Jackson
-
Daniel Jackson: పద్నాలుగేళ్ల వయసులోనే దేశాధ్యక్షుడు
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు డేనియల్ జాక్సన్. ప్రస్తుతం ఇతడి వయసు పంతొమ్మిదేళ్లు. ఆస్ట్రేలియాలో పుట్టి, బ్రిటన్‌లో పెరిగిన డేనియల్ తన పద్నాలుగేళ్ల వయసులోనే ఒక దేశానికి అధ్యక్షుడయ్యాడు. అదెలా అని అవాక్కవుతున్నారా? ప్రస్తుతం ఉనికిలో ఉన్న దేశాలకు అధ్యక్షుడు కావడం సాధ్యం కాదని తెలిసిన ఈ బాల మేధావి ఏకంగా తనదైన సొంత దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఐదేళ్ల కిందట తన ఆరుగురు మిత్రులతో కలసి సెర్బియా–క్రొయేషియాల మధ్య డాన్యూబ్ నది మధ్యలో ఆ రెండు దేశాలకూ చెందని ఖాళీ భూభాగాన్ని గుర్తించి, లేతనీలం, తెలుపు చారలతో సొంత జెండాను తయారు చేసుకుని, అక్కడ తన జెండా నాటేశాడు. జెండా నాటడానికి ముందే చాలా పరిశోధన సాగించి, ఈ భూభాగం చారిత్రకంగా ఎవరికీ చెందనిదని తేల్చుకున్నాడు. ఈ దేశానికి ‘వెర్డిస్’గా నామకరణం చేసి, దానికి తనను తానే అధినేతగా ప్రకటించుకున్నాడు. దీని విస్తీర్ణం 0.2 చదరపు మైళ్లు–అంటే 128 ఎకరాలు మాత్రమే! ఈ లెక్కన వాటికన్ నగరం తర్వాత రెండో అతిచిన్న దేశం ఇదే! ప్రస్తుతం నాలుగువందల మంది ఉంటున్న ఈ చిరుదేశంలో పౌరసత్వం కోసం ఇప్పటికే దాదాపు పదిహేనువేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇవి చదవండి: మెదడును 10 శాతమే ఉపయోగించుకుంటున్నామా? ఈ చిరుదేశాధినేత డేనియల్ ఉక్రెయిన్ యుద్ధ బాధితుల కోసం తన దేశం తరఫున అధికారికంగా విరాళం పంపడం విశేషం. పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేయాలనుకుంటున్నామని, దేశాన్ని పౌరులతో కళకళలాడేలా తీర్చిదిద్దాలనేదే తన కోరిక అని డేనియల్ చెబుతున్నాడు. అయితే, పొరుగునే ఉన్న క్రొయేషియాతో ఈ చిరుదేశానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్రొయేషియా భూభాగంలో పొరపాటున అడుగుపెట్టిన వెర్డిస్ పౌరులను క్రొయేషియన్ పోలీసులు బందీలుగా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా, గత అక్టోబర్ 12న వెర్డిస్ భూభాగాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న తమనందరినీ నిర్బంధంలోకి తీసుకుని, ఆ తర్వాత తమ భూభాగంలో విడిచిపెట్టారని, క్రొయేషియా చర్య అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని, దీనిపై తాము అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగిస్తామని డేనియల్ చెప్పాడు. రానున్న ఐదేళ్లలో తమ దేశాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని అన్నాడు. బయటి నుంచి తమ దేశానికి చేరుకోవాలంటే, క్రొయేషియా భూభాగాన్ని దాటాల్సి ఉంటుందని, అందువల్లనే క్రొయేషియాతో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయని తెలిపాడు. View this post on Instagram A post shared by Daniel Jackson (Данијел Џексон) (@danieljacksonvs) -
సౌరాష్ట్ర సాధించెన్
లక్నో: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర అద్భుతం చేసింది. ఉత్తరప్రదేశ్‌తో ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏకంగా 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్ చేరింది. తద్వారా 2008–09 సీజన్లో సర్వీసెస్‌పై అసోం నెలకొల్పిన అత్యధిక పరుగుల ఛేదన రికార్డు (371 పరుగులు)ను బద్దలు కొట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు వెనుకబడినా... రెండో ఇన్నింగ్స్‌లో తేరుకుని సెమీస్ గడపతొక్కింది. లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 195/2తో శనివారం చివరి రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్రను ఓపెనర్ హార్విక్ దేశాయ్ (259 బంతుల్లో 116; 16 ఫోర్లు) కెరీర్లో తొలి శతకంతో ముందుకు నడిపించాడు. అయితే, అతడితో పాటు మక్వానా (7) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (110 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (109 బంతుల్లో 73 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సంయమనం చూపారు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న వీరు ఐదో వికెట్‌కు అజేయంగా 136 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించింది. కనీసం ‘డ్రా’ చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన ఉత్తరప్రదేశ్ ఉసూరుమంటూ వెనుదిరిగింది. విదర్భ మరోసారి... సొంతగడ్డ నాగ్‌పూర్‌లో ముగిసిన మరో క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ ఇన్నింగ్స్ 115 పరుగులతో ఉత్తరాఖండ్‌పై గెలుపొంది సెమీస్ చేరింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (274 పరుగులు)తో విదర్భ సెమీస్ బెర్త్ ముందే ఖాయమైంది. నామమాత్రమైన రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 152/5తో శనివారం ఆట కొనసాగించిన ఉత్తరాఖండ్... టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ (5/23), ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆదిత్య సర్వాతె (5/55) ధాటికి ఏడు పరుగులకే మిగతా ఐదు వికెట్లూ కోల్పోయి 159 పరుగులకే ఆలౌటైంది. ఈనెల 24న మొదలయ్యే సెమీఫైనల్స్‌లో కేరళతో విదర్భ; కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడతాయి. -
సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
♦ జోగియాని, జాక్సన్ సెంచరీలు ♦ విదర్భతో ‘రంజీ’ క్వార్టర్ ఫైనల్ సాక్షి, విజయనగరం: సాగర్ జోగియాని (130; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), షెల్డన్ జాక్సన్ (122; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో... విదర్భతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 112.4 ఓవర్లలో 375 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు 224 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఉమేశ్ 5, ఆదిత్య 4 వికెట్లు తీశారు.తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ప్రస్తుతం విదర్భ 207 పరుగులు వెనుకబడి ఉంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు అస్సాం తొలి ఇన్నింగ్స్: 323 ఆలౌట్ (సయ్యద్ మొహమ్మద్ 121, సిద్ధార్థ్ కౌల్ 4/99); పంజాబ్ తొలి ఇన్నింగ్స్: 137 ఆలౌట్ (మయాంక్ 80 నాటౌట్, కృష్ణ దాస్ 3/54, అరూప్ దాస్ 3/41); అస్సాం రెండో ఇన్నింగ్స్: 23/4. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 348 ఆలౌట్ (దేవేంద్ర బుండేలా 58, హర్‌ప్రీత్ 51, ప్రతాప్ సింగ్ 5/76); బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 121 ఆలౌట్ (ఈశ్వరన్ 48, ఈశ్వర్ పాండే 4/45, పునీత్ 3/30); మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 14/0. ముంబై తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ (అభిషేక్ నాయర్ 74, ఇక్బాల్ అబ్దుల్లా 33, సుఫియాన్ 23, నదీమ్ 5/140); జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 150/8 (ఆనంద్ 39, కౌశల్ సింగ్ 22 నాటౌట్, గౌతమ్ 18, హర్‌వాడేకర్ 3/26, ఇక్బాల్ అబ్దుల్లా 3/39). -
తను ఇంకా అక్కడే ఉందా?!
‘‘ఏమయ్యా.. ఎక్కడివక్కడే పడేసి పోతారేంటి? రోజూ చెప్పాలా మీకు?’’యజమాని అలా అడిగేసరికి బిత్తరపోయారు పనివాళ్లు. జాక్సన్ ముఖం ఎర్రబారింది. గ్యాప్ లేకుండా తిడు తున్నాడు. మధ్యలో మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. కానీ చివరికి ఒకతను ధైర్యం చేసి నోరు తెరిచాడు. ‘‘లేదు సర్... మేం పనంతా పూర్తి చేసే వెళ్తున్నాం. కావాలంటే చూడండి.’’చుట్టూ చూశాడు జాక్సన్. అన్ని సామాన్లూ చక్కగా సర్ది ఉన్నాయి. ‘‘ఇవాళ సర్ది ఉంటారు. కానీ రోజూ వదిలేసి పోతున్నారు. పొద్దున్నే వచ్చి నేను సర్దుకోవాల్సి వస్తోంది’’ అన్నాడు విసుగ్గా. ఈయనెప్పుడూ ఇంతే అనుకుంటూ వెళ్లిపోయారు పనివాళ్లు. ఓ మూలన కుర్చీలో కూర్చుని ప్లాన్ చేతిలోకి తీసు కున్నాడు జాక్సన్. చాలా ఇష్టంగా కట్టిస్తున్నాడు ఆ లైబ్రరీని. అందుకే ప్రతి పనినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఫ్లాస్క్‌లో ఉన్న కాఫీని కప్పులో పోసుకుని, సిప్ చేస్తూ ప్లాన్‌ని పరిశీలించు కుంటున్నాడు జాక్సన్. అంతలో పక్కనే సామాన్లు కింద పడిన శబ్దం విని పించింది. చప్పున తల తిప్పి చూశాడు. ఎవరూ లేరు. సామాన్లు మాత్రం కింద పడి ఉన్నాయి. జారి పడ్డాయేమో అను కుంటూ వెళ్లి తీసి బల్ల మీద పెట్టాడు. తిరిగి వెళ్లి కూర్చునేలోపే మళ్లీ సామాన్లు కిందపడ్డాయి. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు జాక్సన్. అంతే... తల తిరిగిపోయింది. ఎక్కడి వస్తువులు అక్కడ ఉండటం లేదు. అన్నీ అటూ ఇటూ కదిలిపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు పడిపోతున్నాయి. నమ్మలేనట్టుగా చూస్తున్నాడు జాక్సన్. ఏం జరుగుతోందో అర్థం కాలేదతనికి. అలా కొన్ని క్షణాలపాటు జరిగాక మంత్రం వేసినట్టుగా మళ్లీ ఎక్కడివక్కడ ఆగిపో యాయి. అప్పటికి కూడా అతడు తేరుకో లేదు. ఏదో జరుగుతోంది. పనివాళ్లు చెప్పినదంతా నిజమేనేమో. వాళ్లు రోజూ అన్నీ సర్దిపెట్టి వెళ్లిపోతున్నారు. కానీ అవి తర్వాత కదిలిపోతున్నాయి. అంటే ఇక్కడ ఏదో శక్తి ఉంది. అది దుష్టశక్తా? ఏదైనా మంచి శక్తా? తన పని అవ్వాలంటే ముందు అదేంటో తెలుసుకోవాలి. అనుకున్నదే తడవుగా తాను లైబ్రరీగా మారుస్తోన్న ఆ బిల్డింగ్ గురించి పరిశోధిం చడం మొదలు పెట్టాడు జాక్సన్. ఆ ప్రయత్నంలో అతనికి చాలా విషయాలు తెలిశాయి. ఆ బిల్డింగ్ సోఫియా ఎబర్లీన్దని తెలియగానే అర్థమైపోయింది జాక్సన్‌కి... ఆ శక్తి ఏమిటో. అవన్నీ చేస్తున్నది... సాక్షాత్తూ సోఫియా ఆత్మే! 1989లో రష్యాలో జన్మించింది సోఫియా. తర్వాత ఆమె కుటుంబం అమెరికాకు వచ్చి సెటి లయ్యింది. ఆ దేశానికే చెందిన వ్యాపారి హ్యూగో ఎబర్లీన్తో సోఫియాకు వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత హ్యూగో మరణించాడు. తర్వాత జాకబ్ బెంజ్‌ను పెళ్లాడింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో, 1931లో రోడ్డు ప్రమాదంలో మరణించింది సోఫియా. అది నూటికి నూరు శాతం యాక్సిడెంట్ లాగే అనిపించడంతో అందరూ లైట్ తీసు కున్నారు. కానీ సోఫియా బెడ్ రూమ్‌లో రక్తపు మరకలు కనిపించడంతో కూతురు లిలియన్కి అనుమానం వచ్చి, పోలీ సులకు చెప్పింది. విచారణలో సోఫియాది హత్య అని తేలింది. భార్యను ఇంట్లోనే చంపేసి, ఆమె దేహాన్ని కారులో ఉంచి, యాక్సిడెంటులాగా క్రియేట్ చేశాడు బెంజ్. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఆపై జైల్లోనే గుండె ఆగి మరణించాడు.తమ తల్లి మరణించిన ఇంటిని సోఫియా కూతుళ్లు అమ్మేశారు. దాన్ని కొనుక్కున్న జాక్సన్, ఓ అందమైన లైబ్రరీగా మార్చాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతడికి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఏంటా అని పరిశోధిస్తే సోఫియా ఆత్మ అక్కడ తిరుగాడుతోందని అర్థమైంది జాక్సన్‌కి. అయినా ప్రయత్నం మానుకోలేదు. తన పనిని పూర్తి చేశాడు. నార్త్ డకోటాలోని హార్వేలో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ లైబ్రరీ అదే. అయితే ఇప్పటికీ అక్కడ సోఫియా ఆత్మ ఉందా లేదా అన్నదే ప్రశ్న. అక్కడ ఎదు రయ్యే కొన్ని వింత సంఘ టనల వల్ల అక్కడే ఉందని కొందరు, ఎప్పుడూ తమకు కనబడకపోవడం వల్ల లేదని కొందరు వాదిస్తున్నారు. ఏది నిజమో మనకు తెలియదు. మీకు తెలుసుకోవాలనుంటే ఓసారి వెళ్లి చూస్తే సరి! నేటికీ హార్వే లైబ్రరీలో విచిత్ర సంఘటనలు జరుగుతాయట. పుస్తకాలు ర్యాక్స్ లోంచి పడిపోతా యట. ఫర్నిచర్ అటూ ఇటూ జరిగి పోతుం దట. తెల్లని నీడ అటూ ఇటూ కదులుతూ కని పిస్తుందని కూడా కొందరంటారు. అంటే సోఫియా ఆత్మ ఇంకా అక్కడే ఉందా?