తను ఇంకా అక్కడే ఉందా?! | short sotry | Sakshi
Sakshi News home page

తను ఇంకా అక్కడే ఉందా?!

Published Sun, Jan 31 2016 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

తను ఇంకా అక్కడే ఉందా?!

తను ఇంకా అక్కడే ఉందా?!

‘‘ఏమయ్యా.. ఎక్కడివక్కడే పడేసి పోతారేంటి? రోజూ చెప్పాలా మీకు?’’యజమాని అలా అడిగేసరికి  బిత్తరపోయారు పనివాళ్లు. జాక్సన్ ముఖం ఎర్రబారింది. గ్యాప్ లేకుండా తిడు తున్నాడు. మధ్యలో మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. కానీ చివరికి ఒకతను ధైర్యం చేసి నోరు తెరిచాడు. ‘‘లేదు సర్... మేం పనంతా పూర్తి చేసే వెళ్తున్నాం. కావాలంటే చూడండి.’’చుట్టూ చూశాడు జాక్సన్. అన్ని సామాన్లూ చక్కగా సర్ది ఉన్నాయి. ‘‘ఇవాళ సర్ది ఉంటారు. కానీ రోజూ వదిలేసి పోతున్నారు. పొద్దున్నే వచ్చి నేను సర్దుకోవాల్సి వస్తోంది’’ అన్నాడు విసుగ్గా. ఈయనెప్పుడూ ఇంతే అనుకుంటూ వెళ్లిపోయారు పనివాళ్లు. ఓ మూలన కుర్చీలో కూర్చుని ప్లాన్ చేతిలోకి తీసు కున్నాడు జాక్సన్. చాలా ఇష్టంగా కట్టిస్తున్నాడు ఆ లైబ్రరీని. అందుకే ప్రతి పనినీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.

ఫ్లాస్క్‌లో ఉన్న కాఫీని కప్పులో పోసుకుని, సిప్ చేస్తూ ప్లాన్‌ని పరిశీలించు కుంటున్నాడు జాక్సన్. అంతలో పక్కనే సామాన్లు కింద పడిన శబ్దం విని పించింది. చప్పున తల తిప్పి చూశాడు. ఎవరూ లేరు. సామాన్లు మాత్రం కింద పడి ఉన్నాయి. జారి పడ్డాయేమో అను కుంటూ వెళ్లి తీసి బల్ల మీద పెట్టాడు. తిరిగి వెళ్లి కూర్చునేలోపే మళ్లీ సామాన్లు కిందపడ్డాయి. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు జాక్సన్. అంతే... తల తిరిగిపోయింది. ఎక్కడి వస్తువులు అక్కడ ఉండటం లేదు. అన్నీ అటూ ఇటూ కదిలిపోతున్నాయి. ఇష్టం వచ్చినట్టు పడిపోతున్నాయి.

నమ్మలేనట్టుగా చూస్తున్నాడు జాక్సన్. ఏం జరుగుతోందో అర్థం కాలేదతనికి. అలా కొన్ని క్షణాలపాటు జరిగాక మంత్రం వేసినట్టుగా మళ్లీ ఎక్కడివక్కడ ఆగిపో యాయి. అప్పటికి కూడా అతడు తేరుకో లేదు. ఏదో జరుగుతోంది. పనివాళ్లు చెప్పినదంతా నిజమేనేమో. వాళ్లు రోజూ అన్నీ సర్దిపెట్టి వెళ్లిపోతున్నారు. కానీ అవి తర్వాత కదిలిపోతున్నాయి. అంటే ఇక్కడ ఏదో శక్తి ఉంది. అది దుష్టశక్తా? ఏదైనా మంచి శక్తా? తన పని అవ్వాలంటే ముందు అదేంటో తెలుసుకోవాలి.
అనుకున్నదే తడవుగా తాను లైబ్రరీగా మారుస్తోన్న ఆ బిల్డింగ్ గురించి పరిశోధిం చడం మొదలు పెట్టాడు జాక్సన్. ఆ ప్రయత్నంలో అతనికి చాలా విషయాలు తెలిశాయి. ఆ బిల్డింగ్ సోఫియా ఎబర్‌లీన్‌దని తెలియగానే అర్థమైపోయింది జాక్సన్‌కి... ఆ శక్తి ఏమిటో. అవన్నీ చేస్తున్నది... సాక్షాత్తూ సోఫియా ఆత్మే!

1989లో రష్యాలో జన్మించింది సోఫియా. తర్వాత ఆమె కుటుంబం అమెరికాకు వచ్చి సెటి లయ్యింది. ఆ దేశానికే చెందిన వ్యాపారి హ్యూగో ఎబర్‌లీన్‌తో సోఫియాకు వివాహం జరిగింది. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత హ్యూగో మరణించాడు. తర్వాత జాకబ్ బెంజ్‌ను పెళ్లాడింది. అంతా బాగుంది అనుకున్న సమయంలో, 1931లో రోడ్డు ప్రమాదంలో మరణించింది సోఫియా. అది నూటికి నూరు శాతం యాక్సిడెంట్ లాగే అనిపించడంతో అందరూ లైట్ తీసు కున్నారు. కానీ సోఫియా బెడ్ రూమ్‌లో రక్తపు మరకలు కనిపించడంతో కూతురు లిలియన్‌కి అనుమానం వచ్చి, పోలీ సులకు చెప్పింది. విచారణలో సోఫియాది హత్య అని తేలింది. భార్యను ఇంట్లోనే చంపేసి, ఆమె దేహాన్ని కారులో ఉంచి, యాక్సిడెంటులాగా క్రియేట్ చేశాడు బెంజ్. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఆపై జైల్లోనే గుండె  ఆగి మరణించాడు.తమ తల్లి మరణించిన ఇంటిని సోఫియా కూతుళ్లు అమ్మేశారు.

దాన్ని కొనుక్కున్న జాక్సన్, ఓ అందమైన లైబ్రరీగా మార్చాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో అతడికి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఏంటా అని పరిశోధిస్తే సోఫియా ఆత్మ అక్కడ తిరుగాడుతోందని అర్థమైంది జాక్సన్‌కి. అయినా ప్రయత్నం మానుకోలేదు. తన పనిని పూర్తి చేశాడు. నార్త్ డకోటాలోని హార్వేలో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ లైబ్రరీ అదే. అయితే ఇప్పటికీ అక్కడ సోఫియా ఆత్మ ఉందా లేదా అన్నదే ప్రశ్న. అక్కడ ఎదు రయ్యే కొన్ని వింత సంఘ టనల వల్ల అక్కడే ఉందని కొందరు, ఎప్పుడూ తమకు కనబడకపోవడం వల్ల లేదని కొందరు వాదిస్తున్నారు. ఏది నిజమో మనకు తెలియదు. మీకు తెలుసుకోవాలనుంటే ఓసారి వెళ్లి చూస్తే సరి!
 
నేటికీ హార్వే లైబ్రరీలో విచిత్ర సంఘటనలు జరుగుతాయట. పుస్తకాలు ర్యాక్స్ లోంచి పడిపోతా యట. ఫర్నిచర్ అటూ ఇటూ జరిగి పోతుం దట. తెల్లని నీడ అటూ ఇటూ కదులుతూ కని పిస్తుందని కూడా కొందరంటారు. అంటే సోఫియా ఆత్మ ఇంకా అక్కడే ఉందా?
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement