అరుణ కిరణాలేవి..! | budget special item | Sakshi
Sakshi News home page

అరుణ కిరణాలేవి..!

Published Thu, Feb 2 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

అరుణ కిరణాలేవి..!

అరుణ కిరణాలేవి..!

గాలికొదిలేసిన ప్రత్యేక హోదా మాట               
ప్యాకేజీకీ పట్టం కట్టని వైనం
కోస్టల్‌ కారిడార్, కాకినాడ పోర్టు ఊసే లేదు    
కూతే లేని రైలు బండి
కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న సంస్థల ప్రస్తావనేదీ..?
రాజమహేంద్రవరంలో వ్యాపార శిక్షణా కేంద్రం ఎటుపోయింది..?
కానరాని అంతర్వేదిలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదన
 
మోదీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఆమోదయోగ్యంగా లేదంటూ జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. గత వారం రోజుల నుంచి ‘అరుణ’ కిరణాలు జిల్లాపై ప్రసరిస్తాయని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు అటకెక్కాయి... కేంద్రం ప్రకటించిన ప్రతిపాదనలూ పత్తాలేకుండా పోయాయి.
 
సాక్షిప్రతినిధి, కాకినాడ : కేంద్ర బడ్జెట్‌పై జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. ప్రత్యేక హోదా మాటను గాలిలో కలిపేసిన పాలకులు ప్యాకేజీౖMðనా బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యం ఉంటుం దని మేధావి వర్గంతో సహా అన్ని వర్గా లు ఎదురుచూశాయి. తీరా బుధవారం పార్లమెం టులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజీకి సంబంధిం చిన ఎటువంటి ప్రస్తావన లేకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఏ నిధుల కేటాయింపు లూ లేకపోవడంతో జిల్లా అ భివృద్ధిపై ప్రభావం చూపి స్తుందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో పెట్రో ఆధారిత పరిశ్రమలు, పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్, విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్ర తీరం వెంబడి ప్రతిపాదించిన కోస్టల్‌ కారిడార్, కాకినాడ పోర్టు, పోర్టు అనుబంధ పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలకు చోటులభించ లేదు. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ ప్యాకేజీ కేంద్రాలను కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో ఈ సంస్థలకు ని««దlులు కేటాయింపులుంటాయని ఆశించినా నిరాశే ఎదురైంది. చివరకు అంతర్వేదిలో రూ.1450 కోట్లతో ప్రతిపాదించి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా అధికారపార్టీ నేతలు గొప్పలకుపోయిన డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ సంస్థ కార్యకలాపాల ఊసు కూడా లేకపోవడంతో రాజోలు దీవిలో నిరసన వ్యక్తమవుతోంది. భారతీయ విదేశీ వ్యాపార శిక్షణా సంస్థను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించారు. దానికి కూడా ఈ బడ్జెట్‌లో చోటుదక్కలేదు.
కూతే లేని రైలు...
సాధారణ బడ్జెట్‌తో కలిపి రైల్వే బడ్జెట్‌ కూడా ఉండటంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు ఈసారి సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఎదురుచూశారు. ఈ బడ్జెట్‌లో జిల్లాకు సంబంధించి రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదాయే. జిల్లా నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న పార్లమెంటు సభ్యులు ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
∙కాకినాడ– పిఠాపురం, కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్లకు సంబంధించి గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో చోటుచేసుకున్న కాస్త ఆశాజనకమైన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్‌లో కనిపించ లేదు. ఈసారి బడ్జెట్‌లో కూడా పాత కేటాయింపుల మాదిరిగానే తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఎదురుచూసినా నిరాశే మిగిల్చింది. – కాకినాడను మెయిన్‌ లైన్లలో కలపాలనే కోరిక ఈనాటిది కాదు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా కాకినాడను మెయిన్‌ లైన్‌లో కలపాలన్న డిమాండు ఉంది.
∙కాకినాడ–పిఠాపురం లైన్‌కు గత బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించినా ఏ బడ్జెట్‌లో చిల్లిగవ్వ కూడా కేటాయించలే దు.  21 కిలోమీటర్ల ఈ లైన్‌ అంచనా విలువ 2000లో రూ. 126 కోట్లయితే అది ఇప్పుడు రూ.250 కోట్లకు చేరుకుంది.  
∙గత బడ్జెట్‌లో కోనసీమ మీదుగా కోటిపల్లి–నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.200 కేటాయించగా ఈసారి అసలు ప్రస్తావనే లేదు. 16 ఏళ్ల ఈ పెండింగ్‌ ప్రాజెక్టుకు అంత పెద్ద మొత్తంలో కేటాయింపు గత బడ్జెట్‌లోనే అత్యధికంగా కేటాయించారు. 
∙గత ఏడాది కాలంలో కోటిపల్లి–ముక్తేశ్వరం మధ్య రైల్వే వంతెన నిర్మాణానికి నిధులు కేటాయింపు, టెండర్ల ప్రక్రియ మొదలు కావటంతో ఆ ఆశలు మరింత బలపడ్డాయి. తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లు వరకూ కేటాయిస్తారని రైల్వే లైన్‌ పట్టాలెక్కుతుందని ఆశించినా తాజా బడ్జెట్‌లో మొండిచేయే ఎదురైందని కోనసీమ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
∙57 కిలోమీటర్ల పొడవుతో రూ.1,500 కోట్లతో నిర్మించనున్న ఈ లైన్‌కు కొంత వరకూ భూసేకరణ కూడా జరిగింది. రైల్వే వంతెనకు ఫిబ్రవరిలో టెండర్లు ఖరారు కానున్న క్రమంలో తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయింపు జరగకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement