isis Sympathizers
-
ఇద్దరు ఐఎస్ఐ సానుభూతిపరుల అరెస్ట్
ఛత్తీస్గడ్: ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్పూర్లో ఐఎస్ఐ సానుభూతిపరులుగా భావిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో అనుమానాస్పదంగా నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అనుమానం రావడంతో వారి ఫోన్లను ట్యాప్ చేశారు. ఎంక్వైరీలో అనుమానితులు ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నారని నిర్థారించుకున్న పోలీసులు ఆదివారం వారిని అరెస్ట్ చేశారు. వీరితో సంబంధాలు ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐసిస్‌పై కొనసాగుతున్న వేట!
మరో ముగ్గురు సానుభూతిపరులు అరెస్టు చెన్నై: దేశవ్యాప్తంగా పేలుళ్లు జరగవచ్చునన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు, సానుభూతిపరుల వేట కొనసాగిస్తోంది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో మరో ముగ్గురు ఐసిస్ సానుభూతిపరుల్ని అదుపులోకి తీసుకుంది. భారత సైన్యం సర్జికల్ దాడుల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు ఐసిస్ సానుభూతిపరులు పన్నిన కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ కుట్రకు సంబంధించి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గత ఆదివారం ఆరుగురు ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, న్యూఢిల్లీ, కేరళ నిఘావర్గాల సహకారంతో వీరిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఐసిస్ కార్యకలాపాలపై దృష్టిపెట్టిన ఎన్ఐఏ శనివారం కోయంబత్తూరులో ఆ సంస్థ రహస్యా కదలికల గుట్టు రట్టు చేసింది. మరో ముగ్గురు సానుభూతిపరుల్ని అదుపులోకి తీసుకొని.. వారిని లోతుగా విచారిస్తోంది. -
దక్షిణాది రాష్ట్రాల్లో పేలుళ్ల కుట్ర భగ్నం
చెన్నై: భారత్ సర్జికల్ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదులు.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ పేలుళ్లకు కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు భగ్నం చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం ఆరుగురు ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తెలంగాణ, న్యూఢిల్లీ, కేరళ నిఘావర్గాల సహకారంతో ఎన్ఐఏ సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్ అయిన ఐసిస్ సానుభూతిపరుల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబు బషీర్ (29), మహమ్మద్ (26), కేరళకు చెందిన మన్సీద్ (30), జాసిమ్ (25), ఖాన్ (24) ఉన్నారు. ఎన్ఐఏ అధికారులు వారిని విచారిస్తున్నట్టు సమాచారం. -
ఐసిస్ సానుభూతిపరుల బెయిల్ తిరస్కరణ
హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సోమవారం నాంపల్లి ఎన్ఐఏ కోర్టు ఐదుగురు ఐసిస్ సానుభూతిపరుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. బెయిల్ పిటిషిన్ దాఖలు చేసిన సానుభూతిపరులలో ఏ6 నిందితుడి బెయిల్ పిటిషన్‌పై ఎన్ఐఏ కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది.