Jallianwalla Bagh massacre
-
చరిత్రలో మరిచిపోలేని జలియన్ వాలాబాగ్ ఉదంతం.. ట్రైలర్ చూశారా?
భారతీయుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని దారుణ ఉదంతం జలియాన్ వాలాబాగ్ ఊచకోత. అప్పటి బ్రిటీశ్ పరిపాలన కాలంలో 1919 ఏప్రిల్ 13న ఈ మారణహోమం జరిగింది. ఈ అత్యంత పాశవిక ఘటన ఆధారంగా వెబ్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ది వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ పేరుతో రామ్ మాద్వానీ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు.తారుక్ రైనా, నిఖితా దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేనెల మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, తమిళం భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. యధార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Find out the conspiracy behind the Jallianwala Bagh massacre, as a nation awakens. Creator | Director Ram Madhvani brings to you a show inspired by true events #TheWakingOfANation, Streaming on 7th March on Sony LIV pic.twitter.com/Q5qM8ZN8Cn— Sony LIV (@SonyLIV) February 24, 2025 -
'ఆ కాల్పులు జలియన్ వాలాబాగ్ కంటే హేయం'
కొల్కత్తా: 1993 కోల్కతాలో పోలీసుల కాల్పులపై జస్టిస్ సుశాంత ఛటర్జీ కమిషన్ తన తుది నివేదికను సోమవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఘటనలో పోలీసుల వైఖరిని కమిషన్ తప్పుపట్టింది. ఈ కాల్పుల ఘటన జలియన్ వాలాబాగ్ ఘటన కంటే హేయమైనదని కమిషన్ అభివర్ణించింది. పోలీసులు కనిపించిన వారిని కనిపించినట్లు పిట్టల్లా కాల్చేశారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. 1993లో కోల్కతా మహానగరంలోని రాష్ట్ర సచివాలయం 'రైటర్స్ బెల్డింగ్' వద్ద తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీని అడ్డుకోవాలని అప్పటి వామపక్ష ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ర్యాలీపై పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. దీనిపై జస్టిస్ సుశాంత ఛటర్జీ కమిషన్ ఏర్పాటైంది. దాదాపు 300 మంది సాక్షులను విచారించిన కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.