IRS officials
-
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి.. ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఎస్బిఆర్.కుమార్‌లకు బాధ్యతలు అప్పగించారు. -
కోవిడ్-19 : సం‘పన్ను’లపై ప్రకంపనలు
న్యూఢిల్లీ : ప్రస్తుత సంక్షోభ సమయంలో అత్యంత సంపన్నులపై పన్ను విధించాలనే ప్రతిపాదనకే ప్రకంపనలు రేగుతున్నాయి. సంపన్నులపై పన్నుపోటు సూచనే ప్రభుత్వంలో ఉలికిపాటు కలిగిస్తోంది. ప్రభుత్వానికి వచ్చే సూచనలను పరిశీలించడం, అమలు చేయతగినవి ఉంటే వాటిపై కసరత్తు జరపడం సాధారణంగా జరిగేదే. మరి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే..కరోనా మహమ్మారి వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కకావికలమైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అత్యంత సంపన్నులపై వెల్త్ ట్యాక్స్‌తో పాటు కోవిడ్ -19 సెస్‌ను విదించాలన్న 50 మంది యువ ఐఆర్ఎస్ అధికారుల ప్యానెల్ సమర్పించిన విధాన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. సంసన్నులపై ఆదాయ పన్ను రేట్లను పెంచాలన్న ప్రతిపాదనకూ సాధ్యాసాధ్యాలను ప్రజల ముందుంచకుండానే ఆర్థిక మంత్రిత్వ శాఖ విముఖత చూపింది. ఈ నివేదిక కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ఉద్దేశాలను ప్రతిబింబించదని ఆదాయ పన్ను శాఖ ప్రకటన స్పష్టం చేసింది. ఐఆర్ఎస్ అధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాలు, సూచనలతో ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రభుత్వ ఉద్యోగులు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా అనుమతి కోరలేదని, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇక కోవిడ్-19 మహమ్మారి ప్రబావాన్ని ఎదుర్కొనేందుకు ఫోర్స్ పేరిట రూపొందించిన విధాన పత్రంలో ఈ సూచనలు పొందురిచామని ఐఆర్ఎస్ అధికారులు పేర్కొన్నారు. ఈ నివేదికను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కి సమర్పించామని వారు చెప్పారు. ఐఆర్ఎస్ అధికారులు తమ నివేదికను ట్విటర్లో పొందుపరిచారు. చదవండి : బ్రిటన్‌లో లక్ష వరకు కరోనా మృతులు పన్నుపోటుపై కలవరపాటు.. ఏడాదికి రూ కోటికి పైగా ఆదాయం ఉన్న వారికి ఆదాయ పన్ను రేటును 40 శాతానికి పెంచాలని, రూ 5 కోట్లు పైబడిన వార్షికాదాయంపై వెల్త్ ట్యాక్స్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని నివేదికలో పేర్కొంది. పన్ను చెల్లించదగిన ఆదాయం రూ పది లక్షలు పైబడిన వారిపై 4 శాతం మేర కోవిడ్-19 సెస్‌ను విధించాలని నివేదికలో సూచించారు. కోవిడ్-19 సెస్ ద్వారా రూ 18,000 కోట్ల పన్ను రాబడి ఆర్జించవచ్చని నివేదిక వివరించింది. వీటితో పాటు పలు సూచనలను నివేదికలో ప్రస్తావించారు. సంక్లిష్ట సమయంలో దేశ విశాల ప్రయోజనాలను కాపాడటం సూపర్ రిచ్ బాధ్యతని ఐఆర్ఎస్ అధికారులు రూపొందించిన విధాన పత్రం స్పష్టం చేసింది. కీలక ప్రాజెక్టులపై వ్యయం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన 5 నుంచి 10 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రబుత్వం గుర్తించి సంన్నులపై విధించిన పన్నుల ద్వారా సమకూరిన రాబడిని నిర్ధిష్ట ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు వెచ్చించాలని నివేదిక కోరింది. దేశంలో 1985 వరకూ అమల్లో ఉన్న వారసత్వ పన్నును కూడా తిరిగి ప్రవేశపెట్టాలని ఈ విధాన పత్రం సూచించింది. మరోవైపు నివేదికలో ఉన్న అంశాలపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. దేశంలో ఆదాయ పన్నురేట్లు మరింత పెంచితే వినియోగం దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా ప్రతిపాదనలు అమలు చేస్తే మిలియనీర్లు దేశం విడిచివెళ్లడం ఖాయమని కొందరు చెప్పుకురాగా, మరికొందరు నెటిజన్లు మాత్రం సంక్షోభ సమయంలో సూపర్ రిచ్ బాధ్యత తీసుకోవాల్సిందేనని అబిప్రాయపడ్డారు నివేదికపై నిప్పులు నివేదికలో లేవనెత్తిన అంశాలపై కీలక చర్చకు తెరలేపాల్సిన తరుణంలో ఐఆర్ఎస్ అధికారులు తమ నివేదికను ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది క్రమశిక్షణారాహిత్యమే కాకుండా బాధ్యతారాహిత్యమని పేర్కొంటోంది. ఐఆర్ఎస్ అధికారుల ప్రవర్తనపై వారిని వివరణ కోరాలని సీబీడీటీ చీఫ్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది . ఇక సూపర్ రిచ్‌పై పన్ను ప్రతిపాదనకే ఇంతటి వివాదం చెలరేగిన నేపథ్యంలో వారిపై ఎలాంటి పన్ను భారాలు మోపేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదనేందుకు ఇది సంకేతమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విపత్కాలంలో పేదలు, ఆపన్నులను ఆదుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు వచ్చే నిర్మాణాత్మక సూచనలను కేంద్రం పరిశీలించి అర్హమైన సూచనల అమలుకు పూనుకోవాల్సి ఉంది. -
‘నసిన్’ వెబ్సైట్ హ్యాక్
పాక్ హ్యాకర్ల పనిగా అనుమానం సాక్షి, హైదరాబాద్ : నేషనల్ అకాడెమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ (నసిన్) అధికార వెబ్సైట్ బుధవారం హ్యాకింగ్‌కు గురైంది. నగరానికి చెందిన కొందరు ఐఆర్ఎస్ అధికారులు ఈ హ్యాకింగ్ విషయం తొలుత గుర్తించారు. వీరు వెంటనే హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అకాడెమీని అప్రమత్తం చేశారు. తక్షణం రంగంలో దిగిన నిపుణులు వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్ల పనిగా అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర నిఘా వర్గాలతో పాటు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) సైతం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ‘నసిన్’లో ఐఆర్ఎస్ అధికారులతో పాటు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోల్లో పని చేయనున్న వారికి శిక్షణ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ శిక్షణ పొందిన ఐఆర్ఎస్ల్లో అనేక మంది ప్రస్తుతం నగరం కేంద్రంగా వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు నిత్యం ‘నసిన్’ వెబ్సైట్ అప్డేట్స్ కోసం వీక్షిస్తుంటారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వారికి హోం పేజ్ ఓపెన్ కాలేదు. ఆ స్థానంలో ‘హ్యాక్డ్ బై ఫైసల్ 1337’ అనే అక్షరాలు కనిపించాయి. తాము పాకిస్తాన్‌కు చెందిన సైబర్ ఎటాకర్స్ టీమ్‌కు చెందిన వారమంటూ.. సమాచారం కోసం ఫేస్బుక్ ద్వారా తమను సంప్రదించాలని సూచించారు. చివరలో పాకిస్తాన్ జిందాబాద్ అని ఉంది. ఈ హ్యాకింగ్ వ్యవహారాన్ని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి. -
పన్ను వసూళ్లలో సముచితంగా వ్యవహరించాలి
ఐఆర్ఎస్ అధికారులతో ఆర్థిక మంత్రి జైట్లీ న్యూఢిల్లీ: పన్ను వసూళ్ల విషయంలో ‘స్థిరంగాను, సముచితంగాను’ వ్యవహరించాలని ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. పన్ను వసూలు అధికారులు ఎటువంటి మినహాయింపులు, డిస్కౌంట్లూ ఇవ్వరాదన్నారు. ఐఆర్ఎస్ (కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్) ప్రొబేషనర్ల 66వ బ్యాచ్ శిక్షణను ప్రారంభించిన సందర్భంగా అరుణ్ జైట్లీ ఈ విషయాలు చెప్పారు. ఏ విధమైన పన్నులు విధించాలి, ఎలాంటివి విధించకూడదు అన్న అంశంలో సమతౌల్యత పాటించాలని సూచించారు. ‘పన్నుల చట్టాలు పటిష్టంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. పన్నుల పరిధిలోకి వచ్చే వాటిపై విధించడం, రాని వాటిపై పన్నుల భారం పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మీరు సమతౌల్యత పాటించగలగాలి’ అని జైట్లీ చెప్పారు. 2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే వస్తు, సేవల పన్నుల(జీఎస్టీ) విధానం తీరుతెన్నులను ఆకళింపు చేసుకుని, సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు. -
లెక్క తేల్చండి
సాక్షి, మంచిర్యాల : సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు నెలరోజులు కావస్తున్నా బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించడం లేదు. ఎన్నికల ఖర్చు వివరాలు అందజేసేందుకు మరో రెండ్రోజులే గడువు ఉన్న నేపథ్యంలో అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఈనెల 16న అభ్యర్థులు సమర్పించిన వివరాలు పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నారు. సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో ఆయా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వివరాలు ఎన్నికల అధికారులకు అందజేయాలి. ఎన్నికల ఫలితాలు గత నెల 16న వెలువడిన విషయం తెలిసిందే. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాల పరిశీలకులుగా ఆడిట్, సహకార అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. వీరికి ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వివరాలు అంద జేయాలి. సమర్పించకపోతే అనర్హులే.. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థు లు, ఒక పార్లమెంటు స్థానానికి 8 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. వీరిలో గెలిచి వారితోపాటు ఓడి న వారు వారి ఖర్చుల వివరాలు సమర్పించాలి. వీరి లో 25 మంది మాత్రమే వ్యయ వివరాలు ఇచ్చారు. వి జయం సాధించిన వారిలో ఒక్కరూ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించకపోవడం గమనార్హం. ఎంపీ అభ్యర్థుల్లో కేవలం ఓడిన ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఇప్పటికీ వివరాలు అందించారు. ఎన్నికల ఖర్చు వివరాలు సమర్చించని పక్షంలో వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. ఈ ఖర్చు వివరాలను బరిలో నిలిచిన అభ్యర్థులు లే దా వారి తరఫున ఆధీకృతులైన వారు అందజేయవ చ్చు. అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే వివరాలు అందించడం ఆసక్తికరం. ఓడిపోయిన వారు వివరా లు సమర్పించని పక్షంలో భవిష్యత్తులో వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. వాస్తవ ఖర్చుకు.. దస్త్రాల సమర్పణకు పొంతనే లేదు.. ఎన్నికల పోరులో నిలిచిన అభ్యర్థులు చేస్తున్న ఖర్చు కు, ఎన్నికల సంఘం విధించిన పరిమితికి పొంతనలేని పరిస్థితులు వాస్తవంగా నెలకొని ఉన్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎంపీగా పోటీచే సే అభ్యర్థి రూ.70 ల క్షలు, ఎమ్మెల్యేగా బరిలో ఉండే వ్యక్తి రూ.28 లక్షలు ఖర్చు చేయవచ్చు. ఈ ఖర్చులోనే నామినేషన్ మొదలుకొని పోలింగ్ వరకు జరిగిన వ్యయాలను పొందుపర్చాలి. అంటే అభ్యర్థి ప్రచారం, అభ్యర్థులకు మద్దతుగా ఇతరులు పాల్గొనడం, వాహనాలు, జెండాలు, ఇతరత్రా వాటికి వ్యయాల వివరాలు ఇందులో పొందుపర్చాలి. అయితే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెజార్టీ అభ్యర్థుల వాస్తవ ఖర్చు కోట్ల రూ పాయల్లోనే ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఎన్నికల అధికారులు నిర్దేశించిన ఖర్చు పరిమితిలోనే ఈ వివరాలను ఎలా పొందుపరచాలని అభ్యర్థులు ఆలోచిస్తుండటం గమనార్హం. 16న పరిశీలకుల రాక అభ్యర్థులు వివరాలు సమర్పించేందుకు కల్పించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈనెల 16న కేంద్ర ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఐఆర్ఎస్ అధికారులు అబ్దుల్హసీం.ఎం, రోహన్‌రాజ్, ఇతర అధికారులు ఆర్.నిరంజన్, అశోక్‌కుమార్‌లు ఈ బృందంలో ఉం టారని తెలిపారు. ఆదాయ వివరాలను సమర్పించని వారి విషయంలో ఉపేక్షించేదిలేదని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. గెలిచిన వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం సైతం ఉందని స్పష్టం చేశారు.