నాన్నను అనుకరించను: దిగ్విజయ్ పుత్రరత్నం | Want to establish my own identity in politics: Jaiwardhan | Sakshi

నాన్నను అనుకరించను: దిగ్విజయ్ పుత్రరత్నం

Dec 14 2013 2:18 PM | Updated on Aug 14 2018 3:55 PM

నాన్నను అనుకరించను: దిగ్విజయ్ పుత్రరత్నం - Sakshi

నాన్నను అనుకరించను: దిగ్విజయ్ పుత్రరత్నం

రాజకీయాల్లో తనకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటానని ఇటీవలే రాఘవ్ గఢ్ నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన జైవర్థన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయాల్లో తనకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటానని ఇటీవలే రాఘవ్ గఢ్ నియోజకవర్గం నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన జైవర్థన్ సింగ్ వెల్లడించారు. అందుకోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. వారి అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. తన తండ్రి దిగ్విజయ్ సింగ్ శైలీని మాత్రం అనుకరించనని చెప్పారు. తన తండ్రి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడిలా కాకుండా తనకుంటూ ప్రత్యేక శైలీని ఏర్పాటు చేసుకుంటానన్నారు.

 

దిగ్విజయ్ సింగ్ కొడుకులా కాకుండా నీ కంటూ ఓ  గుర్తింపు ఉండాలని, ఆ విధంగా మలుచుకోవాలని తన తండ్రి సూచించిన సంగతిని ఈ సందర్బంగా జైవర్థన్ గుర్తు చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో తన తండ్రి సూచించినట్లే నడుచుకుని విజయం సాధించానని జైవర్థన్ సింగ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement