
ఐఫోన్ యూజర్లకు యాపిల్ గట్టి షాక్ ను ఇచ్చింది. ఎన్నో రోజులుగా వస్తోన్న సంప్రదాయానికి యాపిల్ స్వస్తి పలికింది. మూడు నెలలపాటు ఉచితంగా అందించే యాపిల్ మ్యూజిక్ సేవను పరిమితం చేసింది.
కేవలం నెల రోజులే..!
యాపిల్ తన కొత్త యూజర్లకు యాపిల్ మ్యూజిక్ సేవలను మూడు నెలల పాటు ఉచితంగా అందించేది. ఇకపై ఒక నెల రోజుల పాటు మాత్రమే ఉచితంగా మ్యూజిక్ సేవలను అందించనుంది. యాపిల్ మ్యూజిక్ సేవలకు నెలకొన్న ఆదరణ నేపథ్యంలో యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెండో అతి పెద్ద సర్వీస్...!
స్పాటి ఫై తరువాత యాపిల్ మ్యూజిక్ ప్రపంచంలో అతి పెద్ద మ్యూజిక్ సర్వీస్ గా నిలుస్తోంది. ఇప్పటికే యాపిల్ మ్యూజిక్ సేవను ఎంతో మంది యూజర్స్ వాడుతున్నారు. దీంతో ఈ సేవలను పరిమితం చేస్తూ యాపిల్ నిర్ణయం తీసుకుంది. ఇక పలు యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై అందించే ఉచిత ఆరు నెలల ట్రయల్ వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదు. బీట్స్, ఎయిర్‌పాడ్‌లు, హోమ్‌పాడ్ మినీ వంటి ఉత్పత్తులపై యథాతథంగా ఉండనుంది. ఐతే ప్రస్తుతం మూడు నెలల ట్రయల్ మ్యూజిక్ సేవలను పొందుతున్న హోల్డర్‌లకు ఏమి జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment