరిధిలో ఉన్న ఏలేరు కాలువ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా తాండవ జలాశయానికి అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం రూ.470 కోట్లు కేటాయించింది. ఏలేరు కాలువ నుంచి తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరడంలో కీలకపాత్ర వహిస్తున్నారని కొనియాడారు. కరోనా కాలంలో వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందించారన్నారు. వారి సేవలను గుర్తిస్తూ రూ.470 కోట్లను ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాల రూపంలో అందిస్తోందన్నారు. మొదటిసారిగా మంత్రి పదవితో వచ్చిన తనను అనకాపల్లి ప్రజలు అక్కున చేర్చుకున్నారని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాలుగింతలు కష్టించి పనిచేస్తానని పేర్కొన్నారు. ఎప్పటికీ మీలో ఒకడిగా, మీ బిడ్డగా ఉంటానని భరోసా ఇచ్చారు. మంత్రిని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ ఘనంగా సత్కరించారు. ఎంపీ డాక్టర్ సత్యవతి, ఆర్డీవో చిన్నికృష్ణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ భీశెట్టి వరహా సత్యవతి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, గ్రామ సర్పంచ్ తట్టా పెంటయ్యనాయుడు, కశింకోట ఎంపీపీ కలగా గున్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి పరుగులు తీస్తుంది.. సాగునీటి ప్రాజెక్టులు సమృద్ధిగా ఉన్నందున జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. తాండవ ఎత్తిపోతల పథకం, పోలవరం కాలువ పనులు పూర్తయితే జిల్లాకు మరింత మేలు చేకూరుతుంది. వేగవంతంగా అభివృద్ధి చెందే జిల్లాలతో పోలిస్తే అనకాపల్లి ముందు వరుసలో ఉంటుంది. – రాజేంద్రకుమార్, తాండవ ప్రాజెక్టు, డీఈఈ, నర్సీపట్నం -
నైజీరియా పక్షుల సందడి లేదు..
పెదవేగి మండలం కన్నసముద్రం(పెద్దచెరువు) నీరులేక ఒట్టిపోయింది. ఆక్రమణల వల్ల ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా 1800 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమైంది. నీరులేక సాగుకు దూరమైన భూములను వైఎస్సార్ సీపీ నేత ఆలపాటి నరసింహమూర్తి, రైతులు చూపిస్తున్న దృశ్యమిది.. సాక్షి, పశ్చిమగోదావరి : పెదవేగి మండలంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కన్నసముద్రం(పెద్ద చెరువు) చుక్క నీరు లేకుండా ఒట్టిపోయింది. ఈ చెరువుకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1625లో నూజివీడు జమిందారు మేదిన రాయుడు తన తల్లి కన్నమాంబ పేరిట ఈ సముద్రం తవ్వించారు. అప్పటి నుంచి పెదవేగి, దెందులూరు మండలాలకు తాగు, సాగునీరు అందించేది. కాలక్రమంలో చెరువుకు నీరొచ్చే మార్గాలను కొందరు ఆక్రమించుకోవడంతో చెరువు కుంచించుకుపోయింది. ఈ చెరువుకు 600 మీటర్ల దూరంలో పోలవరం కాలువ వెళ్తున్నా.. ఆ నీటిని చెరువుకు మళ్లించే ప్రయత్నం చేయలేదు. గత టీడీపీ హయాంలో ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు పరిధిలో అప్పట్లో 18 వందల ఎకరాలకు సాగునీరు అందేది. సర్ ఆర్ధర్ కాటన్ దొర దీనిని సందర్శించి మెచ్చుకున్నారని చెబుతారు. గతంలో కన్నసముద్రంలో ఏడాది పొడవునా నీరుండేది. నూజివీడు జమిందారు ఏనుగులకు స్నానాలు చేయించేందుకు ఇక్కడకు తీసుకొచ్చే వారంటే దీనికున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు, అలాంటి చెరువులో ఆగస్టు నెల వచ్చినా చుక్క నీరు లేకుండా పోయింది. చెరువు ఎండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో సాగు, తాగు నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ చెరువు అభివృద్ధిని కనీసం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కాలువ నుంచి నీరు ఇచ్చే ఏర్పాటు చేసుంటే తమ పొలాలు సస్యశ్యామలం అయ్యేవని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి చెప్పారు. నేడు నీరు లేక, భూగర్భజలాలు అడుగంటిపోయి ఒక్క ఎకరా పండని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నైజీరియా పక్షుల సందడి లేదు జూన్ నెల వస్తే గతంలో ఈ చెరువు ప్రాంతానికి నైజీరియా నుంచి వివిధ పక్షులు వచ్చి నవంబర్, డిసెంబర్ వరకూ ఉండేవి. చెరువు ఒట్టిపోవడంతో నేడు ఒక్క పక్షి జాడ కూడా లేదు. అటు రైతులకు మేలు చేయడమే కాకుండా వివిధ పక్షులకు ఆవాసంగా ఉన్న ఈ కన్నసముద్రం నేడు కన్నీరు పెడుతోంది. చెరువుకు కేవలం 600 మీటర్ల దూరంలో పోలవరం కుడికాలువ నుంచి నీటిని అందించే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఎత్తిపోతలు మొదలైనా చేరని పుష్కర జలాలు
సాక్షి, తుని(తూర్పు గోదావరి): ఖరీఫ్‌లో సకాలంలో వరినాట్లు వేద్దామని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఈ నెల మొదట వారంలో వేసిస నారుమళ్లు సాగునీటి ఎద్దడితో ఎండిపోతున్నాయి. ఇప్పటికే చెరువులు, రిజర్వాయర్లలో చుక్కనీరులేక వెలవెలబోతున్నాయి. ఈ నెల పదో తేదీన పురుషోత్తంపట్నం వద్ద పుష్కర ఎత్తిపోతలు పథకాన్ని ప్రారంభించినా మెట్టప్రాంతానికి గోదావరి జిలాలు చేరనేలేదు. వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్ నాట్లు సాధ్యమవుతాయని రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ దేవాలయాల్లో వేదపండితులు, అర్చకులు వర్షాలు కురవాలంటూ వరుణ జపాలు, విరాటపర్వం పారాయణాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తేనే ఈ సంవత్సరం ఖరీఫ్ గట్టెక్కుతుందని రైతులు అంటున్నారు. నియోజకవర్గంలో 29 వేల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉంది. ఇందుకు పంపా, తాండవ రిజర్వాయర్లతో పాటు పుష్కర ఎత్తిపోతలు, పిఠాపురం బ్రాంచి కెనాల్, చెరువులు, విద్యుత్ బోరుబావులతో పాటు వర్షాధారం సాగునీరు అందాల్సి ఉంది. ఏటా మెట్ట ప్రాంతంలో రైతులు జూన్‌లో తొలకరి వర్షాలకు నారుమళ్లు, జూలైలో వర్షాలకు వరినాట్లు వేస్తున్నారు. అందుకు భిన్నంగా ఈ సంవత్సరం వర్షాలు పూర్తి స్థాయిలో కువలేదు. అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు ఆరుతడి పంటలతో పాటు రైతులు వరినార్లు వేశారు. డెడ్ స్టోరేజీల్లో రిజర్వాయర్లు నియోజకవర్గంలో తొండంగి మండలానికి పంపా రిజర్వాయర్, కోటనందూరు మండలానికి తాండవ రిజర్వాయర్లు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తుని మండలంలో కొంత భాగానికి పుష్కర జలాలు, మరికొంత భాగానికి తాండవ జలాలు, మిగిలిన భూములను చెరువులు, విద్యుత్ బోర్ల ఆధారంగా సాగుచేస్తున్నారు. తొండంగి మండలంలో 13500 ఎకరాలకు సాగునీరు అందించే పంపా రిజర్వాయర్ నుంచి విడుదల చేసేందుకు చుక్కనీరు అందుబాటులో లేదు. 105 అడుగుల నీటి నిల్వ సామార్థ్యం గల రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటాయి. భారీ వర్షాలు, పుష్కర జలాలు చేరితేనే పంపాకు జల కళ వస్తుంది. అప్పుడు ఆయకట్టుకు సాగునీరు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కోటనందూరు మండలంలో తొమ్మిది వేల ఎకరాలకు తాండవ రిజర్వాయర్ నుంచి సాగునీరు చేరాల్సి ఉంది. 380 అడుగుల నీటి నిల్వ సామార్థ్యం గల రిజర్వాయర్‌లో 345 అడుగుల నీరు ఉంది. డెడ్ స్టోరేజీ 340 కంటే ఐదు అడుగులు నీరుంది. దిగువకు విడుదల చేసేందుకు అవసరమైన నీటి నిల్వలు లేవు. వర్షాధారంగానే తాండవ జలాశయంలోకి నీటి నిల్వలు చేరాల్సి ఉంది. భారీ వర్షాలు కురిస్తేనే తాండవకు జల కళ వస్తుంది. ఆ నీటినే దిగువకు విడుదల చేయాల్సి ఉంది. తుని మండలంలో సాగునీటి పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. పుష్కర కాలువ ద్వారా 6500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా గత ఐదేళ్లలో రెండు వేల ఎకరాలకే నీరు ఇస్తున్నారు. తాండవ నుంచి డి.పోలవరం చెరువుకు నీరు చేరడం ద్వారా ఆయకట్టుకు నీరు అందుతుంది. ఇప్పుడా పరిస్థితులు సన్నగిల్లాయి. తాండవలో చుక్కనీరు లేకపోవడం, వర్షాలు కురవకపోవడంతో సాగునీటి జాడ కనిపించడంలేదు. మండలంలో 77 చెరువులు ఉన్నా 70 చెరువులు ఎండిపోయాయి. ఎటుచూసినా నీటి అవసరాలు తీరే మార్గం కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు. అన్నిటికి ఒక్కటే పరిష్కారంగా భారీ వర్షాలు కురవాలని రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వరుణుడు కరుణిస్తేనే.. సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నా వరుణుడు కరుణిస్తేనే ఖరీఫ్ సాగు చేయగలం. పుష్కర ఎత్తిపోతల నుంచి నీరు విడుదలైనా పూర్తి స్థాయిలో పంట పొలాలకు చేరదు. వర్షాలు కురిస్తే కొంత మేరకు రైతులందరికీ సాగునీరు లభిస్తుంది. భారీ వర్షాలు కురిస్తేనే పుష్కర, తాండవ, పంపా రిజర్వాయర్లకు జలకళ వస్తుంది. – పి.మాణిక్యాలరావు, రైతు, టి.తిమ్మాపురం వారంలో పుష్కర జలాలు ఈ నెల పదో తేదీన పుష్కర ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల్లో 50 కిలో మీటర్ల వరకూ కాలువకు నీరు వచ్చింది. వారం రోజుల్లో తుని మండలానికి పుష్కర జలాలు చేరుతాయి. పంపా రిజర్వాయర్‌కు నీరు మళ్లించి తొండంగి, తుని మండలాలకు సాగునీరు అందిస్తాం. – డి.సూర్యనారాయణ, పుష్కర ఏఈ. తుని -
కాలువ పేరుతో కోట్లు దోపిడీ
సాక్షి, కావలి: నిన్నటి వరకు కావలి అధికార పార్టీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వ నిధుల దోపిడీని యథేచ్ఛగా కొనసాగించారు. నిధుల లూటీలో ఒక వనరుగా ‘కావలి కాలువ’ను ఎంచుకొన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కావలి కాలువ మరమ్మతుల కోసం రూ.55 కోట్లు నిధులు మంజూరయ్యాయి. బీద సోదరులు బినామీలుగా అవతరించి తెరమీద ఉతుత్తి కాంట్రాక్టర్లను పెట్టి, తెర వెనుక ఈ నిధులను కొల్లగొట్టే పనిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. నియోజకవర్గానికి ఉన్న ప్రధాన సాగునీటి వనరు కావలి కాలువ. సాగునీటిని సంగం బ్యారేజ్ నుంచి ప్రారంభమయ్యే కావలి కాలువకు సోమశిల ప్రాజెక్ట్ నుంచి వదులుతారు. 1974లో నిర్మించిన కావలి కాలువ 67 కిలోమీటర్ల పొడవు ఉంది. కాగా కావలి కాలువ కింద ఉండే పొలాలకు మాత్రం సోమశిల జలాలు ఏనాడు పుష్కలంగా అందిన దాఖలాలు లేవు. ఏటా ఒక్క రబీ సీజన్లో మాత్రమే ఒక్క కారు మంటనే రైతులు ఈ కాలువ కింద 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. అయితే వర్షాలు బాగా కురిసి చెరువుల్లో గుంటల్లో, వాగుల్లో నీరు ఉంటే మాత్రం రైతులు ఈ జలాలపై ఆశలు పెట్టుకోరు. టీడీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో వర్షాలు కురవకపోవడంతో సోమశిల జలాలపై ఆశలు పెటుకున్న రైతులకు ఆ నీరు రాక పంటలు సాగు చేసుకోలేక పోయారు. దీనివల్ల నియోజకవర్గంలోని 40 వేల ఎకరాల భూమి బీడుగా మారిపోయింది. కరెంట్ మోటార్ల కింద సాగు చేసిన రైతులు అరకొరగా పండించుకొన్నారు. కనీసం ఆరుతడి పంటలైన పత్తి, పెసర, శనగ సాగు చేసుకోవడానిరి కూడా కావలి కాలువ ద్వారా సోమశిల జలాలు రైతులకు అందలేదు. దీంతో కొద్దిపాటి సాగునీరు కూడా లేక ఆరుతడి పంటలు ఎండిపోవడంతో కావలి కాలువ కింద రైతులు తీవ్రంగా నష్టపోయారు. సరిగ్గా రైతులు సాగునీటి సమస్యతో కుమిలిపోతున్న వైనాన్ని గుర్తించి, కాలువ మర్మమ్మతుల పేరుతో ఈ ఐదేళ్ల కాలంలో రూ.55 కోట్లు మంజూరు అయినప్పటికీ, నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. సోమశిల జలాలు మాత్ర కావలి రైతులకు చుక్క కూడా అందలేదు. ఇది ఇలా ఉండగా ఇటీవల రూ.17 కోట్లు నిధులు కాలువ మరమ్మతులకు మంజూరు అయ్యాయి. ఈ నిధులను కూడా బినామీల ద్వారా కాజేయడానికి త్వరితగతిన టెండర్లు పూర్తి చేయాలని హడావుడి చేశారు. కాని ఆదివారం ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఈ లూటీ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు. ఐదేళ్లలో నీళ్లు చూడనేలేదు మా గ్రామాలకు సోమశిల నీళ్లు అనేది ఈ ఐదేళ్లలో చూడలేదు. వర్షాలు కూడా లేకపోవడంతో వరి సేద్యం చేయడమే మానుకున్నాం. భూములు బీడులుగా మారిపోయాయి.- జంపాని రాఘవులు గౌడ్, రైతు, చెంచుగానిపాళెం, కావలి రూరల్ మండలం సాగునీరు ఇవ్వకుండా జలపూజలు పొద్దస్తమానం జలపూజ అంటూ టీడీపీ నాయకులు కాలక్షేపం చేశారే కానీ, కావలి కాలువ నుంచి మా పొలాలకు సాగునీటిని అందించలేదు. ప్రతి రబీ సీజన్‌కు ముందు ప్రతి ఒక్క ఎకరా కు నీరు ఇస్తామని సినిమా డైలాగులు చెప్పడం, పేపర్లులో రాయించుకోవడం తప్ప అసలు నీరు ఎక్కడ ఇచ్చారు. ఇలాగే గడిచిపోయింది ఈ ఐదేళ్ల కాలం అంతా.- చీకుర్తి కోటయ్య యాదవ్, రైతు, అన్నగారిపాలెం, కావలి రూరల్ మండలం -
వరిసాగు పావుశాతమే!
సాక్షి, హైదరాబాద్: సాగు నీటి వనరులు సక్రమంగా లేకపోవడంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం దాదాపు పావు శాతానికే పరిమితమైంది. ఖరీఫ్‌లో 26.47 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా 6.67 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ ఖరీఫ్‌లో మొత్తం 1.03 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం కాగా ఇప్పటివరకు 76.07 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగింది. పత్తి నూరు శాతం విస్తీర్ణంలో సాగు జరిగింది. అయితే వర్షాలు సకాలంలో కురవకపోవడంతో అనేక చోట్ల వేసిన పత్తి ఎండిపోయింది. ప్రస్తుత వర్షాలకు కాస్త కోలుకున్నట్లేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సోయాబీన్ లక్ష్యానికి మించి 6.27 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 90 శాతం ఎండిపోయిందని చెబుతున్నారు. వర్షాలు కురుస్తున్నా.. 19 శాతం లోటు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ రాష్ర్టంలో 19 శాతం వర్షపాత లోటు కనిపిస్తోంది. బుధవారం నాటికి 44.8 సెం.మీ. వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 36.2 సెం.మీ. మాత్రమే కురిసింది. దీంతో నిజామాబాద్, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది జూన్‌లో 12.56 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తే అదే ఏడాది జూలైలో 12.73 మీటర్ల లోతుకి నీరు అడుగంటాయి. గత ఏడాది జూలైతో పోలిస్తే ఏకంగా 2.17 మీటర్ల లోతుకి కూరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... బంగాళాఖాతంలో అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కరీంనగర్, మంథనిలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రుద్రూరు, కాళేశ్వరంలో 10 సెంటీమీటర్ల చొప్పున పడింది. కోటగిరిలో 9 సెం.మీ., వర్ని, బెజ్జంకిలో 8 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రైతు నెత్తిన రాయితీ
బి.కొత్తకోట : ప్రయివేటు సంస్థలకు ఎర్ర తివాచీ పరచి ఇబ్బడిముబ్బడిగా రాయితీలను అందిస్తున్న ప్రభుత్వం కరువురైతుల కోసం కొద్దిపాటి రాయితీని భరించలేని దుస్థితిలో ఉంది. పంటలు పెట్టి వందలకోట్ల పెట్టుబడులను కోల్పోతున్న రైతులకు ఏటా ఖరీఫ్‌లో పంపిణీ చేస్తున్న వేరుశెనగ రాయితీ విత్తనకాయలపై ఎన్నడూలేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఈసారి కిలోకు ఒకేసారి రూ.13.90 పెంచేసింది. ఇంతకు ముందున్న ప్రభుత్వాలేవీ ఈ స్థాయిలో ధరను పెంచిందిలేదు. కరువు రైతులపై కనికరం చూపాల్సిన సమయంలో ధరలతో బాదేస్తోంది. శ్వాశత సాగునీటి వనరులులేని జిల్లాలో 90శాతం రైతులు ఖరీఫ్ వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రధానంగా పడమటి రైతాంగానికి ఖరీఫ్పంటలే దిక్కు. అత్యధికంగా వేరుశెనగ సాగయ్యేది ఈ ప్రాంతంలోనే. ప్రస్తుతం కిలో విత్తనకాయల ధర రూ.71.50 కాగా ప్రభుత్వం రూ.23.6 రాయితీ భరించి, రూ.47.50తో పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. వరుస బాదుడిలా.. 2010 ఖరీఫ్‌లో జిల్లా రైతులకు రాయితీపై ప్రభుత్వం విత్తనకాయలను కిలో రూ.25కే సరఫరా చేశారు. 2011లో రూ.10 అదనపు భారం మోపి కిలో రూ.35కు పెంచారు. టీఎంవీ-2, నారాయణి, జేఎల్-24, పొల్లాచి రకం రూ.35తో, కె-6ను కిలో రూ.36తో పంపిణీ చేసింది. 2012లో రూ.19.50 రాయితీతో కిలో ధర రూ.39.50తో పంపిణీ చేశారు. 30కిలోల బస్తా ధర రూ.1,770 కాగా రూ.1,185కు ఇచ్చారు. 2013 ఖరీఫ్‌లో విత్తనకాయలు కిలోధర రూ.63.50గా నిర్ణయించగా, ప్రభుత్వం రూ.21 రాయితీ భరించి రూ.42.50కు పంపిణీచేసింది. 2014 ఖరీఫ్‌లో కిలో విత్తనకాయల అసలుధర రూ.50.90 కాగా రూ.16.90 రాయితీతో రూ.34తో రైతులకు సరఫరా చేశారు. ప్రస్తుతం రూ.47.90తో విత్తనకాయల పంపిణీకి నిర్ణయించడంతో కిలోపై రైతుకు రూ.13.90 పైసల భారం పడింది. నాలుగేళ్లలో రూ.31.36కోట్లు కరువురైతు చేతిలో పదివేలుంటే ఖరీఫ్‌లో కొద్దిపాటి పంటనైనా పెట్టుకొంటాడు. అలాంటిది జిల్లా రైతులపై పాలకులు విత్తనకాయలపై భార ం మోపూతూనే ఉన్నారు. ఖరీఫ్ సాగంటే దైవాధీనమే. ఈ పరిస్థితుల్లో రైతుల విషయంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించాలి. అలాంటి ప్రభుత్వాలే ధరలభారం మోపుతున్నాయి. పెరిగిన ధరతో రాయితీ విత్తనకాయల కోసం నాలుగే ళ్లలో రూ.31.36కోట్ల భారం భరించారు. 2011లో రూ.9.30 కోట్లు, 2012లో రూ.3.85 కోట్లు, 2013లో రూ.3.9కోట్లు భారాన్ని భరించారు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 1.3లక్షల క్వింటాళ్ల విత్తనకాయలపై అదనంగా రూ.14.31కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది.