Itala Minister Rajinder
-
ప్రజల రుణం తీర్చుకోవడమే నా ఎజెండా
కమలాపూర్‌ను అన్ని రంగాల్లోఅభివృద్ధి చేస్తా ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కమలాపూర్ : ముక్కూ, ముఖం తెలియని నాడు అండగా ఉండి ఇంతగా ఆశీర్వదించిన మండల ప్రజల రుణం తీర్చుకోవడమే తన ఎజెండా అని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలంలో పర్యటించి రూ.2.37 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ కమలాపూర్‌ను వరంగల్ అర్బన్ జిల్లాలో కలిసిన తర్వాత మొద టి సారిగా మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానన్నారు. కమలాపూర్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాకు తీసిపోని విధంగా విద్య, ఇన్‌ఫ్రాస్టక్చ్రర్, పరిశ్రమలు, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యంగా సీడ్ బౌల్ అఫ్ తెలంగాణలో భాగంగా కమలాపూర్ మండలాన్ని తీర్చిదిద్దే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇప్పటికే మండలానికి హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వచ్చిందని, బీపీసీఎల్, ఐఓసీ ఫిల్లింగ్ స్టేషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాటర్‌గ్రిడ్ (మిషన్ భగీరథ)రాకముందే కమలాపూర్‌లో రూ.20 కోట్లతో ఫిల్టర్‌బెడ్ నిర్మించి దానిని మిషన్ భగీరథకు అనుసంధానం చేసి 2018 లోగా మండల ఆడబిడ్డలకు కానుకగా ఇంటింటికి నల్లా ఇస్తానన్నారు. గతంలో వాగులపై బ్రిడ్జిలు లేక వర్షం వస్తే మండలం ఐలాండ్‌గా మారేదని, ఇప్పుడా పరిస్థితి లేకుండా మండల వ్యాప్తంగా రూ.40 కోట్లతో 10 బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. రూ.170 కోట్లతో హుజూరాబాద్ నుంచి పరకాల వరకు ఫోర్‌లేన్ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మణ్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు నవీన్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ సంపత్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, తదితరులు పాల్గొన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే వరంగల్‌లోకి.. కమలాపూర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లాకు కూత వేటు దూరంలో ఉంద ని, నిత్యం మండల ప్రజలు ఏ పని కోసమైనా వరంగల్‌కే వెళ్తారని, ప్రజల సౌకర్యార్థం, పరిపాలన సౌలభ్యానికే మం డలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలి పామని మంత్రి ఈటల పేర్కొన్నారు. దీనిపై మండల ప్రజలు కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కానీ త్వరలో అంతా సర్దుకుంటుందన్నారు. -
మెగా ప్రాజెక్టులకు ప్రత్యేక రాయితీలు
కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ♦ విస్తరణకు సిద్ధంగా ఉన్న పాత పరిశ్రమలకూ వర్తింపు ♦ మూతపడిన పరిశ్రమలకు ఊతమిచ్చే యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడితో.. కనీసం వేయి మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులతో వచ్చే పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై చర్చించేందుకు బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెగా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కొన్ని పరిశ్రమలు మరింత పెట్టుబడితో విస్తరిస్తే మెగా ప్రాజెక్టుల కేటగిరీలోకి వస్తాయని.. అలాంటి పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపైనా చర్చించారు. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధి ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సమకూరే ఆదాయంలో కొంత మొత్తాన్ని ప్రత్యేక నిధి ఏర్పాటుకు వినియోగించేలా.. సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆమోదం పొందాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. 389 మెగా ప్రాజెక్టులకు అనుమతులు టీఎస్ ఐపాస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 389 మెగా ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసినట్లు మం త్రి కేటీఆర్ వివరించారు. పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేం దుకు ఆర్థిక శాఖ సానుకూలంగా ఉందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడిం చారు. అయితే రాయితీలను పరిశ్రమ ఆరంభంలో కాకుండా.. పనులు, ఉత్పత్తి పురోగతిని బట్టి ఇవ్వాలని సూచిం చారు. కాగా.. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల పునః ప్రారంభానికి మద్దతు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని.. ఇప్పటికే మూతపడిన ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలను తిరిగి తెరిపించడంపై సమావేశంలో చర్చించారు. ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున రాయితీ ఇవ్వాలని.. ఏడాది పాటు రాయితీ కొనసాగించి, ప్రతీ మూడు నెలలకోమారు రాయితీ చెల్లించాలని నిర్ణయించారు. విద్యుత్ బకాయిలను వాయిదాల్లో చెల్లించేం దుకు డిస్కమ్‌లు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. మూతపడిన భీమా సిమెంటు పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు ప్రభుత్వం సహ కరిస్తుందని.. అయితే పరిశ్రమను పూర్తిస్థాయిలో నడిపిస్తేనే సాయం అందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. -
అంతరాత్మను చంపుకుని వివరణలా?: భట్టి
సాక్షి, హైదరాబాద్: ‘అంతరాత్మను చంపుకొని ఎందుకన్నా మాట్లాడుతున్నవ్..? బడ్జెట్ కేటాయింపులు, లెక్కలపై వివరణ మనస్ఫూర్తిగానే ఇచ్చారా?’ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. టీ విరామానికి అసెంబ్లీ వాయిదాపడ్డ తర్వాత ఈటల, భట్టి పరస్పరం ఎదురుపడ్డారు. ‘బలహీనవర్గాలకు ప్రతినిధిగా బడ్జెట్‌ను మూడోసారి ప్రవేశపెట్టే అవకాశం దక్కినందుకు అభినందిస్తున్నా’ అని ఈటలతో భట్టి వ్యాఖ్యానించారు. దీనికి ఈటల నవ్వుతూ ‘బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యమిచ్చాం. బడ్జెట్ చాలాబాగున్నందుకు కూడా అభినందించాల్సిందే’ అని బదులిచ్చారు. ‘లెక్కలు ఎంత అబద్ధాలో అందరికీ అర్థం అవుతున్నాయి. మా ప్రశ్నలు, అనుమానాలకు వివరణలు ఇవ్వడానికి మీ అంతరాత్మ ఒప్పుకొందా.. మీ మాటలు మనసులోంచి రావట్లేదు. అంతరాత్మను చంపుకొని మాట్లాడుతున్నట్లు మిమ్మల్ని చూస్తేనే అర్థమైంది’ అని భట్టి అనగానే ఏమీ మాట్లాడకుండా ఈటల వెళ్లిపోయారు. -
గుడుంబాపై ఉక్కుపాదం మోపుదాం
- పీడీఎఫ్ అక్రమార్కులను జైలుకు పంపుతాం - 2018లో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ - మానేరు వాగుపై రూ.50 కోట్లతో వంతెన - వేగురుపల్లి-వావిలాల మధ్య ఐదు చెక్‌డ్యాంలు - ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ శంకరపట్నం/మానకొండూర్ : రాష్ట్రంలో గుడుంబా తయూరీ, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టక ముందే ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయన్నారు. గుడంబాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుం టుందని, దీనికి ప్రతిపక్షాలతో పాటు ప్రజల సహకారం అవసరమని కోరారు. గురువారం ఆయన మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గుడుం బాకు బానిసై చిన్నతనంలోనే కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగిల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. ప్రజా పంపిణీ సరుకులను పక్కదారి పట్టించే వారిని ఉపేక్షించేలేదని, అధికారి అరుునా, ప్రజాప్రతినిధి అరుునా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. 2018 నాటికి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతామన్నారు. మరో మూడేళ్లల్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా ఆయకట్టు అంతటికీ సా గునీరు అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి నల్లా నీళ్లు అందిస్తామని, లేనిపక్షంలో ఓట్లు అడగబోమని చెప్పారు. వేగురుపల్లి మానేరు వాగుపై రూ.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని చెప్పారు. మానేరు వాగుపై వావిలాల వరకు ఐదు చెక్‌డ్యాంలు నిర్మిస్తామన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కేజీ టు పీజీ విద్య కోసం మోడల్ స్కూళ్లను అనుసంధానించనున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే రసమరుు బాలకిషన్‌తోపాటు ఆయూ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.