లెక్క తేల్చండి | give details for the cost of election | Sakshi
Sakshi News home page

లెక్క తేల్చండి

Published Fri, Jun 13 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

లెక్క తేల్చండి

లెక్క తేల్చండి

సాక్షి, మంచిర్యాల : సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు నెలరోజులు కావస్తున్నా బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాలు సమర్పించడం లేదు. ఎన్నికల ఖర్చు వివరాలు అందజేసేందుకు మరో రెండ్రోజులే గడువు ఉన్న నేపథ్యంలో అధికారులు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. ఈనెల 16న అభ్యర్థులు సమర్పించిన వివరాలు పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నారు.

సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన 30 రోజుల్లో ఆయా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వివరాలు ఎన్నికల అధికారులకు అందజేయాలి. ఎన్నికల ఫలితాలు గత నెల 16న వెలువడిన విషయం తెలిసిందే. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాల పరిశీలకులుగా ఆడిట్, సహకార అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. వీరికి ఆయా స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వివరాలు అంద జేయాలి.
 
సమర్పించకపోతే అనర్హులే..
జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థు లు, ఒక పార్లమెంటు స్థానానికి 8 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. వీరిలో గెలిచి వారితోపాటు ఓడి న వారు వారి ఖర్చుల వివరాలు సమర్పించాలి. వీరి లో 25 మంది మాత్రమే వ్యయ వివరాలు ఇచ్చారు. వి జయం సాధించిన వారిలో ఒక్కరూ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించకపోవడం గమనార్హం. ఎంపీ అభ్యర్థుల్లో కేవలం ఓడిన ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఇప్పటికీ వివరాలు అందించారు.
 
ఎన్నికల ఖర్చు వివరాలు సమర్చించని పక్షంలో వారిని అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది. ఈ ఖర్చు వివరాలను బరిలో నిలిచిన అభ్యర్థులు లే దా వారి తరఫున ఆధీకృతులైన వారు అందజేయవ చ్చు. అయినప్పటికీ కొద్దిమంది మాత్రమే వివరాలు అందించడం ఆసక్తికరం. ఓడిపోయిన వారు వివరా లు సమర్పించని పక్షంలో భవిష్యత్తులో వారిని పోటీకి అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల అధికారులకు ఉంటుంది.
 
వాస్తవ ఖర్చుకు.. దస్త్రాల సమర్పణకు పొంతనే లేదు..
ఎన్నికల  పోరులో నిలిచిన అభ్యర్థులు చేస్తున్న ఖర్చు కు, ఎన్నికల సంఘం విధించిన పరిమితికి పొంతనలేని పరిస్థితులు వాస్తవంగా నెలకొని ఉన్నాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎంపీగా పోటీచే సే అభ్యర్థి రూ.70 ల క్షలు, ఎమ్మెల్యేగా బరిలో ఉండే వ్యక్తి రూ.28 లక్షలు ఖర్చు చేయవచ్చు. ఈ ఖర్చులోనే నామినేషన్ మొదలుకొని పోలింగ్ వరకు జరిగిన వ్యయాలను పొందుపర్చాలి.

అంటే అభ్యర్థి ప్రచారం, అభ్యర్థులకు మద్దతుగా ఇతరులు పాల్గొనడం, వాహనాలు, జెండాలు, ఇతరత్రా వాటికి వ్యయాల వివరాలు ఇందులో పొందుపర్చాలి. అయితే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెజార్టీ అభ్యర్థుల వాస్తవ ఖర్చు కోట్ల రూ పాయల్లోనే ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఎన్నికల అధికారులు నిర్దేశించిన ఖర్చు పరిమితిలోనే ఈ వివరాలను ఎలా పొందుపరచాలని అభ్యర్థులు ఆలోచిస్తుండటం గమనార్హం.
 
16న పరిశీలకుల రాక
అభ్యర్థులు వివరాలు సమర్పించేందుకు కల్పించిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈనెల 16న కేంద్ర ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఐఆర్‌ఎస్ అధికారులు అబ్దుల్‌హసీం.ఎం, రోహన్‌రాజ్, ఇతర అధికారులు ఆర్.నిరంజన్, అశోక్‌కుమార్‌లు ఈ బృందంలో ఉం టారని తెలిపారు. ఆదాయ వివరాలను సమర్పించని వారి విషయంలో ఉపేక్షించేదిలేదని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. గెలిచిన వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం సైతం ఉందని స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement