'ఆగస్టు 7 నాటికి శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి'
విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. అందుకోసం గురువారం పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆగస్టు 7వ తేదీ నాటికి ఈ నమూనా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని శ్రీనివాసరాజు స్పష్టం చేశారు.