హై సెక్యూరిటీ ఫీచర్స్‌తో కొత్త రూ.10 నోట్లు
న్యూఢిల్లీ: కొత్త పది రూపాయల నోటును జారీ చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. త్వరలోనే ఈ నోట్లు అందుబాటులోకి రానున్నట్టు గురువారం వెల్లడించింది. అధిక భద్రతా లక్షణాలతో ఈ కొత్త 10 నోట్లను జారీ చేయనున్నట్టు తెలిపింది. అలాగే పాత పది రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది.
మహాత్మా గాంధీ సీరిస్-2005లో రెండు నంబర్ ప్యానెల్స్‌పై ‘ఎల్’ (ఇన్ సైట్) లెటర్ తోపాటు, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్ సంతకంతో వీటిని లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. ఎడమ నుంచి కుడికి మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ అక్షరాలు (ఉపసర్గ) ఆరోహణ క్రమంలో పాత పరిమాణంలోనే ఉండనున్నట్టు ఆర్బిఐ పేర్కొంది. గతంలో బ్యాంకు జారీ చేసిన రూ.10 విలువ కలిగిన అన్ని బ్యాంకు నోట్లు కూడా చట్టబద్ధంగా చెల్లుబాటులోఉంటాయని వివరణ ఇచ్చింది.