Jaiwardhan Singh
-
నాన్న పెళ్లి నాకు ఓకే! : జైవర్దన్ సింగ్
భోపాల్: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్ ప్రేమాయణాన్ని ఆయన కుమారుడు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యే జైవర్దన్‌సింగ్ సమర్ధించారు. తన తండ్రి పునర్వివాహం అంశం పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారంగా ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తండ్రికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇంతకుమించి దీని గురించి తాను ఏమీ మాట్లాడబోనన్నారు. రాజ్యసభ టీవీ యాంకర్ అమృతారాయ్‌ను తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు దిగ్విజయ్ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అమృతారాయ్‌తో తన వివాహం వ్యక్తిగతమైనప్పటికీ ఆమెతో తనకు గల సంబంధాన్ని దాచి పెట్టలేదని, ధైర్యంగా బహిరంగ పరిచినట్లు కూడా దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అమృతతో తన వివాహం విషయంలో ఎటువంటి విమర్శలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలని వెల్లడించారు. అమృతారాయ్‌కు కోర్టు విడాకులు మంజూరు చేసిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు. -
నాన్నను అనుకరించను: దిగ్విజయ్ పుత్రరత్నం
రాజకీయాల్లో తనకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటానని ఇటీవలే రాఘవ్ గఢ్ నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన జైవర్థన్ సింగ్ వెల్లడించారు. అందుకోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. వారి అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. తన తండ్రి దిగ్విజయ్ సింగ్ శైలీని మాత్రం అనుకరించనని చెప్పారు. తన తండ్రి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడిలా కాకుండా తనకుంటూ ప్రత్యేక శైలీని ఏర్పాటు చేసుకుంటానన్నారు. దిగ్విజయ్ సింగ్ కొడుకులా కాకుండా నీ కంటూ ఓ గుర్తింపు ఉండాలని, ఆ విధంగా మలుచుకోవాలని తన తండ్రి సూచించిన సంగతిని ఈ సందర్బంగా జైవర్థన్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో తన తండ్రి సూచించినట్లే నడుచుకుని విజయం సాధించానని జైవర్థన్ సింగ్ తెలిపారు. -
ఈసారి విజయం కాంగ్రెస్ పార్టీదే: జైవర్థన్ సింగ్
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి విజయం కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 130 సీట్ల వరరకూ వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం రఘోగఢ్‌లో జైవర్ధన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే సంతోషం వేస్తోందన్న జైవర్థన్... తన గెలుపుపై మాత్రం ముక్తసరిగా మాట్లాడారు. అంతా ప్రజల చేతుల్లో ఉందని విశ్లేషించారు. కాగా మధ్య ప్రదేశ్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఈరోజు ఉదయం పది గంటల వరకూ 15 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు వెల్లడించారు. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి. 2008 ఎన్నికల్లో బీజేపీ 143, కాంగ్రెస్ 71 స్థానాలు గెలుచుకున్నాయి.