ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్, యాపిల్ వాచ్ కోసం కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ పనిచేస‍్తుంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం..కొత్త ఫీచర్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
కార్ డిటెక్షన్ ఫీచర్ అంటే?
కార్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాల గురించి సింపుల్‌గా చెప్పాలంటే..రెండేళ్ల క్రితం టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం చిత్రలహరి. ఈ సినిమా స్టోరీ అంతా కారు డిటెక్షన్ ఫీచర్ మీదే నడుస్తుంది. ప్రయాణంలో కారుకు యాక్సిడెంట్ జరిగితే ఆటోమేటిక్‌గా ఆస్పత్రి, పోలీస్ స్టేషన్లకు చేరేలా ఓ యాప్ డిజైన్ చేసే యువకుడిగా తేజ్ కనిపించాడు. యాక్సిడెంట్ అలెర్ట్ సిస్టమ్ పేరుతో ఓ స్టార్టప్ నెలకొల్పే న్యూ ఎంట్రప్యూనర్ గా మెప్పించాడు. ఇప్పుడు ఇదే ఐడియాని యాపిల్ ఇంప్లిమెంట్ చేసే పనిలో పడింది.
డయల్ 911
యాపిల్ కొత్త ఫీచర్ 'కార్ డిటెక్షన్' ఐఫోన్, యాపిల్ వాచ్‌లోనూ పనిచేయనుంది. ఇందుకోసం యాపిల్ యాక్సిలరేటర్ వంటి సెన్సార్‌ల నుండి డేటాను ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంది. దీంతో పాటు కారు ప్రమాదానికి గురైనప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తి గుర్తించి 911(పోలీస్, ఫైర్, మెడికల్) విభాగానికి ఇన్ఫర్మేషన్ చేరవేసే ఫీచర్‌ను సైతం అందుబాటులోకి తీసుకొని రానుంది.
10 మిలియన్లకు పైగా కారు ప్రమాదాల్ని
యాపిల్ గత కొంత కాలంగా కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌పై పని చేస్తోంది. అయితే దాని ప్రాముఖ్యతను గుర్తించడానికి కంపెనీ ఐఫోన్,యాపిల్ వాచ్ వినియోగ దారుల డేటాను సేకరించింది. ఆ డేటా ఆధారంగా ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా కారు ప్రమాదాల్ని గుర్తించినట్లు యాపిల్ అనధికారికంగా తెలిపినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ తన కథనంలో ప్రస్తావించింది.
యాపిల్ మాత్రమే కాదు..
ఈ ఫీచర్ యాపిల్ యూజర్లకు కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లలో చాలా సంవత్సరాలుగా ఉంది. గూగుల్ ఫోన్ లొకేషన్, మోషన్ సెన్సార్‌లు కారు ప్రమాదాన్ని గుర్తించి, ఆపై అత్యవసర సేవలకు కాల్ చేస్తుంది. కారు క్రాష్ డేటాతో పాటు లొకేషన్‌ను షేర్ చేస్తుంది.
చదవండి: దివాళీ బంపర్ ఆఫర్, ఐఫోన్‌పై కళ్లు చెదిరేలా భారీ డిస్కౌంట్లు
Comments
Please login to add a commentAdd a comment