Jadav
-
Dipraj Jadhav: సరదాగా చేసిన ఒక వీడియో స్థాయినే మార్చేసింది..
‘అనుకోలేదని ఆగవు కొన్ని’ అంటాడు కవి. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కావాలని దిప్రజ్ జాదవ్ ఎప్పుడూ అనుకోలేదు. డిజిటల్ కంటెంట్ క్రియేషన్ అంటే ఏమిటో కూడా తెలియదు. సరదాగా చేసిన ఒక వీడియో అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది... ఒక వైరల్ వీడియోతో మహారాష్ట్రలోని షిర్పూర్ అనే చిన్న పట్టణానికి చెందిన దిప్రజ్ జాదవ్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. మరాఠీ సినిమా ‘లై బారి’లోని ఒక డైలాగ్ మీమ్ మాషప్ చేశాడు జాదవ్. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ దృష్టిని కూడా ఆ వీడియో ఆకట్టుకుంది. వైరల్ అయింది. ‘ఫేస్బుక్లో నేను పేజీ స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ క్రియేషన్ అనేది పెద్ద విషయం కాదు. దానికి అంత ్ర΄ాముఖ్యత కూడా లేదు. అలాంటి సమయంలోనే కొత్త కొత్త వీడియోలు చేసేవాడిని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు దిప్రజ్ జాదవ్. జాదవ్‌కు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందులోని ΄ాపులర్ సీన్లకు తనదైన స్టైల్ జోడించి అనుకరించే వాడు. పుణెలో యానిమేషన్ కోర్సు చేస్తున్నప్పుడు వీడియో ఎడిటింగ్‌పై ఇష్టం పెరిగింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పర్ఫెక్ట్గా మిక్స్ చేయడంలో గట్టి పట్టు సం΄ాదించాడు. ఆ విద్య అతడికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో ఎంతోమంది ఫాలోవర్స్‌ను తెచ్చి పెట్టింది. సెకండ్ టర్నింగ్ ΄ాయింట్ విషయానికి వస్తే,.,.. రామానంద్‌సాగర్ ‘రామాయణం’లోని రాముడు, రావణుడికి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన వీడియోకు ర్యాపర్ డివైన్ ΄ాడిన ‘సీన్ క్యా హై’ ΄ాటను జోడించాడు. ఇది చూసి మ్యూజిక్ ్ర΄÷డ్యూసర్ న్యూక్లియ(ఉద్యాన్ సాగర్) జాదవ్‌ను సంప్రదించి సబ్ సినిమా సిరీస్‌లో భాగంగా ఇలాంటి ఫిల్మీ మాషప్స్ మరిన్ని కావాలని, వాటిని మ్యూజిక్ ్ర΄ోగ్రాంలలో ఉపయోగించుకుంటానని చె΄్పాడు. జాదవ్ క్రియేటివిటీకి న్యూక్లియ బాగా ఇంప్రెస్ అయ్యాడు. ‘ఊహకు అందనిది ఆలోచించే సామర్థ్యమే అరుదైన సృజనాత్మకత. ఇలాంటి అరుదైన సృజనకారులలో జాదవ్ ఒకరు. రెండు పరస్పర విరుద్ధ అంశాలను మిళితం చేసి అందరినీ ఆకట్టుకుంటాడు’ అంటాడు న్యూక్లియ. చిత్రపరిశ్రమలో పనిచేయాలనేది జాదవ్ కోరిక. బాలీవుడ్‌లోని కొన్ని సినిమాలు, బాట్లా హౌజ్, రాకెట్ బాయ్స్లాంటి వెబ్‌సిరీస్‌లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ‘నేను చేస్తున్న పని గురించి నా తల్లిదండ్రులకు అవగాహన లేదు. ఏదైన స్థిరమైన ఉద్యోగం చేయాలని కోరుకునేవారు. అయితే నాకు వచ్చిన గుర్తింపు చూసిన తరువాత వారి ఆలోచన మారింది. నాపై నమ్మకం పెరిగింది’ అంటాడు దిప్రజ్ జాదవ్. 28 సంవత్సరాల జాదవ్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–2024’ జాబితాలో చోటు సాధించాడు. కొత్త ద్వారాలు ‘పదిమందిలో ఒకరు’ అని కాకుండా పదిమందికి భిన్నంగా ఆలోచించినప్పుడే మంచి ఫలితం సాధించగలం. ఒక టాపిక్ గురించి మనకు ఇష్టం ఏర్పడినప్పుడు దానికి సంబంధించి అన్ని కోణాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఆ టాపిక్‌పై పట్టు వస్తుంది. కొత్తగా ఆలోచించడానికి ద్వారాలు తెరుచుకుంటాయి. – దిప్రజ్ యాదవ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్ దిప్రజ్ జాదవ్ -
కన్నవారికి కడుపు కోత మిగిల్చి.. భరోసానిచ్చేనా?
మెదక్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి జాదవ్బబ్లూ అంత్యక్రియలు మండలంలోని నాగపూర్‌లో బుధవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. అతను ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. అతడి పార్థీవదేహం సొంతూరకు మధ్యాహ్నానికి చేరుకుంది. అప్పటికే వేచియున్న కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. మాజీ ఎంపీ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడే సురేశ్ షెట్కార్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మృతుడి తండ్రి సంతోష్నాయక్తోపాటు కుటుంబీకులను ఓదార్చారు. రూ.5వేల నగదు ఆర్థిక సాయం అందజేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి కూడా సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. రెండు నెలలు కాకుండానే.. ట్రిపుల్‌ఐటీలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అప్పట్లో స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని, మెయిల్ పద్ధతిలో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అధికారులు ప్రకటించారు. జూన్‌లో 48 గంటల వ్యవధిలో విద్యార్థినులు వడ్ల దీపిక, బూర లిఖిత ఆత్మహత్య చేసుకున్న ఘటనలతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. కానీ.. ఆ ఘటనలు జరిగి రెండు నెలలు కాకుండానే పీయూసీ–1 విద్యార్థి జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితాలపై సమీక్ష చేయడంలేదనే విమర్శలున్నాయి. తాజాగా బుధవారం మరోసారి ఇదే విషయమై వీసీ వెంకటరమణ కొత్త నిబంధనలు తెరపైకితెచ్చారు. ఇప్పటికై నా నిబంధనలు అమలు చేసి విద్యార్థుల్లో భరోసా నింపాల్సిన అవసరముందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులు... జాదవ్ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో బుధవారం కూడా క్యాంపస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్, వీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరాం తదితరులు కళాశాలలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా, వీరిని ప్రధాన గేటు వద్ద భద్రత సిబ్బంది, పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు నిర్మల్ ఆస్పత్రి వద్ద బబ్లూ మృతదేహాన్ని తరలించేదాకా ఎవరినీ అనుమతించలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామారావుపటేల్, బోస్లే మోహన్‌రావుపటేల్, ఎన్ఆర్ఐ బాజీరావుబోస్లేతోపాటు పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిర్మల్ ఆస్పత్రి నుంచి బబ్లూ మృతదేహాన్ని తీసుకువెళ్లిన బంధువులు స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం నాగాపూర్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బబ్లూ మృతికి వీసీ వెంకటరమణ, సిబ్బంది కళాశాలలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా బబ్లూ కుటుంబానికి వీసీ వెంకటరమణ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇకనుంచి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు చెప్పుకోలేని విషయాలను తెలుసుకునేందుకు కొత్తగా ముగ్గురు కౌన్సిలర్లను నియమిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోసం పది రోజుల్లో ప్రధాన ద్వారం వద్ద ఒక పేరెంట్స్ లాంజ్ ఏర్పాటు చేస్తామన్నారు. బాసర మండలం నుంచి ఎంపికై న 15మంది విద్యార్థులతో కలిసి ‘వీసీ మై విలేజ్’ ప్రోగ్రాంను నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లలో ‘సలహా’ బాక్స్‌లు ఏర్పాటుచేసి 15రోజులకోసారి తెరిచి అందులో విద్యార్థులు లేఖల ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు బెదిరింపులకు గురైతే మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలిపినా రక్షణ కల్పిస్తామని తెలిపారు. -
అమెరికా పాఠ్యపుస్తకాల్లో జాదవ్ జీవిత చరిత్ర
అమెరికా స్కూళ్లలో ఇప్పుడు ఓ అరణ్య పురుషుడి పేరు అక్కడి పిల్లల లేత మెదళ్లలో వేళ్లూనుకుంటోంది. అతడి పేరు జాదవ్ పయేంగ్. ఫారెస్ట్ మ్యాన్‌గా ఖ్యాతి గడించిన పయేంగ్ జీవిత చరిత్రను యుఎస్ లోని, కనెక్టికట్ రాష్ట్రంలో ఉన్న బ్రిస్టల్‌లోని ఒక స్కూల్ పాఠ్యాంశాల్లో చేర్చారు. అస్సాంకు చెందిన సాధారణ రైతు అయిన పయేంగ్ నాలుగు దశాబ్దాలలో 550 హెక్టార్లలో ఓ అడవినే పెంచాడు. ఆ అడవిలో ఏనుగులు, జింకలు, ఖడ్గమృగాలు, పులులు, అనేక ఇతర జంతువులు నివసిస్తున్నాయి. ‘విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లో భాగంగా 57 ఏళ్ల ‘పద్మశ్రీ’ జాదవ్ పయేంగ్ గురించి చదువుతున్నారు’ అని బ్రిస్టల్‌లోనే ఇంకో పాఠశాల ఉపాధ్యాయురాలైన నవమీశర్మ తెలిపారు. గౌహతిలో పుట్టి పెరిగిన పయేంగ్ 1979 నుంచి తన గ్రామంలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చేస్తూ వచ్చాడు. ‘‘అమెరికా పాఠశాలలోని విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లో భాగంగా పయేంగ్పై రెండు డాక్యుమెంటరీలను కూడా చూశారు. పయేంగ్ కథ చాలా శక్తిమంతమైంది. చిన్న వయసు నుంచే పర్యావరణ సమస్యను పరిష్కరించడంలో పయేంగ్ ముందున్నాడు.. అని గ్రీన్ హిల్స్ స్కూల్ టీచర్ డాన్ కిల్లియాని చెబుతుంటే నాకెంతో గర్వంగా అనిపించింది ఇక్కడివాళ్లు పయేంగ్ నుంచి ప్రేరణ పొందుతున్నారు. ఈ ఫారెస్ట్ మ్యాన్ గురించి నాకు ముందే తెలుసు. ఇక్కడ స్కూల్ పిల్లలు పాఠంగా అతని గురించి తెలుసుకుంటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని అంటున్నారు నవమీశర్మ. -
చెట్టు లేకపోతే భవిష్యత్ లేదు
సాక్షి, హైదరాబాద్: చెట్టు లేకపోతే మనకు భవిష్యత్ లేదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ జాదవ్ మొలాంగ్ పెయాంగ్ అన్నారు. ప్రకృతిని కాపాడితే, ఆ ప్రకృతే మనకు అన్నీ తిరిగి ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన జాదవ్ మంగళవారం అరణ్యభవన్‌లో అధికారులతో సమావేశమై తన అనుభవాలు పంచుకున్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది జాదవ్‌ను ఘనంగా సన్మానించారు. అస్సాంకు చెందిన మొలాంగ్ బ్రహ్మపుత్ర నదీ తీరంలో వరదలతో కోతకు గురైన ప్రకృతి విధ్వంసాన్ని చూసి, 1979లో మొక్కలు నాటడం ప్రారంభించారు. సుమారు 550 హెక్టార్లలో అడవిని పెంచారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు పీసీసీఎఫ్‌లు పాల్గొన్నారు. అనంతరం సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో మొలాంగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం, జీఎం (సీడీఎన్ అండ్ సీపీఆర్ఓ) ఆంటోని రాజా, అధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏజీఎం మార్కెటింగ్ ఎన్వీకే శ్రీనివాస్‌రావు, డీజీఎంలు, ప్రజాకవి జయరాజు, ఇగ్నైటింగ్ మైండ్స్ సీఈవో కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఎంత మంచి పాకిస్తాన్!
ఈ నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు! పాకిస్తాన్‌ని మనం ఊరికే ఆడిపోసుకుంటుంటాం కానీ, పాపం అది ఎంత మంచి కంట్రీనో తెలిస్తే మీకు కన్నీళ్లొచ్చేస్తాయి. జాధవ్ అనే మన ఇండియన్ ఒకాయన వాళ్ల కంట్రీలో బందీగా ఉన్నాడు కదా. ఆయన్ని చూడ్డానికి ఈమధ్య ఇండియా నుంచి ఆయన తల్లి, భార్య వెళితే పాకిస్తాన్ ఎంచక్కా చూడనిచ్చింది. అబ్బే.. ఇండియా శాటిస్ఫై అయితేనా! అద్దాల్లోంచి చూడనివ్వడం కూడా ఒక చూడనివ్వడమేనా అని ఫైర్ అయింది. ‘మీకు మానవత్వం లేదా? మీకు ఫ్యామిలీ మెంబర్స్ లేరా? జాధవ్‌కి, ఆయన తల్లీ భార్యకు మధ్య అద్దాన్ని అడ్డంగా ఎందుకు పెట్టారు?’ అని ప్రశ్నించింది. ‘పెట్టక తప్పలేదు’ అంది పాకిస్తాన్. ‘పెట్టకపోతే ఏమౌతుంది?’ అని ప్రశ్నించింది ఇండియా. ‘పెట్టకపోతే ఏమౌతుందా? వాళ్లు ఒకళ్లనొకళ్లు హగ్ చేసుకుంటారు. ముక్కూ మూతీ రుద్దుకుంటారు’ అంది పాకిస్తాన్. ‘అయితే నీకొచ్చిన నష్టం ఏంటీ పాకిస్తాన్? వాళ్లు ఒకింటి వాళ్లేకదా’ అని ప్రశ్నించింది ఇండియా. పాకిస్తాన్ సమాధానం చెప్పలేదు. ‘పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వం. పోస్ట్‌లో రీజన్ పంపిస్తాం వెళ్లండి’ అని అక్కడి మన ఆఫీసర్‌కి చెప్పింది. చివరికి పోస్ట్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి, చూసి, చదివి, బోరుమని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక్కడి మన ఆఫీసర్లు. ‘రెస్పెక్టెడ్ సర్.. జాధవ్‌ని చూడ్డానికి అతడి తల్లి, భార్య ఇక్కడికి వచ్చినప్పుడు జాధవ్ తీవ్రమైన జలుబు, ముక్కుదిబ్బడతో బాధపడుతున్నాడు. అవి ఆయన్నుంచి వారికి అంటుకోకూడదనే మధ్యలో అడ్డుగా అద్దం పెట్టాం’ అని ఉంది ఉత్తరంలో! అందుకే ఎవర్నీ గబాల్న అపార్థం చేసుకోకూడదంటారు. ముఖ్యంగా పాకిస్తాన్‌ని. -
లంకపై భారత్ క్లీన్‌స్వీప్
-
లంకపై భారత్ క్లీన్‌స్వీప్
♦ సెంచరీ సాధించిన కోహ్లి ♦ అర్ధ సెంచరీతో మెరిసిన జాదవ్ కొలంబో: శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ, కేదార్‌జాదవ్ అర్ధసెంచరీతో రాణించడంతో చివరి మ్యాచ్‌లో సైతం భారత్ సునాయసంగా గెలుపొందింది. లంక నిర్ధేశించిన 239 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రాక రాక వచ్చిన అవకాశాన్ని రహానే(5) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రోహిత్ శర్మ(16) కూడా త్వరగా అవుటవ్వడంతో క్రీజులో ఉన్న కోహ్లి, పాండేతో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించిననంతరం పాండే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో కోహ్లికి అండగా నిలిచాడు. ఈ దశలో 107 బంతుల్లో 8 ఫోర్లతో కెరీర్లో 30 వ సెంచరీ సాధించిన కోహ్లి వన్డేల్లోఅత్యధికంగా సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్‌మన్ పాటింగ్(30) సరసన చేరాడు. ఇక రెండు పరుగుల విజయ దూరంలో ఉండగా జాదవ్ అవుటవ్వడంతో ధోని క్రీజులోకి వచ్చాడు. చెరో సింగిల్‌తో మ్యాచ్ భారత్ వశమైంది. ఇక లంక బౌలర్లలో మలింగ, పుష్పకుమార, డిసిల్వా, ఫెర్నాండోలు తలో వికెట్ తీశారు. భువీ విజృంభణ.. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకపై భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. పదునైన బంతులతో చెలరేగి పోయిన భువీ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. భువనేశ్వర్ దెబ్బకు లంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. భువీకి జతగా బూమ్రా రెండు వికెట్లతో మెరవడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ కు తలో వికెట్ దక్కింది.