item
-
బీజేపీలోని నటీమణులంతా ‘ఐటమ్’లు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: బీజేపీ నేతలుగా మారిన పలువురు నటీమణులపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు బీజేపీలో ఉన్న సీనియర్ నటీమణులు ఖుష్బు, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు ‘ఐటమ్’లు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీలో మహిళ నేతలుగా ఉన్న నలుగురు నటీమణులు పెద్ద ఐటమ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడులో బీజేపీ బలపడుతుందని ఖుష్బూ చెబుతోంది. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో బీజేపీ మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి బీజేపీని బలోపేతం చేసేందుకు వీళ్లు (వేశ్యలు) ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు. నా సోదరుడు ఇళయ అరుణ కుష్బుతో ఎన్నోసార్లు కలిశాడు. అంటే నా ఉద్ధేశం ఆమె డీఎంకేలో ఉన్నప్పుడు ఆమెతో దాదాపు ఆరుసార్లు సమావేశాల్లో పాల్గొన్నారు.’ అంటూ విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .@arivalayam functionary Saidai Sadiq's derogatory remarks on women BJP leaders left many in the state's ruling party red-faced. Sadiq's remarks targetting leaders including @khushsundar drew sharp criticism from BJP leaders and others. Watch here : https://t.co/DVbwYrAz6G pic.twitter.com/6NpvZH6Khk — South First (@TheSouthfirst) October 28, 2022 డీఎంకే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు ఖుష్భూ తీవ్రంగా ఖండించారు. ‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం, అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన’ అంటూ ట్విటర్ వేదికగా సాధిక్ వ్యాఖ్యలను ఎండగడుతూ డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళిని ట్యాగ్ చేశారు. When men abuse women,it just shows wat kind of upbringing they have had & the toxic environment they were brought up in.These men insult the womb of a woman.Such men call themselves followers of #Kalaignar Is this new Dravidian model under H'ble CM @mkstalin rule?@KanimozhiDMK — KhushbuSundar (@khushsundar) October 27, 2022 దీనిపై స్పందించిన డీఎంకే నేత కనిమొళీ ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేమన్నారు. తమ నాయకుడు సీఎం స్టాలిన్‌గానీ, పార్టీ అధిష్టానంగానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. అనంతరం సాధిక్ సైతం తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఎవరిని కించపరచడం తమ ఉద్ధేశం కాదని వెల్లడించారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అంటూ మాట్లాడారని, . జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. -
‘ఏయ్ ఐటమ్. ఎక్కడికి వెళ్తున్నవ్’.. పోకిరికి బుద్ధి చెప్పిన కోర్టు
ముంబై: మైనర్ బాలికను ‘ఐటమ్’ అని పిలిచినందుకు ఓ యువకుడికి ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. అబ్బాయిలు లైంగిక వేధింపుల ఉద్ధేశ్యంతో మాత్రమే అమ్మాయిని ఐటమ్ అని కామెంట్ చేయడం జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. మైనర్‌ను 2015లో ఓ వ్యక్తి టీజ్ చేసిన కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2015 జూలై 14న విద్యార్థిని స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ’ఏయ్ ఐటమ్.. ఎక్కడికి వెళ్తున్నవ్’ అంటూ స్థానికంగా నివాసముండే 25 ఏళ్ల యువకుడు కామెంట్ చేశాడు. దీంతో బాలిక తనను వేధించవద్దని కోరగా.. మరింత రెచ్చిపోయిన వ్యక్తి ఆమె జుట్టుపట్టుకొని లాగి దుర్భాషలాడాడు. బైక్‌పై వెంబడించాడు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్‌లైన్ 100కు కాల్ చేసి జరిగింది చెప్పింది. పోలీసులు వచ్చేలోపు పోకిరి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 354, 354(డీ), 506, 504 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదైంది. దీనిపై ముంబై ప్రత్యేక పోక్సో కోర్టు విచారణ చేపట్టింది. అబ్బాయిలు ఉద్ధేశపూర్వకంగా అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే ఈ పదం(ఐటమ్) ఉపయోగిస్తారని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్జే అన్సారీ పేర్కొన్నారు. మైనర్ బాలికపై వేధింపుల కేసు కాబట్టి నిందితుడి విషయంలో కనికరం చూపే ప్రసక్తే లేదని తెలిపారు. అమ్మాయిని అలా అల్లడి వెనక నిందితుడి ఉద్ధేశ్యం స్పష్టంగా తెలుస్తోందన్నారు. రోడ్డు సైడ్ రోమియోలకు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, ఇలాంటి నేరాలను కఠినంగా శిక్షించాలని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి: విద్యార్థులతో ఆడిపాడిన చిన్నారి.. ఉన్నట్టుండి కుప్పకూలడంతో... -
ఆమె ఓ ‘ఐటం’.. సీఎం మౌన వ్రతం
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాష్ట్ర మంత్రి ఇమర్తి దేవిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం రెండు గంటలపాటు మౌనవ్రత దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ.. ‘మాజీ సీఎం వ్యాఖ్యలు ఆయన వంకర బుద్ధిని, నీచ మనస్తత్వాన్ని చూపిస్తున్నాయి. కమల్ నాథ్ వ్యాఖ్యలు కేవలం ఇమర్తి దేవికి మాత్రమే కాదు గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రతి మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి’ అంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ఇంతకు వివాదం ఏంటంటే ఆదివారం గ్వాలియర్ దాబ్రా పట్టణంలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మాజీ సీఎం కమల్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ఆయన తమ ప్రత్యర్థి ఇమర్తి దేవిని ఉద్దేశిస్తూ ‘ఐటం’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మా పార్టీ తరఫున బరిలో ఓ సాధారణ వ్యక్తి నిలచారు.. కానీ అవతలి క్యాండెట్ ఓ ఐటం’ అంటూ కమల్‌నాథ్ తన నోటి దురుసును ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చౌహాన్, కమల్ నాథ్ వ్యాఖ్యలపై స్పందించారు. ‘మీ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వక్ర బుద్ధి, నీచ మనస్తత్వం మరోసారి తెర మీదకు వచ్చింది. మీరు అవమానించింది ఇమర్తి దేవిని మాత్రమే కాదు.. గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రతి సోదరిని. మహిళలతో గౌరవంతో ఆడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు కమల్ నాథ్ జీ’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై ఆదివారం బీజేపీ ప్రతినిధి బృందం భోపాల్‌లో ఎన్నికల సంఘం అధికారులను కలుసుకుని నాథ్‌పై "మహిళలు, దళితులను అవమానించారని" ఫిర్యాదు చేశారు. (చదవండి: దళిత మహిళపై దాడి.. వీడియో షేర్ చేసిన మాజీ సీఎం) జ్యోతిరాదిత్య సింధియాకు విధేయురాలైన ఇమార్తి దేవి, మరో 21 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్, రాష్ట్ర అసెంబ్లీకి రాజీనామా చేసి, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. మార్చిలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరుగుతుంది. -
అరుణ కిరణాలేవి..!
గాలికొదిలేసిన ప్రత్యేక హోదా మాట ప్యాకేజీకీ పట్టం కట్టని వైనం కోస్టల్ కారిడార్, కాకినాడ పోర్టు ఊసే లేదు కూతే లేని రైలు బండి కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న సంస్థల ప్రస్తావనేదీ..? రాజమహేంద్రవరంలో వ్యాపార శిక్షణా కేంద్రం ఎటుపోయింది..? కానరాని అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రతిపాదన మోదీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆమోదయోగ్యంగా లేదంటూ జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. గత వారం రోజుల నుంచి ‘అరుణ’ కిరణాలు జిల్లాపై ప్రసరిస్తాయని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు అటకెక్కాయి... కేంద్రం ప్రకటించిన ప్రతిపాదనలూ పత్తాలేకుండా పోయాయి. సాక్షిప్రతినిధి, కాకినాడ : కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. ప్రత్యేక హోదా మాటను గాలిలో కలిపేసిన పాలకులు ప్యాకేజీౖMðనా బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఉంటుం దని మేధావి వర్గంతో సహా అన్ని వర్గా లు ఎదురుచూశాయి. తీరా బుధవారం పార్లమెం టులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్యాకేజీకి సంబంధిం చిన ఎటువంటి ప్రస్తావన లేకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఏ నిధుల కేటాయింపు లూ లేకపోవడంతో జిల్లా అ భివృద్ధిపై ప్రభావం చూపి స్తుందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో పెట్రో ఆధారిత పరిశ్రమలు, పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్, విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్ర తీరం వెంబడి ప్రతిపాదించిన కోస్టల్ కారిడార్, కాకినాడ పోర్టు, పోర్టు అనుబంధ పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలకు చోటులభించ లేదు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ప్యాకేజీ కేంద్రాలను కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో ఈ సంస్థలకు ని««దlులు కేటాయింపులుంటాయని ఆశించినా నిరాశే ఎదురైంది. చివరకు అంతర్వేదిలో రూ.1450 కోట్లతో ప్రతిపాదించి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికారపార్టీ నేతలు గొప్పలకుపోయిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థ కార్యకలాపాల ఊసు కూడా లేకపోవడంతో రాజోలు దీవిలో నిరసన వ్యక్తమవుతోంది. భారతీయ విదేశీ వ్యాపార శిక్షణా సంస్థను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించారు. దానికి కూడా ఈ బడ్జెట్లో చోటుదక్కలేదు. కూతే లేని రైలు... సాధారణ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్ కూడా ఉండటంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు ఈసారి సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఎదురుచూశారు. ఈ బడ్జెట్లో జిల్లాకు సంబంధించి రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదాయే. జిల్లా నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న పార్లమెంటు సభ్యులు ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ∙కాకినాడ– పిఠాపురం, కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్లకు సంబంధించి గత ఏడాది రైల్వే బడ్జెట్లో చోటుచేసుకున్న కాస్త ఆశాజనకమైన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్లో కనిపించ లేదు. ఈసారి బడ్జెట్లో కూడా పాత కేటాయింపుల మాదిరిగానే తాజా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఎదురుచూసినా నిరాశే మిగిల్చింది. – కాకినాడను మెయిన్ లైన్లలో కలపాలనే కోరిక ఈనాటిది కాదు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా కాకినాడను మెయిన్ లైన్లో కలపాలన్న డిమాండు ఉంది. ∙కాకినాడ–పిఠాపురం లైన్‌కు గత బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించినా ఏ బడ్జెట్లో చిల్లిగవ్వ కూడా కేటాయించలే దు. 21 కిలోమీటర్ల ఈ లైన్ అంచనా విలువ 2000లో రూ. 126 కోట్లయితే అది ఇప్పుడు రూ.250 కోట్లకు చేరుకుంది. ∙గత బడ్జెట్లో కోనసీమ మీదుగా కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.200 కేటాయించగా ఈసారి అసలు ప్రస్తావనే లేదు. 16 ఏళ్ల ఈ పెండింగ్ ప్రాజెక్టుకు అంత పెద్ద మొత్తంలో కేటాయింపు గత బడ్జెట్లోనే అత్యధికంగా కేటాయించారు. ∙గత ఏడాది కాలంలో కోటిపల్లి–ముక్తేశ్వరం మధ్య రైల్వే వంతెన నిర్మాణానికి నిధులు కేటాయింపు, టెండర్ల ప్రక్రియ మొదలు కావటంతో ఆ ఆశలు మరింత బలపడ్డాయి. తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు వరకూ కేటాయిస్తారని రైల్వే లైన్ పట్టాలెక్కుతుందని ఆశించినా తాజా బడ్జెట్లో మొండిచేయే ఎదురైందని కోనసీమ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ∙57 కిలోమీటర్ల పొడవుతో రూ.1,500 కోట్లతో నిర్మించనున్న ఈ లైన్‌కు కొంత వరకూ భూసేకరణ కూడా జరిగింది. రైల్వే వంతెనకు ఫిబ్రవరిలో టెండర్లు ఖరారు కానున్న క్రమంలో తాజా బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
రెంటికీ చెడ్డ రేవడి
(లక్కింశెట్టి శ్రీనివాసరావు) ఆయనొకప్పుడు జిల్లాలో ఇప్పుడున్న అధికార పార్టీని తన చెప్పు చేతల్లో పెట్టుకున్న నాయకుడు. తెరవెనక మంత్రాంగం నడపడంలో దిట్ట. ఆర్థికంగా స్థితిమంతుడు, పార్టీ అధినేత నుంచి దండిగా భరోసా ఉన్న నాయకుడాయన. ఆయన ఏమి చెబితే అది చేసే అధినేత. ఆయన మాటకు తిరుగులేకుండాపోయేది. అటు మెట్ట, ఇటు కోనసీమలో దాదాపు పార్టీ నేతలు వ్యూహ, ప్రతివ్యూహాలు ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. అటువంటి నాయకుడు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి సామెత మాదిరిగా తయారైంది. రాజకీయాల్లో మూడు దశాబ్థాల చరిత్ర కలిగిన ఆ నాయకుడు రాజకీయాల్లో ‘బొడ్డు’ఊడని నేతల ముందు నిలవలేకపోతున్నారు. రచ్చ గెలిచి ఇంట గెలవలేక... ఎక్కడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఆ నాయకుడు రచ్చ గెలిచి (పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు) ఇంట గెలవలేక నానా పాట్లుపడుతున్నారు. అలాగని రచ్చ గెలిచిన చోటైనా పార్టీలో తన మాట చెల్లుబాటవుతుందా అంటే అదీ లేదు. అతనేమైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారా అంటే అదీ లేదు. తాను ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది.గల్లీ స్థాయి రాజకీయ నాయకుడైనా పార్టీ అధికారంలో ఉంటే అతని మాటకు తిరుగే ఉండదు. అటువంటిది పార్టీ అధికారంలో ఉంది. రాజకీయంగా మూడు దశాబ్దాల అనభవం ఉంది. పోనీ ఆర్థికంగా ఏమైనా సామాన్యుడా అంటే జిల్లాలో టాప్10లో ఒకరిగా ఉన్నారు. ఇన్ని ఉన్నా అతని మాట అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో వినే నాథుడే లేకుండా పోయాడు. పింఛను కూడా ఇప్పించుకోలేని దీనస్థితి... సొంత నియోజకవర్గం ఒకటి. ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఒకటి. ఈ రెండు నియోజకవర్గాలను తన గుప్పెట్లో పెట్టుకుని పార్టీ రాజకీయాలను శాసించిన నాయకుడాయన. అటువంటి నాయకుడు అర్హత ఉన్నప్పటికీ కనీసం పింఛను కూడా ఇప్పించుకోలేకపోవడంతో అతనిలో చేవతగ్గిపోయిందా అంటున్నారు ఆయన వెనుకనుండే అనుచరులు. పింఛన్ మాటేమిటి తాను పుట్టిపెరిగిన మండలంలో తన భార్యకు దేవస్థానం చైర్మన్ కూడా ఇప్పించుకోలేకపోయారు. ఆ నాయకుడిని నమ్మి వెంట ఉన్న ఒక మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరిగితే ఏదో తన ప్రయత్నంగా ఆందోళనకు వచ్చారు తప్పించి ఏమీ చేయలేక చేతులేత్తేశారు, ఈ విషయాలన్నిటిపైనా అధినేత ముందు పెట్టి తాడోపేడో తేల్చుకుంటానని గట్టిగానే హెచ్చరించారు. ఈ నాయకుడితో రాజకీయ వైరం ఉన్న నాయకుడు పెద్ద రాజకీయ దురంధరుడు కూడా కాదు. తొలిసారి ప్రజలు పట్టంకట్టగా రెడ్డి రాజ్యాన్ని ఏలుతున్న నేత. తండ్రి ద్వారా సంక్రమించిన రాజకీయ వారసత్వంతో చెలరేగిపోతున్నా సీనియర్ నాయకుడైనా కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం లేక కారాలు, మిరియాలు నూరుతున్నారు. పార్టీపై కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహాన్ని బయట పెట్టలేని పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ గమనించి వచ్చే ఎన్నికల్లో తనకు రాజకీయంగా అండదండలందించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అనుకుంటున్నారు. కానీ అక్కడేమో స్థానికేతరుడైనా ప్రభుత్వంలో కీలకమైన ప్రజాప్రతినిధిగా ఉన్న కోనసీమ నేత తిష్టవేసే పనిలో ఉన్నారు. ఇటీవలనే ఆయన తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పారని ఈ నాయకుడి చెవిన పడింది. అప్పటి నుంచి ఏటూ పాలుపోవడం లేదట. అనుకున్నట్టు అనుకూలించకపోతే ఏ ఊరులో ఎవరినైనా పేరుపెట్టి పిలిచే చనువు, అనుబంధం ఉంటడంతో స్వతంత్ర పోరుకైనా సిద్ధపడాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకు ఇంకా రెండేళ్లు ఆగాలి కదా..అప్పుడు చూద్దాం ఏమి జరుగుతుందో.