జల్లికట్టు వివాదం: పోలీసులపై గ్రామస్తుల దాడి
కనుమ పండుగ చేసుకుంటున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడపనొత్తం గ్రామంలో చోటుచేసుకుంది. కనుమ పండుగను పురస్కరిచుకొని శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన జల్లికట్టు వద్ద బైరెడ్డిపల్లి ఎస్సై హరిహర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు లేకుండా లాఠీచార్జి చేశారు.
దాంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అకారణంగా లాఠీచార్జి చేసినందుకు గ్రామస్తులంతా ఏకమై పోలీసులపై దాడీ చేశారు. ఇందులో ఎస్సై హరిహర ప్రసాద్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు చిన్నపాటి గాయాలయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.