apple itunes
-
Apple: ప్రపంచ నం1 కంపెనీ వాచ్‌లపై నిషేధం!
ప్రపంచ నంబర్‌వన్ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆరోపణలు వస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే లైట్ టెక్నాలజీతో పనిచేసే యాపిల్ వాచ్ మోడళ్ల దిగుమతులను నిషేధించాలంటూ మాసిమో కార్ప్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ట్రేడ్ కమిషన్‌కు సిఫారసు చేసినట్లు మెడికల్ టెక్నాలజీ కంపెనీ మాసిమో కార్ప్ గురువారం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన మాసిమో తెలిపిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్(యుఎస్ఐటీసీ) 60 రోజులపాటు ‘పరిమిత మినహాయింపు ఉత్తర్వు’లు జారీ చేసినట్లు సమాచారం. యుఎస్ఐటీసీ ఇచ్చే తీర్పు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ కూడా చట్టానికి అతీతం కాదనే సందేశాన్ని పంపుతుందని మాసిమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జో కియాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేటెంట్ టెక్నాలజీని యాపిల్ చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ‘లైట్-బేస్డ్ ఆక్సిమెట్రీ ఫంక్షనాలిటీ’ కోసం ఆపిల్ వాచ్ మాసిమో పేటెంట్ టెక్నాలజీని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 2021లో సంస్థ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?) యాపిల్ వినియోగదారుల ఆరోగ్యం కంపెనీకి చాలా ముఖ్యమని సంస్థ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్లకు మరింత సేవలందించేలా సంస్థ నిత్యం పనిచేస్తుందని చెప్పింది. అయితే కొందరు కావాలనే యాపిల్ ఉత్పత్తులను కాపీచేసి తమ సొంత ఉత్పత్తులుగా ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాసిమో చర్యలపై ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తామని యాపిల్ తెలిపింది. యాపిల్ గత నెలలో వాచ్సిరీస్ 9ని విడుదల చేసింది. ఆరోగ్య డేటాను యాక్సెస్ చేసి వివరాలు విశ్లేషించే వెసులుబాటు అందులో ఉంది. -
ఐఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి..!
ఐఫోన్ యూజర్లకు యాపిల్ గట్టి షాక్ ను ఇచ్చింది. ఎన్నో రోజులుగా వస్తోన్న సంప్రదాయానికి యాపిల్ స్వస్తి పలికింది. మూడు నెలలపాటు ఉచితంగా అందించే యాపిల్ మ్యూజిక్ సేవను పరిమితం చేసింది. కేవలం నెల రోజులే..! యాపిల్ తన కొత్త యూజర్లకు యాపిల్ మ్యూజిక్ సేవలను మూడు నెలల పాటు ఉచితంగా అందించేది. ఇకపై ఒక నెల రోజుల పాటు మాత్రమే ఉచితంగా మ్యూజిక్ సేవలను అందించనుంది. యాపిల్ మ్యూజిక్ సేవలకు నెలకొన్న ఆదరణ నేపథ్యంలో యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో అతి పెద్ద సర్వీస్...! స్పాటి ఫై తరువాత యాపిల్ మ్యూజిక్ ప్రపంచంలో అతి పెద్ద మ్యూజిక్ సర్వీస్ గా నిలుస్తోంది. ఇప్పటికే యాపిల్ మ్యూజిక్ సేవను ఎంతో మంది యూజర్స్ వాడుతున్నారు. దీంతో ఈ సేవలను పరిమితం చేస్తూ యాపిల్ నిర్ణయం తీసుకుంది. ఇక పలు యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై అందించే ఉచిత ఆరు నెలల ట్రయల్ వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదు. బీట్స్, ఎయిర్పాడ్లు, హోమ్‌పాడ్ మినీ వంటి ఉత్పత్తులపై యథాతథంగా ఉండనుంది. ఐతే ప్రస్తుతం మూడు నెలల ట్రయల్ మ్యూజిక్ సేవలను పొందుతున్న హోల్డర్లకు ఏమి జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు. -
యాపిల్ అదిరిపోయే ఫీచర్, సాయిధరమ్ తేజ్...చిత్రలహరిలో చెప్పింది ఇదే
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్, యాపిల్ వాచ్ కోసం కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ పనిచేస్తుంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం..కొత్త ఫీచర్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కార్ డిటెక్షన్ ఫీచర్ అంటే? కార్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాల గురించి సింపుల్‌గా చెప్పాలంటే..రెండేళ్ల క్రితం టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం చిత్రలహరి. ఈ సినిమా స్టోరీ అంతా కారు డిటెక్షన్ ఫీచర్ మీదే నడుస్తుంది. ప్రయాణంలో కారుకు యాక్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్‌గా ఆస్పత్రి, పోలీస్ స్టేషన్లకు చేరేలా ఓ యాప్ డిజైన్ చేసే యువకుడిగా తేజ్ కనిపించాడు. యాక్సిడెంట్ అలెర్ట్ సిస్టమ్ పేరుతో ఓ స్టార్టప్ నెలకొల్పే న్యూ ఎంట్రప్యూనర్ గా మెప్పించాడు. ఇప్పుడు ఇదే ఐడియాని యాపిల్ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడింది. డయల్ 911 యాపిల్ కొత్త ఫీచర్ 'కార్ డిటెక్షన్' ఐఫోన్, యాపిల్ వాచ్‌లోనూ పనిచేయనుంది. ఇందుకోసం యాపిల్ యాక్సిలరేటర్ వంటి సెన్సార్ల నుండి డేటాను ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు కారు ప్రమాదానికి గురైనప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తి గుర్తించి 911(పోలీస్, ఫైర్, మెడికల్) విభాగానికి ఇన్ఫర్మేషన్ చేరవేసే ఫీచర్‌ను సైతం అందుబాటులోకి తీసుకొని రానుంది. 10 మిలియన్లకు పైగా కారు ప్రమాదాల్ని యాపిల్ గత కొంత కాలంగా కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌పై పని చేస్తోంది. అయితే దాని ప్రాముఖ్యతను గుర్తించడానికి కంపెనీ ఐఫోన్,యాపిల్ వాచ్ వినియోగ దారుల డేటాను సేకరించింది. ఆ డేటా ఆధారంగా ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా కారు ప్రమాదాల్ని గుర్తించినట్లు యాపిల్ అనధికారికంగా తెలిపినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ తన కథనంలో ప్రస్తావించింది. యాపిల్ మాత్రమే కాదు.. ఈ ఫీచర్ యాపిల్ యూజర్లకు కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లలో చాలా సంవత్సరాలుగా ఉంది. గూగుల్ ఫోన్ లొకేషన్, మోషన్ సెన్సార్లు కారు ప్రమాదాన్ని గుర్తించి, ఆపై అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. కారు క్రాష్ డేటాతో పాటు లొకేషన్‌ను షేర్ చేస్తుంది. చదవండి: దివాళీ బంపర్ ఆఫర్, ఐఫోన్‌పై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు -
ఆపిల్ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?!
మీరు ఆపిల్ ప్రాడక్ట్ లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. సెప్టెంబర్ 14, 15 తేదీలలో (అంచనా) ఆపిల్ సంస్థ 'వరల్డ్ డెవలపర్ కాన్ఫిరెన్స్' (wwdc) 2021 ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున కొత్త ప్రాడక్ట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం..ఆపిల్ సంస్థ ప్రతి ఏడాది డెవలపర్ కాన్ఫిరెన్స్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది.ఈ ఈవెంట్లో విడుదల చేయబోయే ఉత్పత్తుల గురించి అనౌన్స్ చేస్తుంది. వచ్చే నెలలో జరగనున్న ఈవెంట్లో యాపిల్ వాచ్ 7 సిరీస్, ఐపాడ్ మినీ 6, ఆపిల్ ఎయిర్ పాడ్స్ 3, ఐపాడ్ మినీ 6 విడుదల చేయనున్నట్ల బ్లూమ్ బెర్గ్ తన కథనంలో పేర్కొంది. పై ప్రాడక్ట్స్తో పాటు గతేడాది వరల్డ్ డెవలపర్ కాన్ఫిరెన్స్ 2020లో విడుదల కాకుండా ఆగిపోయిన ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఐపాడ్స్‌ను విడుదల చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 13 ఐఫోన్ 13లో కొన్ని ముఖ్యమైన డిజైన్, హార్డ్‌వేర్ లను మార్చనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రిమ్డ్ డౌన్ డిస్ప్లే నాచ్, ఫేస్-ఐడి కాంపోనెంట్లను యాడ్ చేయనుంది. ఫేస్ ఐడి సిస్టమ్‌లో వీఎస్సీఈఎల్ (Vertical-cavity surface-emitting laser) చిప్‌ని జోడించడం, ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ లలో 120 హెచ్ జెడ్ ఎల్టీపీఓ డిస్ ప్లేలు, లార్జ్ సైజ్ బ్యాటరీతో రిలీజ్ చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా. ప్రస్తుతం ఐఫోన్ 12 మోడల్‌కు 512జీబీ స్టోరేజ్‌ను అందిస్తుండగా ఐఫోన్13 ను 1టెరాబైట్ స్టోరేజ్‌తో అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఐఫోన్ 13 వివరాలు అందుబాటులో ఉండగా.. మిగిలిన ప్రాడక్ట్‌ల వివరాలను ఆపిల్ సంస్థ పూర్తి స్థాయిలో రివిల్ చేయలేదు. చదవండి : వాట్సాప్‌లో మరో ఫీచర్, ఇకపై ఐపాడ్లో కూడా -
ఐట్యూన్స్‌కు యాపిల్ గుడ్‌బై..
శాన్ జోస్: ఆన్లైన్ మ్యూజిక్ రూపురేఖలు మార్చేసిన ఐట్యూన్స్ యాప్ ఇకపై కనుమరుగు కానుంది. దీని స్థానంలో మూడు యాప్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. యాపిల్ మ్యూజిక్, పాడ్‌కాస్ట్స్ యాపిల్ టీవీ ఇందులో ఉంటాయని వివరించింది. 2001లో తొలిసారిగా ఐట్యూన్స్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నెట్ మాధ్యమంగా మ్యూజిక్, ఆన్ డిమాండ్ వీడియోలు మొదలైనవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. తాజాగా ఐట్యూన్స్‌ను మూడు వేర్వేరు యాప్‌ల కింద తీసుకురావడం ద్వారా ఈ ఏడాదే ప్రవేశపెట్టబోయే టీవీప్లస్ సర్వీసులకు మరిన్ని హంగులు అద్దేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. యాపిల్ టీవీ యాప్‌ను స్మార్ట్ టెలివిజన్స్‌లో పొందుపర్చడంతో పాటు రోకు, అమెజాన్ ఫైర్ టీవీ మొదలైన థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ల్లో కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెగ్ ఫెడరిగి తెలిపారు. -
మరణ తేదీని చెప్పేందుకు ఓ యాప్!!
మనిషికి తాను ఎంతకాలం బతుకుతానో.. ఎప్పుడు చనిపోతానో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండటం సర్వసాధారణం. కానీ అది తెలియడం అంత సులభం కాదనుకుంటున్నారా.. అయితే మీకోసం ఇదుగో, ఓ యాప్ సిద్ధంగా ఉంది. 'డెడ్‌లైన్' అనే ఈ యాప్.. మీ ఐఫోన్లో ఉన్న హెల్త్‌కిట్ టూల్ నుంచి సమాచారం మొత్తాన్ని స్కాన్ చేసి, మీరు ఏరోజు మరణిస్తారో చెప్పేస్తుంది. ఎత్తు, బీపీ, ఎంతసేపు పడుకుంటున్నారు, రోజుకు ఎంత నడుస్తున్నారు.. ఇలాంటి వివరాలన్నింటినీ ఈ యాప్ లెక్కకట్టేస్తుంది. ఈ సమాచారాన్ని ఉపయోగించి, దానికి మీ జీవనశైలికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు జోడించి.. వాటి సమాధానాల ద్వారా సుమారుగా మీ మరణ తేదీని చెబుతుంది. వాస్తవానికి ఏ యాప్ కూడా కచ్చితంగా మనం మరణించే తేదీని చెప్పలేపదని, కానీ ఇది మాత్రం వాస్తవానికి మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైన పక్షంలో వైద్యుడిని సంప్రదించాలని కూడా సూచిస్తుందని ఈ యాప్‌ను డెవలప్ చేసిన జిస్ట్ ఎల్ఎల్సీ సంస్థ యాపిల్ ఐట్యూన్స్ పేజీలో రాసింది. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం ద్వారా మరణాన్ని వాయిదా వేసుకోవచ్చని కూడా అంటున్నారు.