Spotify
-
‘ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాం’.. ఉద్యోగులకు స్పాటిఫై భారీ షాక్!
ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. తన వర్క్ ఫోర్స్‌లో మొత్తం 17శాతం మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది స్పాటిఫై సీఈఓ డానియల్ ఏకే తన బ్లాగ్ పోస్ట్‌లో ఉద్యోగుల లేఆఫ్స్‌పై స్పందించారు. ‘‘ సంస్థ పనితీరు బాగుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ ఆశించిన స్థాయిలో లేదు. ఖర్చులు పెరిగిపోతున్నాయి. డబ్బులు సంపాదించాలంటే బిజినెస్ జరగాలి. కాబట్టే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. డబ్బుల్ని ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఎంత మందితో ఏ పనిని ఎలా చేయాలన్న అంశంపై చర్చలు జరుపుతున్నట్లు’’ డానియల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపులు తప్పడం లేదు అంతేకాదు, ఈ నిర్ణయంతో స్పాటిఫై కంపెనీలో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి. మా లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాల్ని మార్చేస్తున్నాం. తీసుకునే నిర్ణయం కఠినమైందే. కానీ తప్పడం లేదు. సంస్థలోని మొత్తం 17 శాతం ఉద్యోగుల్ని ఫైర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఫలితంగా స్పాటిఫైలో అనేక మంది ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సూటీగా చెప్పాలంటే కష్టపడి పనిచేసే తెలివైన, ప్రతిభావంతులైన సిబ్బంది మమ్మల్ని విడిచిపెడతారు అని డేనియల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. తొలగించిన ఉద్యోగుల్ని సంరక్షిస్తాం. అదే సమయంలో విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. వారిని అన్ని విధాల ఆదుకుంటాం. ఉద్యోగి ఎక్స్పీరియన్స్ ఆధారంగా పబ్లిక్ హాలిడేస్కి డబ్బులు చెల్లిస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగించుకునే సదుపాయం, ఉద్యోగం పరంగా ఇమిగ్రేషన్ సమస్యలు రాకుండా కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యే వరకు వారిని సంరక్షిస్తామని చెప్పారు. జూన్‌లో తొలగింపు స్పాటిఫై ఒకే ఏడాదిలో రెండో దఫా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసింది. ఈ ఏడాది జూన్‌లో పాడ్ కాస్ట్ యూనిట్‌లోని 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. పోడ్కాస్ట్ విభాగంలోని తొలగింపులు వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని ఆ సమయంలో వెల్లడించింది. తాజాగా మరో మారు సిబ్బందికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకుంది. -
సినిమా చూపిస్త మావా.. వడివడిగా ఓవర్ ది టాప్ అడుగులు
కంటికి కనిపించని కరోనాను తీసుకువచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన 2020.. మానవాళి జీవన శైలిని సమూలంగా మార్చివేసింది. అనేక అలవాట్లను, పోకడలను పరిచయం చేసింది. వర్క్ ఫ్రం హోంలు, ఆన్లైన్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్‌లు లాంటి వాటన్నింటినీ అలవాటు చేసింది. అదే సంవత్సరం మరో పరిణామానికి నాంది పలికింది. అది స్ట్రీమింగ్ సర్వీసుల వెల్లువ. మనం ఓటీటీ సర్వీసుగా పిలుచుకునే ఈ సేవల విజృంభణకు కరోనా కూడా ఓ ప్రధాన కారణమయ్యింది. థియేటర్ల మూత, బయట తిరగలేని పరిస్థితి, వర్క్ ఫ్రం హోంలతో ఇంటికి పరిమితమైన జనాభాకు వినోదం అందించేందుకు ఓ కొత్త మార్గాన్ని ఆవిష్కరించిందీ ఓటీటీ సర్వీసు. కేబుల్ కనెక్షన్, బ్రాడ్కాస్ట్ పరికరాలు, శాటిలైట్ కనెక్షన్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ లాంటి ఎలాంటి పరికరం ద్వారా అయినా వినోదాన్ని అందించేదే ఈ స్ట్రీమింగ్ సర్వీసు. సినిమాతో మొదలై టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్ట్రీమింగ్ల వరకు విస్తరించిన ఈ ఓటీటీ రంగం త్వరలో టెలివిజన్ రంగాన్ని మించి పోయే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పేరుకు తగ్గట్టుగా ఓటీటీ (ఓవర్ ది టాప్) అన్ని వినోద రంగాల్ని అధిగమించబోతోంది. వీడియో వచ్చి రేడియోను మరిపించినట్లుగా ఓటీటీ ఇప్పుడు డిష్ చానళ్లను కనుమరుగు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కేబుల్ కనెక్షన్లకు స్వస్తి చెప్పి ఓటీటీ సర్వీసుల్లో సభ్యులుగా చేరిపోయారు. ఓటీటీ సేవల విస్తృతి గమనిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. 2019 నాటికి 190 కోట్ల మంది సభ్యులు కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ 2020కి 210 కోట్లు, 2021 నాటికి 220 కోట్లు లెక్కన 2025 నాటికి 270 కోట్ల సభ్యులను సమకూర్చుకోబోతోంది. ఇది ఆఫ్రికా ఖండం జనాభాకు దాదాపుగా రెట్టింపు కాబోతోంది. సభ్యత్వ రుసుము ద్వారా ఈ సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. 2019లో 8,300 కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి అది 9,900 కోట్ల డాలర్లకు పెరిగి 2025 నాటికి 16700 కోట్ల డాలర్లకు పెరగనున్నట్లు అంచనా. అంటే శ్రీలంక, నేపాల్ జీడీపీలను కలిపినా ఈ మొత్తం ఎక్కువే. దీనంతటకూ కారణం బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ పెరగడం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, చెల్లించే రుసుము తక్కువ కావడం కొన్ని కారణాలైతే విపరీతంగా పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు మరో పెద్ద కారణం. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడున్నా నచ్చిన సినిమా లేదా సీరియల్‌ను వీక్షించే వీలుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 664 కోట్లు స్మార్ట్ ఫోన్లు అంటే.. 83.89 శాతం మంది వద్ద ఫోన్లు ఉన్నట్లు జోరాం అనే సంస్థ నివేదిక. 2026 నాటికి 130 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ కనెక్షన్ పొందనున్నట్లు మొబైల్ ట్రేడింగ్ సంస్థ జీఎస్ఎమ్ఏ అంచనా. లెక్కలేనన్ని చానల్స్ సినిమా, మ్యూజిక్, వెబ్‌సిరీస్, స్పోర్ట్స్ లాంటి అన్ని రకాల వినూత్న వినోద క్రీడా రంగాలకు సంబంధించి ఓటీటీ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని చానెల్స్‌లో చిన్న పిల్లలకు కూడా వినోదం అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 300కుపైగా ఓటీటీ చానెల్స్ ఉన్నాయి. అమెరికా జనాభా 75శాతం మంది రెండు లేదా ఆపైన ఓటీటీ చానల్స్ సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే అమెరికా జనాభాలో 30శాతం మంది సభ్యులు. కోవిడ్ పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. జర్మనీలోని బూట్సాస్ అనే మ్యూజిక్ నైట్ క్లబ్ ఏకంగా బాట్సాస్ లైవ్ అనే ఓటీటీ చానెల్ ప్రారంభించి సభ్యుల కోసం లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. పికాక్ అనే సంస్థ టోక్యో ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ చానెల్ ప్రారంభించి అన్ని రకాల క్రీడా పోటీలను లైవ్‌గా ప్రసారం చేసింది. ఎన్ని చానెల్స్ ఉన్నా ఓటీటీ రంగంలోకి తొలి అడుగు వేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ టాప్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కి నెలవారీ ఫీజు చెల్లించే 22.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియోకు 20.5 కోట్లు, స్పాటిఫైకి 18 కోట్లు , డిస్నీ ప్లస్‌కి 13 కోట్లు, హెచ్‌బీవో మ్యాక్స్‌కి 8.5 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అక్కడ ఫ్లాప్.. ఇక్కడ హిట్... పాత సినిమాలు, టీవీ సీరియల్స్ కొనుగోలు చేసి ప్రసారం చేయడం ద్వారా వ్యాపారం ప్రారంభించిన ఈ స్ట్రీమింగ్ చానల్స్ ఇప్పుడు సొంత సినిమాలు, సీరియల్స్ నిర్మిస్తు న్నాయి. టీవీలో ఫ్లాప్ అయిన సీరియల్స్ ఓటీటీలో బంపర్‌హిట్ అవుతున్నాయి. స్పానిష్ థ్రిల్లర్‘మనీహైస్ట్’ టీవీలో ఫ్లాప్ షోగా ముద్ర వేయించుకుని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ చానల్లో ప్రత్యక్షమై బ్రహ్మాండంగా హిట్టయ్యింది. నెట్‌ఫ్లిక్స్ 2020లో సొంత సినిమాలు, సీరియల్స్ కోసం 1,700 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ సంస్థ దగ్గర ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ కలిపి 6,000 టైటిల్స్ ఉన్నాయి. అందులో 40 శాతం సొంత ప్రొడక్షనే. డిస్నీ దగ్గర అయితే 2500 టీవీ సీరియల్స్‌కు సంబంధించిన 55,000 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత టామ్ హంక్స్, ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ కలసి రెండో ప్రపంచయుద్ధంపై హెచ్‌బీవో కోసం సిరీస్ నిర్మిస్తున్నారు. దీనికోసం బ్రిటన్‌లో ఇప్పటికే ఒక కృత్రిమ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. విలీనపర్వం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో పోటీ పడేందుకు వివిధ టీవీ, ఓటీటీ సంస్థలు విలీనబాట పడుతున్నాయి. మీడియా రంగంలో మెగా సంఘటనగా పేర్కొంటున్న అతి పెద్ద విలీనం ఈ ఏడాది చివరికి జరగబోతోంది. ఏటీ అండ్ టీ, హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ మీడియా, డిస్కవరీ, యానిమల్ప్లానెట్, టీఎల్సీ కలసి ఒకే గొడుగు కిందకి రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే హాలీవుడ్ మెగా సంస్థ ఎంజీఎంను కొనుగోలు చేసింది. బ్రిటన్‌లో బీబీసీ, ఐటీవీ, చానెల్ఫోర్ కలసి ‘బ్రిట్బాక్స్’ అనే స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీలో డిస్కవరీ, మరో మాస్ మీడియా సంస్థతో కలసి జోయిన్గా అవతరించాయి. స్పెయిన్‌లో అట్రెస్ మీడియా, మీడియా సెల్, ఆర్టీవీ కలసి లవ్స్ టీవీనీ ఏర్పాటు చేశాయి. నెట్‌ఫ్లిక్స్ వీడియో, గేమింగ్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు నైట్స్కూల్ స్టూడియోను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
ఐఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్..! ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి..!
ఐఫోన్ యూజర్లకు యాపిల్ గట్టి షాక్ ను ఇచ్చింది. ఎన్నో రోజులుగా వస్తోన్న సంప్రదాయానికి యాపిల్ స్వస్తి పలికింది. మూడు నెలలపాటు ఉచితంగా అందించే యాపిల్ మ్యూజిక్ సేవను పరిమితం చేసింది. కేవలం నెల రోజులే..! యాపిల్ తన కొత్త యూజర్లకు యాపిల్ మ్యూజిక్ సేవలను మూడు నెలల పాటు ఉచితంగా అందించేది. ఇకపై ఒక నెల రోజుల పాటు మాత్రమే ఉచితంగా మ్యూజిక్ సేవలను అందించనుంది. యాపిల్ మ్యూజిక్ సేవలకు నెలకొన్న ఆదరణ నేపథ్యంలో యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో అతి పెద్ద సర్వీస్...! స్పాటి ఫై తరువాత యాపిల్ మ్యూజిక్ ప్రపంచంలో అతి పెద్ద మ్యూజిక్ సర్వీస్ గా నిలుస్తోంది. ఇప్పటికే యాపిల్ మ్యూజిక్ సేవను ఎంతో మంది యూజర్స్ వాడుతున్నారు. దీంతో ఈ సేవలను పరిమితం చేస్తూ యాపిల్ నిర్ణయం తీసుకుంది. ఇక పలు యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుపై అందించే ఉచిత ఆరు నెలల ట్రయల్ వ్యవధిలో ఎలాంటి మార్పు ఉండదు. బీట్స్, ఎయిర్పాడ్లు, హోమ్‌పాడ్ మినీ వంటి ఉత్పత్తులపై యథాతథంగా ఉండనుంది. ఐతే ప్రస్తుతం మూడు నెలల ట్రయల్ మ్యూజిక్ సేవలను పొందుతున్న హోల్డర్లకు ఏమి జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు. -
ఆపిల్, స్పొటిఫైలకు సవాల్ విసురుతున్న అమెజాన్
వెబ్‌డెస్క్ : పొడ్కాస్ట్ రంగంలో తీవ్రమైన పోటీకి రంగం సిద్ధమవుతోంది, మార్కెట్ లీడర్లుగా ఉన్న ఆపిల్, స్పొటిఫైలకు అమెజాన్ నుంచి గట్టిపోటీ ఎదురుకాబోతుంది. రెండేళ్లుగా పొడ్‌కాస్ట్‌లో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న అమెజాన్ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది పొడ్‌కాస్ట్‌లో దూసుకుపోతున్న ఆర్ట్ 19 కొనుగోలుకు సిద్ధమైంది. అయితే డీల్ వివరాలు ఇంకా బయటకు వెల్లడి కాలేదు. ఫ్యూచర్లో పొడ్కాస్ట్ డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ రూపు రేఖలు మారిపోయాయి. గత ఐదేళ్లుగా వీడియో కంటెంట్ ఈ విభాగంలో రాజ్యమేలుతోంది. అయితే భవిష్యత్తులో ఆడియో కంటెంట్‌కి కూడా ఇదే స్థాయిలో డిమాండ్ ఏర్పడనుంది. ఇప్పటికే ఆపిల్ పొడ్‌కాస్ట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ఇటీవల ఆపిల్‌కి స్పొటిఫై నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. పొడ్‌కాస్ట్‌లో తనదైన మార్క్ చూపించేందుకు అమెజాన్ రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా 2020 సెప్టెంబరుల అమెజాన్ మ్యూజిక్ పేరుతో మార్కెట్లోకి వచ్చినా ఆశించిన ప్రభావం చూపలేకపోయింది. అంతకు ముందు వండరేనీ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆర్ట్ 19తో మరో ప్రయోగం చేయబోతుంది. మార్కెట్‌పై పట్టు కోసం వీడియో కంటెంట్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు దీటుగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వచ్చింది. అదే తరహాలో పొడ్కాస్ట్లోనూ మార్కెట్లో వాటా కోసం అమెజాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్ట్ 19ని టేకోవర్ పూర్తైన తర్వాత పొడ్కాస్ట్ కంటెంట్, మార్కెటింగ్‌లో అమెజాన్ మరింత దూకుడు ప్రదర్శించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి : Drone Delivery: డ్రోన్లతో లాజిస్టిక్స్ డెలివరీకి రెడీ -
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
-
ప్రముఖ వెబ్సైట్ల సర్వర్ డౌన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెడ్డిట్ , స్పాటిఫై , ట్విచ్, ఫైనాన్షియల్ టైమ్స్ , ది న్యూయార్క్ టైమ్స్, బ్లూమ్‌బెర్గ్ వంటి ప్రముఖ వెబ్సైట్లకు ఇంటర్నెట్ సమస్య తలెత్తింది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో ఈ సైట్ల సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక, సర్వర్ సమస్యల కారణంగానే ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ సీడిఎన్ సర్వీస్ ప్రొవైడర్ తన వెబ్సైట్లో తన సేవల విషయంలో సమస్య ఎదుర్కొన్నట్లు సంస్థ మంగళవారం సాయంత్రం 4:14 గంటలకు తన వెబ్సైట్లో రాసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ ఇంక్. తో సహ ఇతర ప్రముఖ హులు, కోరా, హెచ్బిఓ మాక్స్, ది గార్డియన్ వంటి వాటి సేవల విషయంలో అవాంతరం ఎదుర్కొన్నట్లు కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి. అయితే, ప్రస్తుత సమస్యకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక్కడ చదవండి: ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్ BGMI క్రాఫ్టన్‌కి వ్యతిరేకంగా కేంద్రానికి తెలంగాణ ఎంపీ లేఖ -
మ్యూజిక్ ప్రియుల కోసం సరికొత్త టెక్నాలజీ..!!
భారతదేశంలో మ్యూజిక్ ప్రియులు చాలా మంది ఉంటారు. కొందరు పనిచేసుకుంటూ పాటలు వింటే, మరికొందరు గేమ్స్ ఆడుతూ, ఇంకొందరూ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ పాటలు వినడం చాలామందికి అలవాటు. అందుకే మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసులకు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు మనకు నచ్చిన పాటలను ఒక ప్లేలిస్ట్ చేసుకొని వినడమే తప్ప. ప్రత్యేకంగా మన మూడ్‌ను బట్టి పాటలు ప్లే అయ్యే విధానం లేదు. కానీ తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై ఈ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ రైట్స్ పొందింది. ఈ కొత్త టెక్నాలజీ మీ ఎమోషన్ బట్టి వాయిస్ టోన్ ఆధారంగా అది పాటలను రికమెండ్ చేస్తుంది.(చదవండి: జియోపై ఎయిర్టెల్ పైచేయి) గ్లోబల్ ఆడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై ఈ పేటెంట్ కోసం మొట్టమొదట ఫిబ్రవరి 2018లో దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఈ నెలలో యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్(యుఎస్పిటిఓ) ఆ పేటెంట్‌కు ఆమోద ముద్ర వేసింది. ఈ పేటెంట్ ప్రకారం, యూజర్లు మీరు మాట్లాడే టోన్ బట్టి ఈ సరికొత్త టెక్నాలజీ మీకు పాటలను వినిపిస్తుంది. యూజర్ల మూడ్ ను గుర్తించి వారికి ఆహ్లాదకరంగా ఉండేందుకు వీలుగా స్పాటి ఫై కంపెనీ కి కొత్త టెక్నాలజీని తీసుకు వచ్చింది. -
మన సంగీత మార్కెట్లోకి మరో దిగ్గజం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయులకు సంగీతాన్ని ఆస్వాదించే సంస్కృతి అద్భుతంగా ఉండడంతో భారతీయ పాటల ప్రపంచంలోకి మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ‘స్పాటిఫై’ అడుగు పెట్టింది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ నగరం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ అంతర్జాతీయ సంస్థ భారత పాటల మార్కెట్లోకి ప్రవేశించాలనే సంకల్పంతో సరిగ్గా 11 నెలల క్రితం ముంబైలో తన భారతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయంలో మూడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇంతకుముందు ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ ‘ఓఎల్ఎక్స్’కు సీఈవోగా పనిచేసిన అమర్‌సింగ్ బాత్రాను తీసుకున్నారు. భారతీయ మార్కెట్లోకి తమ ఉత్పత్తిని లాంఛనంగా ప్రవేశపెడుతున్నట్లు స్పాటిఫై వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో డేనియల్ ఎక్ బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హిందీ, తెలుగు, తమిళ్, పంజాబీ భాషల్లో నాలుగు కోట్లకుపైగా భారతీయ పాటలు తమ వద్ద ఉన్నాయని, వాటిని ఏకంగా ‘త్రీ బిలియన్ ప్లే లిస్ట్స్’తో విడుదల చేస్తున్నామని చెప్పారు. భారతీయ వినియోగదారుడి నుంచి నెలకు 119 రూపాయల చందాకు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా తమ పాటలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇదే అమెరికా వినియోగదారుడి దగ్గరి నుంచి నెలకు 9.99 డాలర్లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి జనవరి చివరలోనే ‘స్పాటిఫై’ భారతీయ మార్కెట్లోకి రావల్సి ఉండింది. అమెరికాలోని ‘వార్నర్ మ్యూజిక్ గ్రూప్’కు చెందిన వార్నర్–ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ, స్పాటిఫై లెసెన్స్ ఒప్పందంపై ముంబై హైకోర్టుకు వెళ్లడంతో మార్కెట్లోకి రావడానికి ఆలస్యమైంది. హాలివుడ్ సింగర్స్ కేటి పెర్రీ, బెయాన్స్, కెండ్రిక్ లామర్, లెడ్ జెప్పెలిన్ కేటలాగ్‌ల విషయంలో రెండు కంపెనీల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయమై ఓ పక్క న్యాయ పోరాటం కొనసాగుతుండగానే ప్రపంచంలోని దాదాపు 80 దేశాల్లో 20 కోట్ల మంది వినియోగదారులకు ‘స్పాటిఫై’ తన పాటల సర్వీస్‌ను అందిస్తోంది. భారత్‌లోని అతిపెద్ద సంగీత బ్రాండ్ లేబుల్ కలిగిన టీ సీరీస్‌తో ఒప్పందం కుదుర్చుకొని 1,60,000 పాటల లైబ్రరీని సమకూర్చుకుంది. అయినప్పటికీ భారతీయ మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. 2017 లెక్కల ప్రకారం మొత్తం ఆసియాలో సంగీత మార్కెట్ రెవెన్యూ 38.2 శాతానికి విస్తరించగా ఒక్క భారత్‌లోనే 60.8 శాతానికి విస్తరించింది. భారత్‌లో ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులోకి రావడం, డేటా చార్జీలు బాగా తగ్గడం కూడా సంగీత మార్కెట్ విస్తరించడానికి దోహదపడ్డాయి. 2020 నాటికి భారత సంగీత ప్రపంచంలో రెవెన్యూ 27.30 కోట్ల డాలర్లకు చేరుకుంటుందన్నది ఓ అంచనా. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే అమెజాన్ కంపెనీ భారత సంగీత మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఏడాది సబ్స్క్రిప్షన్ కింద కేవలం 999 రూపాయలనే వసూలు చేస్తోంది. ఇంగ్లీషు, హిందీతోపాటు పలు భారత ప్రాంతీయ భషల్లో కొన్ని కోట్ల కాటలాగ్లను ‘అమెజాన్ మ్యూజిక్’ అందిస్తోంది. చైనా ఇంటర్నెట్ దిగ్గజం ‘టెన్సెంట్’ భారతీయ సంగీత మార్కెట్లోకి ‘గానా’ పేరుతో ప్రవేశించింది. ఏకంగా 7.50 కోట్ల మంది నెల ఛందాదారులతో మార్కెట్లో నెంబర్ వన్‌గా చెలామణి అవుతోంది. రిలయెన్స్, ఏర్టెల్, వొడావోన్ కంపెనీలు భారతీయ సంగీత మార్కెట్లోకి ఎప్పుడో అడుగుపెట్టాయి. రిలయెన్స్ కంపెనీకి చెందిన ‘జియో మ్యూజిక్’ను గతేడాది మార్చి నెలలో అంతర్జాతీయ కంపెనీ ‘సావ్న్’లో వంద కోట్ల డాలర్లకు విలీనం చేసింది. -
భారత మార్కెట్లోకి స్పాటిఫై
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవల దిగ్గజం స్పాటిఫై తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. దేశీయంగా జియోసావన్, అమెజాన్ మ్యూజిక్, గానా తదితర సంస్థలతో ఇది పోటీపడనుంది. తమ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా స్థానిక, అంతర్జాతీయ సంగీతాన్ని ఆస్వాదించవచ్చని స్పాటిఫై ఇండియా ఎండీ అమర్జీత్ సింగ్ బాత్రా చెప్పారు. యూజర్లు కావాలనుకుంటే నెలకు రూ. 59 చెల్లించి స్పాటిఫై ప్రీమియం సేవలకు అప్‌గ్రేడ్ కావొచ్చని వివరిం చారు. ఐఎంఐ, ఐఎఫ్‌పీఐ నివేదిక ప్రకారం దేశీయంగా ఆడియో స్ట్రీమింగ్ వ్యాపార విభాగంలో సబ్స్క్రిప్షన్ ఆధారిత ఆదాయం 2017తో పోలిస్తే ప్రస్తుతం మూడింతలై రూ. 220 కోట్లకు చేరినట్లు బాత్రా పేర్కొన్నారు. స్పాటిఫైలో 4 కోట్ల పైగా భారతీయ, అంతర్జాతీయ పాటలు అందుబాటులో ఉన్నాయి. యూజర్లకు బాలీవుడ్ సహా ప్రాంతీయ పాటలు, సంగీతాన్ని అందించేందుకు జనవరిలో టి–సిరీస్ తో స్పాటిఫై ఒప్పందం కుదుర్చుకుంది. స్పాటిఫై ప్రస్తుతం 79 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
ఒబామాకు ఓ స్పెషల్ జాబ్ ఆఫర్!
మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎనిమిదేళ్ల పదవీకాలం ముగియబోతున్నది. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేకుండా.. ఓ స్పెషల్ జాబ్ ఆఫర్ వచ్చింది. ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ స్పోటిఫై కేవలం ఒబామా కోసమే ఒక ప్రత్యేక ఉద్యోగ ప్రకటన చేసింది. 'ప్రెసిడెంట్ ఆఫ్ ప్లేలిస్ట్' పేరిట ప్రకటించిన ఈ ఉద్యోగం కోసం కనీసం ఎనిమిదేళ్లు అత్యున్నతమైన దేశానికి అధ్యక్షుడిగా ఉండాలి అని షరతు పెట్టింది. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు కొనసాగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సదరు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి నోబెల్ శాంతిగ్రహీత అయి ఉండాలని పేర్కొంది. ఒబామాకు 2009లో ఈ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. కళాకారులు, సంగీతకారులతో విస్తృత సంబంధాలు ఉండాలి. అలాగే మీ పుట్టినరోజు వేడుకకు కెండ్రిక్ లామర్ సంగీత ప్రదర్శన ఇప్పించి ఉంటే మరీ మంచిది. అంతేకాదు ప్రెస్ మీట్లలో ఇష్టంగా మాట్లాడాలి. అన్ని వేళల్లో గొప్ప వక్తగా ఉండాలి' అంటూ అర్హతల చిట్టా విప్పింది. ఈ అర్హతలన్నీ ఒబామాకు ఉన్న సంగతి తెలిసిందే. ఒబామా గతంలో స్పోటిఫైలో కొన్ని మ్యూజిక్ ప్లేలిస్ట్ లు రూపొందించారు. ఇవి బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత తనకు తప్పకుండా స్పోటిఫై నుంచి జాబ్ ఆఫర్ వస్తుందని ఒబామా ఇటీవల ఛలోక్తులు విసిరారు. అన్నట్టుగానే ఆయన కోసమే ఈ ఉద్యోగ ప్రకటనను స్పోటిఫై సీఈవో డానియెల్ ఎక్ సోమవారం ట్వీట్ చేశారు.