ఆ అందగత్తెది ఓ విచిత్రగాథ!
మెల్ బోర్న్: ప్రపంచ సుందరి కిరీటం ధరించాలని ఆశపడ్డ ఆస్ట్రేలియా అందం ఇజ్జి రామ్సే. ప్రపంచంలో ఎందరో సుందరీమణులున్నా.. ఆ అందగత్తెలలో ఈమెది మాత్రం ఓ విచిత్రగాథ. ఏం పని చేయాలన్నా తనకు చాలా భయమని చెప్పింది. ఆ భయం మామూలు భయం కాదు.. హైస్కూలు చదువు పూర్తిచేయకుండా మధ్యలోనే వదిలేసిందట. తనకు ఈ ఫోబియా ఎప్పటినుంచి అంటుకుందన్న వివరాలను స్థానిక మీడియాతో పంచుకుంది. ప్రతిరోజూ ఐదు దాడులకు గురవుతున్నట్లు అనిపిస్తుందని, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియా తరఫున మిస్ వరల్డ్ పోటీలకు హాజరుకాబోతున్న యంగెస్ట్ ఉమెన్ ఇజ్జి. ప్రస్తుతం బ్లాక్ డాగ్ ఇనిస్టిస్ట్యూట్ సహయాంతో సిడ్నీ హార్వర్ బ్రిడ్జి దాటే హాఫ్ మారథాన్ కు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. 12 ఏళ్లు ఉన్నప్పుడు 5 భయంకర సంఘటనలు జరిగాయని అప్పటినుంచీ ఈ భయాలు తనను వెంటాడుతన్నాయంది. చాలా సార్లు తాను చనిపోతానేమోనన్న స్థాయిలో భయమేస్తుందని చెప్పింది. గతేడాది జూన్ లో ఏడుగురు పోటీపడ్డ కాంపిటీషన్లో విజేతగా నిలిచి ఆస్ట్రేలియా తరఫున మిస్ వరల్డ్ పోటీలకు ఎంపికైన విషయాన్ని వెల్లడించింది. మానసిక నిపుణులు, కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో భయాన్ని కాస్త పోగొట్టుకున్నానని, త్వరలో సాధారణ స్థితికి వస్తానని ధీమా వ్యక్తంచేసింది.