Jagananna Animutyalu
-
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్‌లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్‌లు సరికొత్తగా డెస్‌్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్‌తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం అందించిన ఆర్థిక తోడ్పాటు వల్ల భారం లేకుండా చదువుకున్నాను..!
-
మెరిసిన మాణిక్యాలు
ఈరోజు నా కళ్ల ముందు మెరిసే నక్షత్రాలు, రాష్ట్ర భవిష్యత్తు కనిపిస్తున్నాయి. ప్రతి విద్యార్థి ముఖంలో కాంతి, ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. పాఠశాల స్థాయిలో విజయం వైపు పడిన ఈ అడుగులు అత్యున్నత శిఖరాన్ని చేరుకోవాలి. మట్టి నుంచి పెరిగిన ఈ మొక్కలు మహా వృక్షాలై ప్రపంచానికే అభివృద్ధి ఫలాలను అందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మట్టిలోనే మాణిక్యాలు వికసిస్తాయని, మన పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. కార్పొరేట్ స్కూళ్లు సైతం ఈర్ష్య పడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన మార్కులను చూస్తుంటే ముచ్చటేస్తోందని, ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ‘ఐబీ’ సిలబస్ కూడా తెస్తామని, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మన పరీక్ష పత్రాలను కూడా మారుస్తామని తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య విద్యా సంస్థల్లో చదువుతూ ఆయా విద్యాసంస్థల్లో రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచిన 42 మంది టెన్త్ విద్యార్థులు, ఇంటర్లో గ్రూపుల వారీగా టాపర్లు 26 మందిని ‘జగనన్న ఆణిముత్యాలు– స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్–2023’తో ఘనంగా సత్కరించారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఈ వేడుకకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను సత్కరించారు. ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 20 మంది విద్యార్థులను కూడా ‘స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డు’తో సత్కరించారు. అనంతరం సీఎం జగన్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నాలుగేళ్లలోనే సదుపాయాలన్నీ.. సర్కారు బడికి జీవం పోస్తూ ఆణిముత్యాలను సత్కరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రం మొత్తమ్మీద నాలుగు స్థాయిల్లో టెన్త్, ఇంటర్లో టాప్ ర్యాంకుల్లో నిలిచిన 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నాం. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. టాప్ ర్యాంకులు సాధించిన మీరే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. మిమ్మల్నందరినీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక పెరుగుతోంది. సంకల్పం గట్టిదైతే ఫలితం అదే వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు మారిపోయాయి. రుచికరమైన మెనూ, పౌష్టికాహారంతో జగనన్న గోరుముద్ద అందిస్తున్నాం. పాఠశాలలు తెరవగానే జగనన్న విద్యా కానుక అందిస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్లు నాలుగేళ్లలోనే ఇంగ్లీష్ మీడియంకు మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. పాఠ్య పుస్తకాల సిలబస్ మారింది. బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్ సమకూర్చాం. బైజూస్ కంటెంట్ అందుబాటులోకి తెచ్చాం. ఆరో తరగతి నుంచి ఐపీఎఫ్ ప్యానెళ్ల ద్వారా డిజిటల్ బోధన అందిస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు కంటెంట్ లోడెడ్ ట్యాబ్‌లను ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. గతంలో క్లాస్ టీచర్లే సరిగా లేని దుస్థితి నుంచి సబ్జెక్ట్ టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలన్నీ సమకూరాయి. అవార్డు గ్రహీతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున సాధ్యమేనా? అనే పరిస్థితి నుంచి.. మన పేదింటి పిల్లలందరూ అంతర్జాతీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మూడో తరగతి నుంచి విద్యార్థులను టోఫెల్ పరీక్షకు సిద్ధం చేసి అంతర్జాతీయ సర్టిఫికెట్ అందచేసే గొప్ప అడుగు ఈ సంవత్సరం పడుతోంది. ప్రభుత్వ స్కూళ్ల పిల్లలను ఇంగ్లీష్ వినడం, మాట్లాడటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాం. ఇలాంటి మార్పులు గవర్నమెంట్ బడుల్లో రాగలవా? సాధ్యమయ్యే పనేనా..? అనే పరిస్థితి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడక తప్పదనే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, తమ్ముడిగా పిల్లలందరికీ మంచి చదువులు అందాలని మనసారా కోరుకుంటున్నా. ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది ప్రతి విద్యార్థీ కనీసం డిగ్రీతో బయటకు రావాలి. ఏ పిల్లాడి తల్లిదండ్రీ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులన్నింటికీ మొత్తం ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. విదేశాల్లో కూడా టాప్ 50 యూనివర్సిటీల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో సీటు తెచ్చుకోండి. మీకు మీ జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఫీజు రూ.1.25 కోట్లైనా మీరు భయపడాల్సిన పనిలేదు. పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి మన పిల్లలందరూ ప్రతి రంగంలోనూ ఎదగాలి, మన కీర్తి ఎగరాలి. ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలు, వినూత్న విధానాలను మన పిల్లలు అనుసరిస్తూ ప్రతి రంగంలోనూ ప్రపంచ లీడర్లుగా ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. ఇది జరగాలంటే నాణ్యమైన విద్య అందించాలి. ఈ నాలుగేళ్లల్లో విద్యపై మన ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ దేశంలో ఎవరూ తీసుకుని ఉండరు. రానున్న రోజుల్లో మన ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) సిలబస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మన పరీక్ష పత్రాలు కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాలు ప్రపంచాన్ని ఏలే పరిస్థితి త్వరలోనే వస్తుంది. అది మనమంతా చూస్తాం. నాయకత్వ లక్షణాలను పెంచే విధంగా మన చదువులున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మెషీన్ లెర్నింగ్, చాట్ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలందరూ ఎదగాలి. ఆ స్థాయిలో మన విద్యారంగం మారబోతోంది. ఆ మేరకు మార్పులు చేస్తాం. విద్యార్థులతో కలసి ఉత్సాహంగా విద్యార్థుల సత్కార వేడుకలో ముఖ్యమంత్రి జగన్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పురస్కారాల ప్రదానం సందర్భంగా ప్రతి విద్యార్థి, టీచర్‌ను పేరు అడిగి మరీ అభినందించారు. పురస్కార గ్రహీతల్లో బాలికలు ఎక్కువ మంది ఉండడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. బాలికా విద్యను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. కష్టాలు చెప్పుకున్న విద్యార్థులకు అభయం అవార్డుల ప్రదానం సందర్భంగా కొందరు విద్యార్థులు తమ కష్టాలను తెలియచేయడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ► తిరుపతికి చెందిన కందాటి కుసుమ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బయోటెక్‌లో పీహెచ్డీ చేస్తున్నారు. ‘బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న ఆమె తల్లి లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సీఎం జగన్ దృష్టికి తేవడంతో వైద్యం తీసుకుంటున్నారా? అని ఆరా తీశారు. వివరాలు సేకరించి అవసరమైన సాయం అందించాలని అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను సీఎం ఆదేశించారు. ► అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామానికి చెందిన చిన్ని పావని నక్కపల్లి కేజీబీవీలో బైపీసీ చదివి 976 మార్కులు సాధించింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె బాగోగులను విశాఖలోని ఓ ట్రస్ట్ చేపట్టింది. తనకు డాక్టర్ కావాలని ఉందని, స్తోమత లేదని పావని పేర్కొనడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్ నీట్ శిక్షణకు అవసరమైన సాయం అందించాలని విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను ఆదేశించారు. మరికొందరు విద్యార్థులు కూడా తమ సమస్యలను సీఎం దృష్టికి తేవడంతో వారందరికీ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. టాపర్లకు నగదు బహుమతులు మొదటి స్థానంలో నిలిచినవారికి రూ.లక్ష నగదు రెండో బహుమతిగా రూ.75 వేలు, మూడో బహుమతి రూ.50 వేలు ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో టెన్త్, ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో ఆయా విద్యాసంస్థల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సీఎం జగన్ చేతుల మీదుగా నగదు పుర స్కారాలను ప్రదానం చేశారు. పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో 42 మంది విద్యార్థులు టాపర్లుగా నిలవగా 11 మంది ప్రథమ స్థానం, 16 మంది ద్వితీయ స్థానం, 15 మంది తృతీయ స్థానం సాధించారు. ఇంటర్లో గ్రూప్‌నకు ఒక్క రు చొప్పున 26 మంది విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. తొలి స్థానంలో నిలిచినవారికి రూ.లక్ష నగదు, రెండో స్థానం సాధించినవారికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.50 వేల నగదు చొప్పున బహుమతి అందజేశారు. ఉన్నత విద్యలో 20 మందికి పురస్కారం ఉన్నత విద్యలో వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు స్టేట్ ఎక్స్‌లెన్స్ అ వార్డులను ప్రదానం చేశారు. కమ్యూనిటీ స ర్వీసెస్, ఉత్తమ విద్యార్థి, ప్రతిభావంతుడైన వి ద్యార్థి, స్టూడెంట్ ఇన్నొవేషన్ విభాగాలతో పాటు క్విజ్ చాంపియన్‌షిప్‌లో గెలుపొందిన తొలి మూడు జట్లకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందించారు. ప్రతి విభాగంలో మొదటి స్థానానికి రూ.లక్ష, రెండో స్థానానికి రూ.75 వేలు, మూడో స్థానానికి రూ.50 వేలు చొప్పున నగదు అందజేశారు. ఉత్తమ విద్యార్థి, ప్రతిభావంతుడైన విద్యార్థి కేటగిరీల్లో కన్సొలేషన్ బహుమతి కింద రూ.10 వేలు ప్రదానం చేశారు. టెన్త్ , ఇంటర్, ఉన్నత విద్యలో మొత్తం 88 మంది టాపర్లుగా నిలిచారు. విద్యార్థులందరినీ ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరించారు. స్ఫూర్తిదాయకం.. ఆరోగ్యకరమైన పోటీ సీఎం చేతుల మీదుగా పురస్కారాలు అందించడం మరింత మంది విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతుంది. ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నాం. అలాంటి విద్యార్థులను తయారు చేసిన అధ్యాపకులకు అభినందనలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యా రంగానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అందరూ గర్వపడేలా అవకాశాలు కల్పిస్తున్నాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం జగన్ తోడుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు. డిజిటల్ విద్యలో మన విద్యార్థులు రాణించేలా చర్యలు చేపట్టారు. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి -
విజయవాడలో అవార్డులు అందుకున్న ‘జగనన్న ఆణిముత్యాలు’ (ఫొటోలు)
-
విద్యార్థుల చదువులపై మరింత దృష్టి సారించండి
-
ప్రపంచాన్ని మారుస్తున్న టెక్నాలజీ గురించి విద్యార్థులు తెలుసుకోవాలి
-
Vijayawada: ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులు అందించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఇంటర్ విద్యార్థులకు అవార్డులు అందజెసిన సీఎం జగన్
-
10 వ తరగతి విద్యార్ధులకి అవార్డు అందజెసిన సీఎం జగన్
-
బిటెక్, డిగ్రీ విద్యార్థులకు అవార్డులు అందజెసిన సీఎం జగన్
-
కిందపడిన కళ్లజోడును తీసి విద్యార్థికి ఇచ్చిన సీఎం జగన్..
-
ప్రతి మొఖంలో కాంతి ఆత్మ విశ్వాసం నాకు చాలా నచ్చాయి!
-
చాట్ జీపీటీ విద్యారంగం పూర్తిగా మారబోతుంది..
-
రూ. కోటి అయ్యేనా సరే చదువుకోండి మీకు ఈ జగన్ మామ ఉండు
-
మీ అందరికి గ్రాండ్ వెల్కమ్
-
ఉత్తమ ఫలితాలు తెచ్చుకున్న విద్యార్థులు , ఉఫాధ్యాలులకి సత్కారం
-
చిన్న వయసులోనే అవార్డు తీసుకుంటే మిగిలిన విద్యార్థులు ఎలా ఉంటారంటే
-
ప్రతిభ కలిగిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో సన్మానం
-
చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడం: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మైండ్స్.. షైనింగ్ స్టార్, ఫ్యూచర్ ఆఫ్ ఏపీ మనదని ఉద్ఘాటించారాయన. మంగళవారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం కింద టాపర్స్‌ను విజయవాడలో సన్మానించే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం. కరిక్యులమ్ కూడా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి విద్యార్థికి ట్యాబులు అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతోనే.. విద్యా దీవెన, విద్యా వసతి చేపట్టాం. విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తోంది. అత్యుత్తమ కంటెంట్‌తో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులకు టెక్నాలజీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటాం. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడం. మీ జగన్ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులను ఉద్దేశించి స్పష్టం చేశారాయన. ప్రోత్సాహకాలిలా.. జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈ నెల 12 నుంచి వారంపాటు సత్కారాలు నిర్వహించనున్నారు. పదవ తరగతిలో ఫస్ట్ ర్యాంకర్‌కు లక్ష. ద్వితీయ ర్యాంక్ రూ.75 వేలు, తృతీయ ర్యాంక్‌కు రూ. 50 వేలు ప్రొత్సాహకం అందించనుంది ఏపీ ప్రభుత్వం. 42 మందిని ఎంపిక చేసి అందిస్తారు. పదో తరగతి విద్యార్థులకు.. ► జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది. ► నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000, విద్యార్థులు 681 మంది. ► పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది. ఇంటర్ విద్యార్థులకు.. ► రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం ► జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం ► నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం ► మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,710 ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తారు. -
CM YS Jagan Vijayawada Tour: మీకు జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది
Updates జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. ►మీకు జగన్ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది ►గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చదువుపై ధ్యాస పెట్టలేదు ►10వ తరగతిలో రాష్ట్రస్థాయి పస్ట్ ర్యాంకర్ నగదు పురస్కార రూ. 1 లక్ష ►ద్వితీయ ర్యాంకు రూ. 75 వేలు, తృతీయ ర్యాంకు వారికి రూ. 50 వేలు నగదు పురస్కారం ►ప్రభుత్వ స్కూల్స్‌లో చదువుతున్న పేద వర్గాల పిల్లలు ప్రపంచాన్ని ఏలే రోజు వస్తుంది ►నిరుపేద వర్గాలు కూడా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుతారు ►రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో పరీక్షా పశ్నాపత్రాలు రూపకల్పన ►అట్టడుగు వర్గాల వారే ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు ►జగనన్న ఆణిముత్యాలు పేరుతో ఈ నెల 12 నుంచ 19 వరకూ సత్కారాలు ►ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్ మైండ్స్, షైనింగ్ స్టార్, ఫ్యూచ్ ఆఫ్ ఏపీ మనది ►మన మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు, ఈరోజు మహావృక్షాలై ప్రపంచానికి అభివృద్ధి ఫలాలు అందించాలి ►ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు, కరిక్యూలమ్ అన్ని మారాయి ►ప్రతి విద్యార్థికి ట్యాబ్‌లు అందిస్తున్నాం ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిస్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. ► విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని ఈ కార్యక్రమం. మన విద్యార్థి ఏ రాష్ట్రానికి వెళ్లినా పోటీతత్వంలో నిలబడతారు. విద్యార్థులే రేపటి భవిష్యత్తుగా ఏపీ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది అని అన్నారు. ► విజయవాడ చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► విజయవాడలో అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం జగన్ ► పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది ఇంటర్లో సత్తాచాటిన 26 మంది నగదు పురస్కారంతో పాటు సర్టిఫికేట్, మెడల్ ప్రదానం ►రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు 22,710 మంది ►గత ప్రభుత్వంలో పెత్తందార్ల చేతిలో బందీ అయిన విద్యావ్యవస్థలో ప్రస్తుత ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది. లక్షల్లో డబ్బు గుంజే కార్పొరేట్ స్కూళ్ల కన్నా మిన్నగా పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ బడుల్లో వసతులు కల్పించింది. ►ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చి, డిజిటల్ విద్యను ప్రవేశపెట్టి, మెరుగైన విద్యనందిస్తోంది. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక కలెక్టర్, ఒక సైంటిస్ట్, ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక లీడర్ వంటి ఆణిముత్యాలు రావాలన్న తపన, తాపత్రయంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తోంది. ►ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగ సంస్కరణలపైనే ప్రభుత్వం అక్షరాలా రూ.60,329 కోట్లు ఖర్చు చేసింది. కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతూ.. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో టాపర్స్‌గా నిలిచిన 42 మంది, ఇంటరీ్మడియట్ గ్రూపుల వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన 26 మంది విద్యార్థులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులను ప్రదానం చేయనున్నారు. విజయవాడ ఎ–కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం జరిగే వేడుకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులను సత్కరించనున్నారు. ►వీరితో పాటు ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు ‘స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డులు’ను ప్రదానం చేయనున్నారు. కార్యక్రమ వేదిక ఏర్పాట్లను సోమవారం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు పరిశీలించారు. 22,710 మంది విద్యార్థులకు ప్రోత్సాహం ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ కేటగిరీ విద్యాసంస్థల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జగనన్న ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదో తరగతి, ఇంటర్లో విద్యార్థులను ఎంపిక చేసింది. పదో తరగతిలో కేటగిరీ వారీగా (జెడ్పీ, మున్సిపల్, మోడల్, ట్రైబల్/ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ తదితర) రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పాఠశాల స్థాయిలో ప్రతి స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ/ఎంఈసీ, హెచ్ఈసీ(నాలుగు) గ్రూపుల్లో ప్రతి గ్రూపులోను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మొత్తం 22,710 మంది విద్యార్థులకు ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’గా ప్రోత్సాహం అందించనుంది. 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో పాఠశాల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో తొలి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి 19 వరకు ఇప్పటికే నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్తో సత్కరించింది. వీరితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను, సంబంధిత విద్యాసంస్థలకు మొమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాళ్లను ప్రభుత్వం సన్మానించింది. జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలిలా.. పదో తరగతి విద్యార్థులకు.. - రాష్ట్రస్థాయి నగదు పురస్కారం: ప్రథమ స్థానం– రూ.1,00,000, ద్వితీయ స్థానం– రూ.75,000, తృతీయ స్థానం– రూ.50,000, విద్యార్థులు 42 మంది. - జిల్లా స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.50,000, ద్వితీయ– రూ.30,000, తృతీయ– రూ.15,000, విద్యార్థులు 609 మంది. - నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.15,000, ద్వితీయ– రూ.10,000, తృతీయ–రూ.5,000, విద్యార్థులు 681 మంది. - పాఠశాల స్థాయి నగదు పురస్కారం: ప్రథమ– రూ.3,000, ద్వితీయ–రూ.2,000, తృతీయ– రూ.1,000, విద్యార్థులు 20,299 మంది. ఇంటర్ విద్యార్థులకు.. - రాష్ట్ర స్థాయి గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.1,00,000 చొప్పున 26 మంది విద్యార్థులకు ప్రదానం - జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.50,000 చొప్పున 391 మంది విద్యార్థులకు ప్రదానం - నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్‌కు రూ.15,000 చొప్పున 662 మందికి ప్రదానం - మొత్తం విద్యార్థుల సంఖ్య: 22,710 - ర్యాంకర్లకు సమాన మార్కులతో ఎంతమంది ఉన్నా అందరినీ సత్కరించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతో పాటు సర్టిఫికేట్, మెడల్ అందజేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇది కూడా చదవండి: కదిలిన రుతుపవనాలు..వచ్చే 4 రోజుల్లో రాష్ట్రమంతటికీ విస్తరణ -
గన్నవరంలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం
-
ప్రతిభకు పట్టం
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను నియోజకవర్గ స్థాయిలో గురువారం ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్ల పరిధిలోని సంస్థల్లో పదో తరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఇలా నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మందిని, ఇంటర్లో వివిధ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీల్లో ఆయా గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన 662 మంది విద్యార్థులను సన్మానించారు. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ వేడుక నిర్వహిస్తోంది. విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్, పాఠశాలకు మెమెంటో ఇవ్వడంతోపాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా కొనసాగింది. ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషిని సర్వత్రా ప్రశంసించారు. విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలతో విద్యా రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, పల్నాడు జిల్లా నాదెండ్లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బాపట్ల జిల్లా వేమూరులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, గంగాధర నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అనకాపల్లి జిల్లా మాడుగులలో డిప్యూటీ సీఎం ముత్యాలునాయుడు, తణుకు మండలం వేల్పూరులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విద్యార్థులను సన్మానించారు. కూలి పనులకు వెళ్తూనే టాపర్‌గా.. అవనిగడ్డ : కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇంటర్ హెచ్ఈసీలో టాపర్‌గా నిలిచిన పేరుబోయిన హరిత ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కోడూరు మండలం పాలకాయతిప్పకు చెందిన పేరుబోయిన నాగమల్లేశ్వరరావు–వెంకటేశ్వరమ్మ పెద్ద కుమార్తె. కూలి పనులకు వెళ్లడం వల్ల 2019లో పదోతరగతి పరీక్షలకు హాజరు కాలేక పోయింది. ఆ మరుసటి సంవత్సరం కూలి పనులకు వెళుతూనే కష్టపడి చదివి పదో తరగతిలో 520 మార్కులు సాధించింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ హెచ్ఈసీలో చేరింది. 1000కి 893 మార్కులు సాధించి నియోజకవర్గంలో టాపర్‌గా నిలిచింది. జగనన్న ఆణిముత్యాల కార్యక్రమం కోసం హరిత కోసం గాలించిన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దుర్గారమేష్, అధ్యాపకులు తమిళనాడులో కూలి పనులకు వెళ్లిందని తెలుసుకుని అక్కడకు వెళ్లి తీసుకొచ్చారు. సన్మానం అనంతరం హరిత మాట్లాడుతూ.. ‘నాలాంటి పేద కుటుంబాలకు అమ్మఒడి, నగదు ప్రోత్సాహాల ద్వారా జగనన్న ఎంతో అసరాగా నిలిచారు’ అంటూ భావోద్వేగంతో కంట నీరుపెట్టింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం ద్వారా తాను డిగ్రీ చదువుకుని టీచర్ జాబ్ సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. హరితను డీఈవో తెహరా సుల్తానా, శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు ఓదార్చారు. మీ లాంటి వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే సీఎం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. -
‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా
సాక్షి, విజయవాడ: ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. టెన్త్, ఇంటర్ టాపర్లకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నియోజకవర్గాలు, 27 న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయి కార్యక్రమం నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా, అయితే ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది. చదవండి: నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు.