itunes
-
వీడియో గేమ్: గంటలో లక్ష ఫసక్.. కారు అమ్ముకున్న తండ్రి
వీడియో గేమ్‌ల పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్న కేసులు చూస్తూనే ఉన్నాం. అయితే అధికారిక గేమ్ వంకతో ఓ వ్యక్తిని నిలువునా దోచిన వైనం బ్రిటన్‌లో చోటు చేసుకుంది. అతని ఏడేళ్ల కొడుకు వీడియోగేమ్ ఆడుతూ చేసిన పనితో.. కారు అమ్మేసి మరీ ఆ డబ్బు కట్టాల్సి వచ్చింది. లండన్: నార్త్ వేల్స్‌కి చెందిన ఏడేళ్ల బాలుడు అషాజ్ తన తండ్రి ఐఫోన్లో ‘డ్రాగన్స్: రైజ్ ఆఫ్ బెర్క్’ వీడియో గేమ్ ఆడాడు. ఆట మధ్యలో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోతుండగా.. మధ్య వచ్చిన యాప్ యాడ్స్‌ను క్లిక్ చేసుకుంటూ పోయాడు. అలా గంట వ్యవధిలో సుమారు రెండు పౌండ్ల నుంచి వంద పౌండ్ల విలువ చేసే యాప్స్ కొన్నింటిని కొనుక్కుంటూ పోయాడు. ఆ మొత్తం ఎమౌంట్ 1,289 పౌండ్లకు(మన కరెన్సీలో లక్షా ముప్ఫై వేలదాకా) చేరింది. ఈ-మెయిల్స్ ద్వారా యాపిల్ కంపెనీ నుంచి బిల్లులు జనరేట్ అయిన విషయం గుర్తించిన ఆ పిల్లాడి తండ్రి ముహమ్మద్ ముతాజా.. షాక్ తిన్నాడు. కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అయిన ముతాజా.. అంత స్తోమత లేకపోవడంతో కారును అమ్మేసుకున్నాడు. ఆషాజ్కు ఫోన్ పాస్ వర్డ్ తెలిసినప్పటికీ.. ఆటలో అపరిమిత కొనుగోలు వ్యవహారంపై రచ్చ మొదలైంది. పచ్చి మోసం నిజానికి అది ఫ్రీ వెర్షన్ గేమ్. నాలుగేళ్లు పైబడిన పిల్లలు ఎవరైనా ఆడోచ్చు. కానీ, అంతేసి అమౌంట్ యాప్‌ల కొనుగోలు యాడ్లను ఇవ్వడంపై ముతాజా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొనుగోళ్లను.. అందులో పెద్ద మొత్తం ఎమౌంట్తో అనుమతించడం పెద్ద మోసమని ముతాజా వాపోతున్నాడు. ఇదొక పెద్ద స్కామ్‌గా భావిస్తూ.. యాపిల్ కంపెనీకి ఫిర్యాదు చేశాడు. అయితే కొంతలో కొంత ఊరటగా.. 207 పౌండ్లు(సుమారు 21 వేలు) వెనక్కి వచ్చాయి. మరోవైపు పిల్లల గేమ్‌ల్లో పరిమితులు లేని కొనుగోళ్ల వ్యవహారంపై ఆయన కోర్టును ఆశ్రయించాడు. చదవండి: వయసు 24.. సంపాదన ఊహించలేనంత! -
ఐట్యూన్స్‌కు యాపిల్ గుడ్‌బై..
శాన్ జోస్: ఆన్లైన్ మ్యూజిక్ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్ యాప్ ఇకపై కనుమరుగు కానుంది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. యాపిల్ మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్ యాపిల్ టీవీ ఇందులో ఉంటాయని వివరించింది. 2001లో తొలిసారిగా ఐట్యూన్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నెట్ మాధ్యమంగా మ్యూజిక్, ఆన్ డిమాండ్ వీడియోలు మొదలైనవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజాగా ఐట్యూన్స్‌ను మూడు వేర్వేరు యాప్‌ల కింద తీసుకురావడం ద్వారా ఈ ఏడాదే ప్రవేశపెట్టబోయే టీవీప్లస్ సర్వీసులకు మరిన్ని హంగులు అద్దేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. యాపిల్ టీవీ యాప్‌ను స్మార్ట్ టెలివిజన్స్‌లో పొందుపర్చడంతో పాటు రోకు, అమెజాన్ ఫైర్ టీవీ మొదలైన థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెగ్ ఫెడరిగి తెలిపారు. -
ఐఫోన్ కంపెనీ విరాళమెంతో తెలుసా?
తిరువనంతపురం : ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ భారీ వరదలతో అతలాకుతలమైంది. వందలాది మంది మరణించగా... లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కకావికలమైన కేరళను కాపాడేందుకు యావత్ భారత దేశం ముందుకొస్తోంది. డబ్బు, నిత్యావసర వస్తు సామాగ్రిని సాయం చేస్తూ అక్కడి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పలు దిగ్గజ కంపెనీలు సైతం భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా దిగ్గజ ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ కూడా కేరళకు ఆర్థికసాయం ప్రకటించింది. రాష్ట్రానికి రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నట్లు వెల్లడించింది. ‘కేరళలో వరదల పరిస్థితి గురించి తెలిసి మేం ఎంతగానో దిగ్భ్రాంతి చెందాం. కేరళ సీఎం సహాయనిధి, మెర్సీ కార్ప్స్ ఇండియాకు రూ. 7 కోట్ల విరాళం అందిస్తున్నాం. వీటిని అవసరమైన దగ్గర స్కూళ్లను, ఇళ్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగించండి’ అని ఆపిల్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక.. కేరళను ఆదుకునేందుకు ముందుకురావాలని ఆపిల్ తన యూజర్లను ప్రోత్సహిస్తోంది. తన హోమ్ పేజీలో సపోర్ట్ బ్యానర్లను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాక యాప్ స్టోర్, ఐట్యూన్‌లలో మెర్సీ కార్ప్స్కు విరాళాలు అందించేందుకు డొనేట్ బటన్ ఏర్పాటుచేసింది. ఈ బటన్ ద్వారా ఆపిల్ యూజర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో కేరళకు విరాళం ఇవ్వొచ్చని వెల్లడించింది. భారీ ఎత్తున సంభవించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపిల్ తన ఐట్యూన్స్ స్టోర్, ఆపిల్ స్టోర్ల ద్వారా విరాళాలు సేకరించి, తీవ్రంగా దెబ్బతిన్న వాటికి సాయంగా అందిస్తూ ఉంటుంది. ఆపిల్ కస్టమర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను వాడి 5 డాలర్లు, 10 డాలర్లు, 25 డాలర్లు, 50 డాలర్లు, 100 డాలర్లు, 200 డాలర్లను మెర్సీ కార్ప్స్కు డొనేట్ చేయొచ్చు. కాగ భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన కేరళ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పునరావస కేంద్రాల నుంచి ఇళ్లకు తరలివెళ్తున్నారు. మరోవైపు కేరళను ఆదుకునేందుకు స్వదేశీయులతో పాటు విదేశీయులు సైతం ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తూ కేరళ ప్రజలకు అండగా ఉంటున్నారు. -
యాపిల్ సర్వీసులను నిలిపివేసిన చైనా!
బీజింగ్ః చైనాలో యాపిల్ సంస్థ ఐట్యూన్స్ సినిమాలు, ఐ బుక్స్ సేవలను నిలిపివేసింది. అధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతానికి తమ సేవలు అందుబాటులో ఉండవని సంస్థ వెల్లడించింది. అయితే వినియోగదారులకు తిరిగి సాధ్యమైనంత త్వరలో పుస్తకాలు, ఐ ట్యూన్స్ సినిమాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఆ సంస్థ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అమెరికా తర్వాత యాపిల్ ఉత్పత్తుల మార్కెట్ కు రెండో స్థానమైన చైనాలో సేవలను నిలిపివేయడానికి కారణం మాత్రం తెలియ రాలేదు. చైనాలో ఏడునెలల క్రితం ప్రారంభించిన ఐ ట్యూన్స్ సినిమాలు, ఐ బుక్స్ వంటి ప్రత్యేక సేవలను యాపిల్ సంస్థ గతవారం నిలిపివేసింది. ప్రెస్, పబ్లికేషన్, రేడియో, సినిమాతో పాటు టెలివిజన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ తో గతవారం యాపిల్ సేవలను తప్పనిసరిగా నిలిపివేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. బ్రాడ్ కాస్ట్, ప్రింట్, ఆన్ లైన్ మీడియాల్లో గట్టి పట్టు బిగించిన బీజింగ్.. చైనాలో గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్లతో సహా విదేశీ వెబ్ సైట్ల యాక్సెస్ ను పరిమితం చేసింది. దీంతో రాజకీయంగా సున్నితమైన, హింసాత్మక, నైతికత లేని విషయాలను దేశం తరచుగా నిరోధిస్తోంది. దీనికితోడు చైనాలో యాపిల్ ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణ పొందడంతో పాటు.. అక్కడి మార్కెట్ అమితంగా విస్తరించి అత్యంత కీలకమైనదిగా మారింది. దీంతో యాపిల్ సేవలు, ధరల అంశాలపై ఇంతకు ముందే చైనా మీడియా అభ్యంతరాలు తెలుపుతూ వస్తోంది. 2014 లో యాపిల్ స్టోర్ లోకి చొరబడిన చైనా మొబైల్ అడ్వర్ టైజింగ్ కంపెనీ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సేకరించడం మొదలు పెట్టడంతో సరైన సమయంలో గుర్తించిన యాపిల్ కంపెనీ... తమ స్టోర్స్ నుంచి భారీ స్థాయిలో యాప్స్ ను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం యాపిల్ సంస్థలు చైనా సంస్థలకు పోటీ పడుతుండటంతో దేశీయ సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం యాపిల్ సేవలను నిలిపివేసినట్లు అధికారిక పరిశీలనలు సూచిస్తున్నాయి. -
ఐట్యూన్స్, గ్యాస్, డౌన్లోడ్..!
స్విస్ బ్యాంకుల్లో లావాదేవీలకు రహస్య సంకేతాలు ఇవి... జ్యూరిక్: కాదేదీ ‘కోడ్’కు అనర్హం అంటే ఇదేనేమో! ఇంతకీ దేనికంటారా.. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకునేవాళ్లకు రహస్య సంకేతాల్లో ట్రెండ్ ఇది. అంతర్జాతీయంగా వివిధ దేశాలు నల్లధనంపై కొరడా ఝుళిపిస్తుండటంతో స్విస్ బ్యాంకులు తమ గుట్టును విప్పాల్సి వస్తోంది. కేవలం ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచుకోవడానికి మాత్రమే కోడ్లను వినియోగిస్తుంటారనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే, అక్కడి బ్యాంకర్లకు క్లయింట్లకు మధ్య జరిగే ప్రతి ఒక్క లావాదేవీకి కూడా ఒక రహస్య సంకేతం ఉంటుందన్న విషయం ఇటీవలే బయటికొచ్చింది. అమెరికా పన్ను శాఖలతో పలు స్విస్ బ్యాంకులు చేసుకున్న సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం ఖాతాలకు చెందిన అనేక వివరాలను ఆయా బ్యాంకులు తెలియజేశాయి. ఇందులో కోడ్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా స్విస్ బ్యాంక్ క్లయింట్లు తమ ఖాతాల నుంచి సొమ్మును ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడానికి ‘డౌన్లోడ్’ అనే కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందట! అదేవిధంగా నిధులను డ్రా చేసుకోవాలంటే చెప్పాల్సిన రహస్య సంకేతాల్లో ‘ఐట్యూన్స్’, ‘గ్యాస్’ వంటివి ఉన్నాయి. బ్లాక్ మనీపై భారత్ సహా అనేక దేశాలు ఇటీవల పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో స్విస్ బ్యాంకులు రహస్య ఖాతాల గుట్టును విప్పాల్సి వస్తోంది. అయితే, తాజా కోడ్లను పరిశీలిస్తే.. ఇప్పటికే స్విస్ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నిధులు సింగపూర్, ఇజ్రాయెల్, సైప్రస్, లెబనాన్, హాంకాంగ్, దుబాయ్ వంటి దేశాలకు తరలిపోయిందన్న విషయం తేటతెల్లమవుతోంది. యూఎస్ న్యాయ శాఖకు వివిధ స్విస్ బ్యాంకులు ఇచ్చిన ‘స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ నివేదిక దీన్ని బయటపెట్టింది. తమ క్లయింట్లు నల్లధనాన్ని దాచుకోవడానికి వివిధ దేశాల్లో దొంగ సంస్థలను రిజిస్టర్ చేసుకోవడానికి, బోగస్ బీమా పథకాలను సృష్టించడంలో ఎలా తోడ్పాటునందించిందీ కూడా బ్యాంకులు ఆ నివేదికలో వెల్లడించాయి. భారీస్థాయి(హై ప్రొఫైల్) ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ ఈవెంట్లకు హాజరయ్యే సంపన్నులను తమ నల్లధనాన్ని సురక్షితంగా ఎలా దాచుకోవచ్చో వివరించేందుకు స్విస్ బ్యాంకులు ప్రత్యేకంగా రిలేషన్షిప్ మేనేజర్లను రంగంలోకి దించేవన్న సంగతి కూడా తాజాగా బట్టబయలైంది. -
ఆదివారం కొన్ని గంటల పాటు ఐట్యూన్స్‌కు సెలవు!
ఐ ట్యూన్స్.. యాపిల్ ఐఫోన్లలో ఏ రకమైన సంగీతం డౌన్లోడ్ చేసుకోవాలన్నా తప్పనిసరి. అలాంటి ఐట్యూన్స్ కనెక్ట్ ఈ ఆదివారం నాడు.. అంటే నవంబర్ 16వ తేదీన ఆరు గంటల పాటు పని చేయదట. ఆరోజు రాత్రి 7.30 గంటల నుంచి మొదలుపెట్టి, ఆరు గంటలు.. అంటే రాత్రి 1.30 గంటల వరకు ఐట్యూన్స్ కనెక్ట్ కాదు. అలాగే కంటెంట్ కూడా డెలివరీ కాదు. ఈ విషయాన్ని ఐట్యూన్స్ తన కస్టమర్లందరికీ ఈమెయిల్ నోటిఫికేషన్ల ద్వారా కూడా తెలియజేసింది. ఈ విషయంలో ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే వెంటనే తమను సంప్రదించాల్సిందిగా కోరింది.