స్టెతస్కోప్‌కు కాలం చెల్లినట్లే..
స్మార్ట్‌ఫోన్ తరహాలో ఉండే పరికరం అందుబాటులోకి..
న్యూయార్క్: ఇక ముందు మీకు వైద్యులెవరూ స్టెతస్కోప్‌తో కనిపించకపోవచ్చు. రక్తపోటు వంటి ఇతర శారీరక ప్రక్రయలనూ ఓ చిన్ని పరికరంతోనే పరీక్షించొచ్చు. దీంతో గత 200 ఏళ్లుగా వైద్యులు వినియోగిస్తున్న స్టెతస్కోప్‌కు కాలం చెల్లినట్లే. న్యూయార్క్‌లోని మౌంట్ సైని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన భారత సంతతి వైద్యుడు జగత్ నరులా ఈ విషయాన్ని వెల్లడించారు. అల్ట్రా సౌండ్ (తక్కువ పౌనపున్యం ఉన్న ధ్వని) సాంకేతికతతో పనిచేసే ఈ పరికరం కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుందని, దానిని మీ గుండె, ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర భాగాలపై ఉంచి పరీక్ష చేయవచ్చని జగత్ తెలిపారు. దీనివల్ల ఫలితాలు కూడా చాలా వరకూ కచ్చితంగా ఉంటాయని పేర్కొన్నారు.