ISL first season
-
ఢిల్లీని గెలిపించిన రాబిన్ సింగ్
ఐఎస్ఎల్ తొలి అంచె సెమీస్లో గోవా ఓటమి న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ తొలి అంచె సెమీస్లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ ఆకట్టుకుంది. గోవా ఎఫ్సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 1-0తో గెలిచింది. లీగ్ చరిత్రలో గోవా జట్టుపై ఢిల్లీ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో అంచె సెమీస్ 15న గోవాలో జరుగుతుంది. ఢిల్లీ తరఫున ఏకైక గోల్ రాబిన్ సింగ్ (42వ నిమిషంలో) చేశాడు. లీగ్ దశలో టాపర్గా నిలిచిన గోవాపై ఆరంభం నుంచే ఢిల్లీ ఆటగాళ్లు ప్రణాళిక ప్రకారం ఆడారు. గోవా అటాకింగ్ ఆటను అడ్డుకుంటూనే తమ దాడులు తీవ్రం చేశారు. ఫలితంగా 42వ నిమిషంలో అండర్సన్ చికావో పంపిన క్రాస్ను రాబిన్ సింగ్ హెడర్ గోల్ చేసి జట్టు శిబిరంలో ఆనందం నింపాడు. -
సొంతగడ్డపై గోవా జోరు
ఫటోర్డ (గోవా): ఐఎస్ఎల్ తొలి సీజన్లో సెమీఫైనల్ దాకా చేరిన ఎఫ్సీ గోవా జట్టు సొంత మైదానంలో సత్తా చూపింది. ఆదివారం ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీతో జరిగిన తమ ఆరంభ మ్యాచ్ను 2-0తో నెగ్గింది. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వీరికిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మ్యాచ్ మూడవ నిమిషంలోనే గోవా జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఢిల్లీ ఆటగాడు సౌవిక్ బంతిని అడ్డుకునే ప్రయత్నంలో పొరపాటు చేయడంతో అది తమ సొంత గోల్పోస్టులోకే వెళ్లడంతో మూల్యం చెల్లించుకున్నారు. 12వ నిమిషంలో తమకు లభించిన మరో అవకాశాన్ని గోవా చేజార్చుకుంది. అయితే 45వ నిమిషంలో రినాల్డో గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి బంతిని నెట్లోకి పంపడంతో ఆధిక్యం పెరిగింది. బ్రెజిల్ దిగ్గజం రాబర్టో కార్లోస్ ద్వితీయార్ధంలో ఢిల్లీ తరఫున ఐఎస్ఎల్లో అరంగేట్రం చేశాడు. అయినా ఫలితం దక్కలేదు.