isis attacks
-
ఆప్ఘన్లో బాంబు పేలుళ్లు.. తాలిబన్లు అలర్ట్
కాబూల్: అఫ్గానిస్థాన్‌లో ఐఎస్ఐఎస్(ISIS) తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర అఫ్గానిస్థాన్‌లో గురువారం రాత్రి మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ రెండు బాంబు పేలుళ్లలో 9 మంది మృతిచెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబన్ అధికారులు తెలిపారు. దీంతో తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే. షియాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు ముష్కరులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్(ISIS) తెలిపింది. ఇది కూడా చదవండి: చెప్పినట్లు వింటావా.. లేదంటే మరో 20 మంది మగాళ్లను తీసుకురమ్మంటావా? -
పోరాట స్ఫూర్తి
‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ మొదలైంది. చిత్రాభిమానుల విశిష్ట పండగ లో ఈసారి రెండు విశేషాలు ఉన్నాయి. మొదటి విశేషం... చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యే సగం చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మహిళా దర్శకుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. ప్రారంభ చిత్రంగా ప్రదర్శితమైన బంగ్లాదేశ్ చిత్రం ‘రెహన మరియమ్ నూర్’ మహిళల సమస్యను ప్రతిబింబిస్తుంది. 37 సంవత్సరాల రెహన మెడికల్ కాలేజి ప్రొఫెసర్. ఒక బిడ్డకు తల్లిగా, అమ్మకు కూతురిగా, సోదరుడికి అక్కగా ఆమె వ్యక్తిగత జీవితానికి, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌గా వృత్తి జీవితానికి మధ్య సమన్వయం, వాటి మధ్య తలెత్తే వైరుధ్యాలు, వాటి పరిష్కారం కోసం చేసే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తుంది.రెండో విశేషం... ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుర్దిష్ ఫిల్మ్‌మేకర్ లిసా కలన్ను ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ పురస్కారంతో సత్కరిస్తారు. కొన్ని నిజజీవిత కథలు, కల్పన కంటే ఆశ్చర్యపరుస్తాయి. ‘లిసా కలన్’ది అచ్చంగా అలాంటి కథ... ఐసిస్ ఉగ్రవాదుల బాంబుదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకుంది లిసా. అయితే ఆమె పోగొట్టుకుంది కాళ్లు మాత్రమే. ఆమెలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, దూసుకుపోయే తత్వం ఎక్కడికీ పోలేదు. ‘హిడెన్’ అనే సినిమాకు ఆర్ట్‌డైరెక్టర్‌గా వ్యవహరించడంతో పాటు నటించింది. ‘వాయిస్ ఆఫ్ ది స్ట్రీట్’ సినిమాకు సౌండ్ అండ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించింది. ఎన్నిరకాల సృజనాత్మక బాధ్యతలను చేపట్టినా ఆమె నమ్మిన సూత్రం ... బాధితుల గొంతును ప్రపంచానికి వినిపించాలని. ఇందుకు చిత్రాలను బలమైన ఆయుధంగా ఎంచుకుంది. టర్కీలోని కుర్ద్‌ల కుటుంబంలో పుట్టిన లిసా, బాల్యంలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంది. రాజ్యహింసను దగ్గర నుంచి చూసింది. హైస్కూల్ చదువుతోనే ఆమె చదువు ఆగిపోయింది. దీనికి కారణం...పై చదువులు తన మాతృభాషలో కాకుండా ‘టర్కిష్’లో మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండడం. చదువుకు దూరమైనప్పటికీ ‘అరమ్ టైగ్రన్ సిటీ కన్జర్వేటరీ’లో సినిమా పాఠాలు చదువుకుంది. విస్తృతమైన ప్రపంచాన్ని చూసింది. సినిమా కోర్స్ తన మాతృభాష లోనే ఉండడం ఆమెకు బాగా నచ్చిన విషయం. ఈ చిత్రకళల ఆలయంలో తాను గడిపిన రెండు సంవత్సరాల కాలం విలువైనది. విలువల గురించి తెలుకునేలా చేసింది. ఆ తరువాత... ఊరు, వాడ, పల్లె, పట్లణం అనే తేడా లేకుండా కుర్దుల జీవితాన్ని చూడడానికి తిరిగింది. ముఖ్యంగా కుర్దీష్ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు లిసాను కదిలించాయి. వారి ఆత్మగౌరవ పోరాటం ఆకట్టుకుంది. తాను చూసిన దృశ్యాలను పొలిటికల్ డాక్యుమెంటరీల రూపంలో ప్రపంచానికి చూపింది. మృత్యువు ఎదురొచ్చిన రోజు... జూన్, 2015లో దియర్బకిర్ నగరంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో పాల్గొంది లిసా. పార్టీని లక్ష్యంగా చేసుకొని ‘ఐసిస్’ ఉగ్రవాదులు చేసిన బాంబుదాడిలో మృత్యువు అంచుల వరకు వెళ్లింది లిసా. రెండు కాళ్లు పోగొట్టుకుంది. ‘లిసా బతకడం అరుదైనఅదృష్టం’ అన్నారు. మంచమే ఆమె ప్రపంచం అయింది. తాను అమితంగా ప్రేమించిన చిత్రప్రపంచం దూరమైపోయింది. ‘ఇంటిపట్టునే ఉండు తల్లీ ఎందుకొచ్చిన కష్టాలు!’ అన్నవాళ్లతోపాటు– ‘రెండు కాళ్లే పోయినప్పుడు, ఇంట్లో పడుండక ఏమి చేస్తుంది’ అని వెక్కిరించిన వాళ్ళూ ఉన్నారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఆరు సంవత్సరాలు నరకప్రాయంగా గడిచాయి. వేరే వాళ్లలో అయితే జీవన ఆసక్తి అంటూ లేకుండా పోయేదేమోగానీ లిసా మాత్రం మళ్లీ అడుగులు వేసింది. ఈసారి కృత్రిమకాళ్లతో! గతంలోలాగే ఉద్యమాలలో భాగం అయింది. చిత్రాలను తీయడం మొదలు పెట్టింది. ‘ఎందరి జీవితాలనో తెరకెక్కించింది లిసా. నిజానికి ఆమె జీవితమే ఒక అద్భుతమై చిత్రం’ అనే మాట తిరువనంతపురం చిత్రోత్సవంలో నలుమూలలా వినిపిస్తూనే ఉంది. -
ఐరాస నివేదికపై భారత్ అసంతృప్తి
ఐరాస: ఐసిస్ ఉగ్రవాద సంస్థపై ఐరాస సెక్రటరీ జనరల్ విడుదల చేసిన నివేదికపై భారత్ అసహనం వ్యక్తం చేసింది. పాక్ స్థావరంగా కార్యకలాపాలు నిర్వహించే లష్కరేతోయిబా, జేషే మహ్మద్ సంస్థలకు ఐసిస్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి పలు మార్లు హెచ్చరించినా నివేదికలో పేర్కొనలేదని భారత్ అసంతృప్తి తెలిపింది. అఫ్గాన్‌లో ఐసిస్ అకృత్యాలపై ఐరాస్ 14వ సెక్రటరీ జనరల్ రిపోర్టును ఇటీవల విడుదల చేసింది. పాక్ మద్దతుతో హక్కానీ నెట్వర్క్ విస్తరించడాన్ని, పలు ఉగ్రసంస్థలకు ఆల్‌ఖైదా, ఐసిస్‌తో ఉన్న సంబంధాలను విస్మరించకూడదని ఐరాసలో భారత ప్రతినిధి తిరుమూర్తి వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రబంధాలపై భారత్ పలుమార్లు వివరాలందించిందని, ఆందోళన వ్యక్తం చేసిందని, కానీ కార్యదర్శి నివేదిక ఈ బంధాలను ప్రస్తావించలేదని చెప్పారు. భవిష్యత్‌లోనైనా సభ్యదేశాల ఆందోళనను పట్టించుకొని నివేదికలు రూపొందించాలని కోరారు. పాక్ నుంచి తాము ఎదుర్కొంటున్న ఉగ్రముప్పుపై భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందన్నారు. ఆసియాలో ఐసిస్ విస్తరణకు యత్నించడాన్ని నివేదికలో పొందుపరిచారు. దీనిపై తిరుమూర్తి స్పందిస్తూ, ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. -
ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!
రాఖా: సిరియా రాజధాని రాఖాలోని అల్-నైమ్ స్క్వేర్(ట్రాఫిక్ సిగ్నల్) ఒకప్పుడూ బహిరంగంగా మరణశిక్షలు అమలు పరిచే భయంకరమైన వేదిక. కానీ ఇప్పడూ అది ప్రేమికులు, కుటుంబాలు, స్నేహితులు సమావేశమయ్యే అందమైన ప్రదేశం. అయితే ఈ ప్రాంతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆక్రమణతో 2014 నుంచి 2017 వరకు ఆ ప్రదేశం రక్తం చిమ్ముతూ భయనకంగా ఉండేది. (చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను) అంతేకాదు ఆ ప్రాంతంలో జిహాదీలు స్క్వేర్‌లో తమ ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారని, మతభ్రష్టులు లేదా నేరస్థులుగా భావించే వారిపై ధ్వజమెత్తడం, శిలువ వేయడం, శిరచ్ఛేదం చేయడం వంటివి చేశారు. దీంతో అక్కడ స్థానికులు ఆ ప్రదేశాన్ని "రౌండబౌట్ ఆఫ్ హెల్" గా పిలిచేవారు. ఆ ప్రదేశంలోని స్థానికుడు హుస్సేన్ అనే వ్యక్తి తాను ఆ సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లడానికి కూడా చాలా భయపడేవాణ్లి అంటూ చెప్పుకొచ్చాడు. ఐఎస్ఐఎస్లు నగరాన్ని వదిలి వెళ్లిన తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వ కళావైభవాన్ని సంతరించుకుంది. అంతేకాదు ఇప్పుడిప్పుడే జిహాదీల చీకటియుగం నుంచి ప్రజలు బయటపడుతున్నారు. నిజానికి అల్-నైమ్ (స్వర్గం) అనేది ట్రాఫిక్ సర్కిల్‌తో చక్కగా రౌండ్ స్క్వేర్లా నిర్మించబడిన బహిరంగ ప్రదేశం. అక్కడ ఒకవైపు అందమైన పౌంటైన్లతో మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు మరోవైపు చక్కటి రెస్టారెంట్లతో సందడిగా ఉండే ఆహ్లాదకరమైన ప్రదేశం. కానీ ఇప్పటికీ సిరియావాసులకు ఆ ప్రదేశం వద్దకు రాగానే తాము అనుభవించిన నరకం, భయానక దృశ్యాలే కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) -
Kabul Airport Attack: వెంటాడి వేటాడి మట్టుపెడతాం: బైడెన్
Kabul Airport Blast: కాబూల్ ఎయిర్పోర్ట్ మారణహోమంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సహకారంతో అమెరికాకు తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఐసిస్ ఖోరసాన్(కె) గ్రూపు మానవ బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దుర్ఘటనల్లో 60 మంది చనిపోగా(70 నుంచి 90 మధ్య అంచనా).. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక కాబూల్ ఎయిర్పోర్ట్ జంట పేలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగంగా ప్రసంగించారు. గురువారం వైట్ హౌజ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘‘బాధ్యులెవరైనా క్షమించే ప్రసక్తే లేదు. వాళ్లెవరైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంతతేలికగా మేం మరిచిపోం. ఈ దాడితో ఉగ్రవాదం గెలిచినట్లే కాదు. వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైనట్లే’’ అంటూ ఉద్రేకపూర్వకంగా ప్రసంగించారు. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల సేవల్ని జ్ఞప్తి తెచ్చుకున్న ఆయన.. మరణించిన వాళ్లకు సంఘీభావంగా కాసేపు మౌనంగా ఉండిపోయారు. జరిగిన నష్టానికి తానే బాధ్యత అని ప్రకటించుకున్న బైడెన్.. సైన్యం తరలింపు ఆలస్యానికి తమ నిర్ణయాలే కారణమని స్పష్టం చేశారు. అయితే ఈ దాడి తరలింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అనుకున్న గడువులోపు(ఆగస్టు 31) తాలిబన్ల సహకారంతో సైన్యం-పౌరుల తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న మాటను కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారు. తాము శాంతిని కొరుకుంటున్నామని ప్రకటించుకున్న తాలిబన్లు(ది ఇస్లామిక్ ఎమిరేట్స్).. పౌరులను లక్క్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం పహారా కాస్తున్న ప్రాంతంలోనే దాడి జరిగిందంటూ తాలిబన్ ప్రతినిధి ఒకరు ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేశాడు. చదవండి: కాబూల్ విమానాశ్రయం: మారణహోమం ఇలా.. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల నిఘాలో ఉన్నట్లు బైడెన్ ప్రకటించిన కొన్ని గంటలకే కాబూల్ హమీద్ కర్జాయ్ ఎయిర్పోర్ట్ అబ్బే గేట్ వద్ద ఓ బాంబు పేలుడు, బారోన్ హోటల్ వద్ద మరో పేలుడు జరగడం విశేషం. అమెరికన్లను లక్క్ష్యంగా చేసుకుని ఐసిస్ ఖోరసాన్(కె)ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. సూసైడ్ బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. క్లిక్ చేయండి: టార్గెట్‌లో ఉన్నారు.. జాగ్రత్త: బైడెన్ President Joe Biden pauses as he listens to a question as he speaks about the attack at Kabul airport that killed at least 12 U.S. service members pic.twitter.com/iKDAdcXwQy — Evan Vucci (@evanvucci) August 26, 2021 చిన్నపిల్లలు, అఫ్గన్ పౌరులు, తాలిబన్ గార్డులు ఘటనల్లో గాయపడినట్లు తెలుస్తోంది. ఆ జంట పేలుళ్లలో 13 మంది అమెరికన్ సైనికులు చనిపోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి తర్వాత పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించిన బైడెన్.. తరలింపు ప్రక్రియ కొనసాగునుందని ప్రకటించారు. ఇప్పటికే లక్ష మందికి పైగా అఫ్గన్లను(వాళ్లలో ఐదువేల మంది అమెరికన్లు), మరో వెయ్యి మందిని తరలిస్తే ఆపరేషన్ పూర్తైనట్లేనని అమెరికా రక్షణ దళ జనరల్ మెక్కెంజీ ప్రకటించారు. -
ఇరాక్‌లో మరోసారి ఐసిస్ దాడులు
-
పారిస్ మృతులకు నివాళి
-
పారిస్ మృతులకు నివాళి
పారిస్: పారిస్ నగరంలో ఉగ్రదాడి మరణమృదంగాన్ని మోగించింది. అత్యవసర పరిస్థితి, మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ చూసినా శ్మశాన వాతావరణం నెలకొంది. ముష్కరమూకల భీకరదాడిలో అసువులు బాసిన తమ బంధువులు, సన్నిహితులకు పారిస్ ప్రజలు శోకతప్త హృదయమాలతో నివాళులర్పిస్తున్నారు. దాడుల్లో నష్టపోయినా, గాయపడినా, వెన్ను చూపేదిలేదనే సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. నిబ్బరంగా, ధైర్యంగా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఎదుర్కొని తీరతామంటున్నారు. మరోవైపు పారిస్‌లో నరమేధానికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్, సిరియా) ప్రకటించుకున్నది. పారిస్ దాడికి ఒకరోజు ముందు ఫ్రాన్స్‌ను హెచ్చరిస్తూ ఐఎస్ఐఎస్ విదేశీ మీడియా విభాగం అల్ హయత్ మీడియా సెంటర్ ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. సిరియాలో దాడులు ఆపకపోతే.. మిమ్మల్ని ప్రశాంతంగా బతుకనివ్వమనే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అరబిక్ భాషలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. పారిస్ దాడికి ఒకరోజు ముందు ఆ వీడియో విడుదల చేయడం.. దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించడం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.