శాన్ జోస్: ఆన్‌లైన్ మ్యూజిక్ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్ యాప్ ఇకపై కనుమరుగు కానుంది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. యాపిల్ మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్ యాపిల్ టీవీ ఇందులో ఉంటాయని వివరించింది. 2001లో తొలిసారిగా ఐట్యూన్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నెట్ మాధ్యమంగా మ్యూజిక్, ఆన్ డిమాండ్ వీడియోలు మొదలైనవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజాగా ఐట్యూన్స్‌ను మూడు వేర్వేరు యాప్‌ల కింద తీసుకురావడం ద్వారా ఈ ఏడాదే ప్రవేశపెట్టబోయే టీవీప్లస్ సర్వీసులకు మరిన్ని హంగులు అద్దేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. యాపిల్ టీవీ యాప్‌ను స్మార్ట్ టెలివిజన్స్‌లో పొందుపర్చడంతో పాటు రోకు, అమెజాన్ ఫైర్ టీవీ మొదలైన థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్‌ల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెగ్ ఫెడరిగి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment