Islam Religion
-
సప్త ఆకాశాల పర్యటన
ముహమ్మద్ ప్రవక్త(స) వారి పావన జీవితంలో జరిగిన అనేక ముఖ్య సంఘటనల్లో సప్తాకాశాల పర్యటన ఒకటి. దైవాదేశం మేరకు హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్తవారిని ఆకాశ పర్యటనకు తీసుకెళ్ళారు. ఈ పర్యటనలో ఒకచోట కొందరు వ్యక్తులు ఒక పంటను కోస్తున్నారు. అయితే ఆ పంట కోస్తున్న కొద్దీ పెరగడం చూసి,‘ఏమిటీవింత?’ అని జిబ్రీల్‌ను అడిగారు. ‘వీరుౖ దెవమార్గంలో తమ సర్వస్వాన్నీ త్యాగం చేసినవారు.’ అని చెప్పారు జిబ్రీల్. మరొకచోట కొందరు వ్యక్తులు అతుకుల బొంతలు ధరించి పశువుల్లాగా గడ్డిమేస్తున్నారు. ఇది చూసిన ప్రవక్త(స) వీరెవరని ప్రశ్నించారు. ‘వీరు తమ సంపద నుండి జకాత్ చెల్లించని వారు.’ అని చెప్పారు జిబ్రీల్ దూత. ఇంకొకచోట కొందరి తలలను బండరాళ్ళతో చితగ్గొట్టడం చూసి, ‘మరి వీళ్ళెవరు?’ అని ప్రశ్నించారు ప్రవక్త. ‘వీరు నిద్రమత్తులో జోగుతూ దైవారాధనకు బద్దకించేవారు.’ అని చెప్పారు జిబ్రీల్. మరొకచోట ఒకమనిషి కట్టెలమోపు లేపడానికి విఫలయత్నాలు చేస్తూ, అందులోంచి కొన్ని కట్టెలు తీసి తేలిక పరుచుకునే బదులు, అదనంగా మరికొన్ని కట్టెలు కలిపి మోపుకడుతున్నాడు. ప్రవక్త(స) ఈ వింతను చూసి, ‘ఈమూర్ఖుడెవరు?’ అని అడిగారు. ‘ఈ వ్యక్తి, శక్తికి మించిన బాధ్యతలు మీద వేసుకొని కూడా, వాటిని తగ్గించుకునే బదులు మరికొన్ని బాధ్యతలు భుజాన వేసుకునేవాడు.’ బదులిచ్చారు జిబ్రీల్. మరొకచోట కొందరు వ్యక్తుల పెదవులు, నాలుకలు కత్తెర్లతో కత్తిరించబడుతున్నాయి. ఇది చూసిన ప్రవక్తవారు, ‘ఇదేమిటీ? ’ అని ప్రశ్నించారు. ‘వీరు బాధ్యత మరచిన ఉపన్యాసకులు. బాధ్యతారహిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టేవారు, కలహాలు రేకెత్తించేవారు.’ అన్నారు హజ్రత్ జిబ్రీల్. ఇదేవిధంగా ఇంకోచోట, బండరాయిలో ఒక సన్నని పగులు ఏర్పడి, అందులోంచి బాగా బలిసిన ఒక వృషభం బయటికొచ్చింది. అయితే అది మళ్ళీ ఆ సన్నని పగులులో దూరడానికి విఫల యత్నం చేస్తోంది. దానికి జిబ్రీల్ దూత, ‘ఇది బాధ్యతారహితంగా, మాట్లాడి, సమాజంలో కల్లోలం రేకెత్తిన తరువాత పశ్చాత్తాపం చెందే వ్యక్తికి సంబంధించిన దృష్టాంతం. నోరు జారిన తరువాత ఇక అది సాధ్యం కాదు.’ అని చెప్పారు జిబ్రీల్. మరోచోట, కొందరు స్వయంగా తమ శరీర భాగాలను కోసుకొని తింటున్నారు. ‘మరి వీరెవరూ?’ అని ప్రశ్నించారు ప్రవక్త(స).’ వీరు ఇతరులను ఎగతాళి చేసేవారు, అవమానించేవారు, తక్కువగా చూసేవారు.’ చెప్పారు హజ్రత్ జిబ్రీల్. అలాగే ఇంకా అనేక రకాల శిక్షలు అనుభవించేవారు కూడా కనిపించారు. ఇతరులపై నిందలు వేసేవారు తమ రాగిగోళ్ళతో ముఖాలపై, ఎదరొమ్ములపై రక్కుకుంటున్నారు. వడ్డీ తినేవారు, అనాథల సొమ్ము కాజేసేవారు, అవినీతి, అక్రమాలకు పాల్పడేవారు, జూదం, మద్యం, వ్యభిచారం లాంటి దుర్మార్గాల్లో కూరుకుపోయిన వారు రకరకాల శిక్షలు అనుభవిస్తూ కనిపించారు. ఎవరైతే దైవాదేశాలకనుగుణంగా ప్రవక్త చూపిన బాటలో నడుచుకుంటూ, సత్కర్మలు ఆచరిస్తారో అలాంటివాళ్ళే ఈ భయంకరమైన శిక్షలనుండి సురక్షితంగా ఉండగలుగుతారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వెంట వచ్చేది పాప పుణ్యాలు మాత్రమే!
దేవుడున్నాడా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి గాని, మరణం ఉందా.. లేదా? అనే విషయంలో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. కాని, ‘మరణం తథ్యం’ అని తెలిసినా మనం పట్టించుకోం. ముహమ్మద్ ప్రవక్త (స)వారు ఒక మాట చెప్పారు. ‘ధర్మాధర్మాల విచక్షణ పాటించండి. మంచి పనులు విరివిగా చేయండి. రేపు మిమ్మల్ని కాపాడేవి ఇవే. ‘ఎందుకంటే, మీరు సంపాదించిన డబ్బూ దస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తం మీ ఊపిరి ఆగిన మరుక్షణమే మీతో సంబంధాన్ని తెంచుకుంటాయి. మీరు తినీ తినకా, ధర్మం అధర్మం అని ఆలోచించక, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా మీది కాకుండా పోతుంది. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం మిమ్మల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మిమ్మల్ని మట్టిలో కలిపేసి వెళ్ళిపోతారు. మీ వెంట వచ్చేది, మిమ్మల్ని కాపాడేది కేవలం మీరు చేసుకున్న మంచి పనులు మాత్రమే.’ కనుక ధర్మాధర్మాలను విడిచిపెట్టి, ఇతరులను మోసం చేసి, అక్రమ దారిలో సంపాదించి చివరికి బావుకునేదేమిటో ఎవరికివారు ఆలోచించుకోవాలి. ఎన్నో అడ్డదారులు తొక్కి, వారినీ వీరినీ వంచించి సంపాదించేదంతా సుఖమయ జీవితం కోసమేగదా.. రేపటి మన సంతోషం, మన పిల్లల భవిష్యత్తు కోసమేగదా? అక్రమ సంపాదనలో నిజమైన సంతోషం ఉండకపోగా, అది ఎప్పుడూ మనసులో కెలుకుతూనే ఉంటుంది. అయినా అంతరాత్మను అణగదొక్కి అడ్డదారికే ప్రాధాన్యతనిస్తాం. కేవలం కొన్ని సంవత్సరాల ప్రాపంచిక జీవితం కోసమే ఇంతగా ఆలోచించే మనం, మరి శాశ్వతమైన రేపటి కోసం ఏం సంపాదిస్తున్నామన్నది కూడా ఆలోచించాలి. ఈ ‘రేపు’ మూన్నాళ్ళ ముచ్చట. కాని ఆ ‘రేపు’ శాశ్వతం. దానికోసం ఏం చేస్తున్నాం.. ఏం దాచుకుంటున్నాం? ఇదికదా అసలు ప్రశ్న. ఇహలోక జీవితం ఎలా గడిచినా పరలోక సాఫల్యం లభిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. దానికోసం ఆలోచించాలి. దానికోసం శ్రమించాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం. అసలు సాఫల్యం. కేవలం మన లాభం కోసం ఇతరులను వంచించడం మానవీయత కే వ్యతిరేకం. కాబట్టి, ఇహలోక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, గౌరవప్రదంగా సాగిపోవాలన్నా, రేపటి పరలోక జీవితం జయప్రదం కావాలన్నా మరణాన్ని మరువకూడదు. దైవానికి భయపడుతూ, మంచీచెడుల విచక్షణ పాటిస్తూ, ధర్మబద్ధమైన జీవితం గడపాలి. దైవం మంచి బుద్ధిని, విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సన్మార్గ పథాన నడిపించాలి
ఆధునిక విజ్ఞానం దూరాలను దగ్గర చేసింది. కాని మనుషులను, మనసులను దగ్గర చేయలేక పోయింది. విజ్ఞానం విస్తరించిన కొద్దీ అజ్ఞానం పటాపంచలు కావలసింది పోయి వెర్రితలలు వేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. నిజానికి దేవుడు మనిషిని బుధ్ధిజీవిగా, విజ్ఞాన స్రష్టగా, మంచీచెడుల విచక్షణ తెలిసిన వాడుగా సృష్టించాడు. అంతేకాదు, మానవజాతి మూలాల రహస్యాన్నీ విడమరచి చెప్పాడు. మానవులంతా ఒకేజంట సంతానమన్నయదార్ధాన్ని ఎరుక పరిచాడు. సఛ్ఛీలత, నైతిక విలువలు, దైవభక్తి విషయాల్లో తప్ప ఎవరికీ ఎవరిపై ఎలాంటి ఆధిక్యతా లేదని స్పష్టం చేశాడు. కనుక కులం, మతం, జాతి, ప్రాతం, భాషల ఆధారంగా అడ్డుగోడలు నిర్మించుకోడానికి, సరిహద్దులు గీసుకోడానికి లవలేశమైనా అవకాశంలేదు. కాని కులం, మతం, జాతి, భాష, ప్రాంతీయతలను ప్రాతిపదికగా చేసుకొని, మనిషి మరోమనిషిపై దాడికి దిగుతున్నాడు. ఇతరుల ధనమాన ప్రాణాలను హరిస్తున్నాడు. వారి గౌరవ మర్యాదలతో చెలగాట మాడుతున్నాడు. తల్లి, చెల్లి, ఇల్లాలు అని కూడా చూడకుండా స్త్రీలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. సృష్టిలో శ్రేష్ట జీవి అయిన మానవుడు తన స్థాయిని, శ్రేష్టతను, ఔన్నత్యాన్ని మరిచి విలువలకు తిలోదకాలిచ్చి, మానవుడిగా చేయకూడని పనులన్నీ చేస్తూ మానవత్వానికి కళంకం తెచ్చి పెడుతున్నాడు. ఎందుకిలా జరుగుతోంది... దీనికి కారణమేమిటంటే, మానవుడు జీవన సత్యాన్ని గుర్తించడంలేదు. పుట్టుక, చావుకు మధ్యనున్న జీవన్నాటకమే సర్వస్వమని భ్రమిస్తున్నాడు. నేటి తరువాత రేపు ఎంత నిజమో, మరణం తరువాత మరణానంతర జీవితమూ అంతే నిజమన్న సత్యాన్ని విస్మరిస్తున్నాడు. ఇక్కడ ఈ జీవితంలో చేసిన ప్రతి పనికీ, పలికిన ప్రతిమాటకు రేపు ఆ జీవితంలో, పరమ ప్రభువైన అల్లాహ్ సన్నిధిలో సమాధానం చెప్పుకోవాలన్న విషయాన్నే మరిచి పొయ్యాడు. అందుకే ఈ బరితెగింపు. పరలోక జీవితాన్ని నమ్మి, దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉందన్న విషయం మనసా, వాచా, కర్మణా విశ్వసించినట్లయితే మనసులో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలూ తలెత్తవు. ఇతరులకు హాని చేయాలన్న తలంపే మనసులో రాదు. అందరూ తనలాంటి వారే అన్న స్పృహ జాగృతమవుతుంది. వసుధైక కుటుంబ భావన పాదుకుంటుంది. దైవం సమస్త మానవాళినీ సన్మార్గపథాన నడిపింప జేయాలని, శాంతి వర్ధిల్లాలని మనసారా కోరుకుందాం. -
మతం మారాలంటూ మోడల్‌కు టార్చర్
ముంబై : లవ్ జిహాద్‌కు చెందిన మరో షాకింగ్ కేసు ముంబైలో వెలుగులోకి వచ్చింది. మతం పేరుతో తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసిస్తున్నారంటూ మాజీ మోడల్ ఫిర్యాదు చేసింది. హిందూ మత ఆచారాలను పాటించే కుటుంబ నేపథ్యానికి చెందిన రష్మి షాబెస్కర్, 13 ఏళ్ల క్రితం ముస్లిం మతానికి చెందిన అబ్బాయిని పెళ్లాడింది. పెళ్లి సమయంలో ఆమెతో పాటు తన మత ఆచారాలకు ఆయన అంగీకారం తెలిపాడు. కానీ గత కొన్నేళ్లుగా రష్మిని ఇస్లాంలోకి మారాలంటూ వేధించడం ప్రాంరభించాడు. మతం మారడం ఇష్టలేని రష్మి, ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో, ఆమె భర్త మరో 28 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ తన సోదరుడి గర్ల్‌ఫ్రెండే కావడం గమనార్హం. గెస్ట్‌గా వారి ఇంట్లో ఉంటుండటంతో పాటు, ఆమె ఇస్లాంలోకి మారడానికి ఇష్టపడటంతో, తన భర్త ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్టు రష్మి చెప్పింది. తర్వాత ఆమెను వివాహం కూడా చేసుకున్నట్టు తెలిపింది. అంతేకాక తాను ఇస్లాంలోకి మారడం లేదని తన కొడుకును కూడా దూరం చేశారని, ఇప్పుడు 7ఏళ్ల వయసున్న తన కొడుకు తనను తల్లిగా స్వీకరించడం లేదని కన్నీరుమున్నీరైంది. దేవాలయానికి వెళ్తుండటం వల్ల తనని ఓ రాక్షసురాలిగా తన కొడుకు భావిస్తున్నాడని, అంతలా తన బిడ్డను దూరం చేసేశారని ఆవేదన వ్యక్తంచేసింది. రష్మి ఫిర్యాదు మేరకు, ఆమె భర్త, ఆయన కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ ప్రారంభించారు. -
మతం మారాలంటూ మోడల్‌కు అత్తింటి టార్చర్
-
70 ఏళ్ల తర్వాత క్షవర యోగం!
సంబాల్: దాదాపు 70 ఏళ్లుగా అగ్రవర్ణాల ఆధిపత్యం, వివక్షతో క్షవరానికి దూరమైన దళిత వాల్మీకీలు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు! తమకు క్షవరం చేయకపోతే ఇస్లాం మతంలోకి మారతామని హెచ్చరించడంతో అగ్రవర్ణాలు దిగొచ్చాయి. సమస్య పరిష్కారం కోసం పోలీసులు, ఇతర అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు. దీంతో గ్రామంలోని క్షురకులు వాల్మీకీలకు మంగళవారం హెయిర్ కటింగ్, షేవింగ్ చేయడంతో కథ సుఖాంతమైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా ఫతేపూర్ షాంషోయ్ గ్రామంలో అగ్రవర్ణాల ఆదేశం వల్ల వాల్మీకీలకు క్షవరంపై 70 ఏళ్లుగా నిషేధం కొనసాగుతోంది. వారికి వాడే ‘అపవిత్ర, అపరిశుభ్రమైన’న రేజర్లను తమకు వాడితే క్షవరాలు చేయించుకోబోమని అగ్రవర్ణాలు బెదిరించాయి. దీంతో క్షురకులు వాల్మీకీలకు క్షవరం చేయడం లేదు. మరోదారి లేక బాధితులు ఆ సేవల కోసం 15–20 కి.మీ. దూరంలోని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేవారు. అయితే నెల కిందట గ్రామంలోని అసిఫ్ అలీ అనే క్షురకుడు వాల్మీకీలకు క్షవర కర్మలు చేసేందుకు ముందుకొచ్చాడు. కొందరు వాల్మీకీలకు క్షవరం చేశాడు. అయితే అగ్రకులాల వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో వాల్మీకీలకు క్షవరం చేయడానికి నిరాకరించాడు. తమకు క్షవరం చేయకపోతే ఇస్లాం మతం పుచ్చుకుంటామని బాధితులు హెచ్చరించారు. మంగళవారం సంబంధిత వర్గాల ప్రజలు మాజీ సర్పంచి సంజీవ్ శర్మ మధ్యవర్తిత్వంలో పోలీసులు, అధికారులతో చర్చలు జరిపారు. -
ఖలీద్ మసూద్ అలియాస్ అడ్రియన్ రస్సెల్
లండన్: బ్రిటన్ పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన 52 ఏళ్ల వ్యక్తి అసలు పేరు అడ్రియన్ రస్సెల్ అజావ్ అని ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ఖలీద్ మసూద్‌గా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడికి మసూద్ సన్నద్ధత, ప్రేరణ, సహచరుల గురించి తెల్సుకునేందుకు ‘ఆపరేషన్ క్లాసిఫిక్’ పేరిట వందల మంది అధికారులతో కౌంటర్ టెర్రరిజం కమాండ్ విచారణను ముమ్మరం చేశారు. మసూద్‌కు ఎన్నోమారు పేర్లున్నా చిన్నతనంలో అతన్ని అడ్రియన్ రస్సెల్ అని పిలిచేవారు. గతంలోనూ నేరచరిత్ర ఉన్న అతను 2000లో ఓ మహిళ ముఖంపై కత్తితో దాడిచేయడంతో అతని కుటుంబాన్ని స్థానిక కోర్టు బహిష్కరిస్తూ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, బ్రిటన్ పార్లమెంట్‌పై జరిగిన దాడిలో గాయపడిన మరో వ్యక్తి గురువారం చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. మరోవైపు, ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో మాట్లాడారని, ఉగ్రదాడులపై సంఘీభావాన్ని వ్యక్తం చేశారని ప్రధాని కార్యాలయం శుక్రవారం ట్వీటర్లో తెలిపింది. -
ఇస్లాం మతం శాంతిని ప్రబోధిస్తుంది
శాంతి ర్యాలీలో మతపెద్దలు అనంతపురం న్యూటౌన్ : ఇస్లాం మతం ఎప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, శాంతిని మాత్రమే ప్రబోధిస్తుందని పలువురు మత పెద్దలు అన్నారు. ఆదివారం పలు ముస్లిం సంఘాల వారు ఉగ్రవాదాని కి వ్యతిరేకంగా నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉదయం స్థా నిక ఈద్గా మసీదు నుంచి మౌలానా ఆజాద్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక సప్తగిరి సర్కిల్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ గౌసుపీర్, హఫీజ్ ముఫ్తి మహ్మద్ రజా, హఫీజ్ మహిరుద్దీన్, నిస్సార్ అహ్మద్, మసూద్ సాబ్ తదితరులు ఖురాన్ బోధలను వినిపిం చారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రషీద్ అహ్మద్, వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు హుస్సేన్‌పీరా, కాంగ్రెస్ నాయకుడు దాదాగాంధీ, సీపీఎం ఇంతియాజ్, టీడీపీ నేత తాజుద్దీన్ పాల్గొన్నారు.