Jamai raja
-
జమాయీ రాజా చచ్చిపోయాడు
బార్మర్: అతను ఎపుడూ పెళ్లి చేసుకోలేదు...ఎవరితోనూ కలిసి ఉండలేదు.. కానీ 55 మంది పెళ్లికూతుళ్లతో కాపురం చేశాడు.. ఆనక చల్లగా అక్కడ నుంచి నగలతో ఉడాయించేవాడు. ఈ క్రమంలో 56వ అమ్మాయికి వలవేసి పోలీసులకు బుక్కయ్యాడు. చివరకు అనామకుడిగా రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో శవమై తేలాడు. నింబాల్ కోట్ గ్రామంలో శనివారం మరణించిన అతగాడికి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఎలా చనిపోయాడు .. పోలీసులు ఎందుకు దహన క్రియలు చేశారు అనేది స్పష్టత లేదు. వివరాల్లోకి వెళ్తే, జియారామ్ జాట్ (54)కు ఉన్న క్రిమినల్ రికార్డు సామాన్యమైంది కాదు. వివిధ పోలీస్ స్టేషన్లలో దాదాపు18 కేసులు నమోదయ్యాయి. బాల్యవివాహం అయిన అమ్మాయిలే అతని టార్గెట్. చిన్నప్పుడే పెళ్లయ్యి... వయసు వచ్చి కాపురానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిలున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకొని దోచుకోవడం అతని మోడెస్ ఒపరాండీ. అలా ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నపుడు వారితో పరిచయం పెంచుకుని..అల్లుడిగా నమ్మించి .. ఇంట్లోకి చొరబడేవాడు. అమ్మాయిని కాపురానికి తీసుకెళతానని అత్తమామల్ని నమ్మించి ఆ అమ్మాయిలతో కాపురం చేసేవాడు. అనంతరం వారి దగ్గరున్న నగలతో పరారయ్యేవాడు. 2004 లో వేధింపుల కేసులో పోలీసులు జియారామ్ ను అరెస్టు చేసినపుడు స్వయంగా ఈ వివరాలన్నీ విచారణలో అంగీకరించాడు. ఈ తర్వాత కొంత కాలం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన జియా రామ్ 2013 లో మళ్లీ ఇదే కేసులో అరెస్ట్ అయ్యాడు. దీంతో పోలీసులు అతగాడిని 'జమాయీ రాజా' (అల్లుడుగారు) అని పోలీస్ ఫైల్స్ లో పేర్కొన్నారు. -
అల్లుడా మజాకా!
కొన్ని కథలు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తాయి. కానీ వాటిని ప్రెజెంట్ చేసే విధానం వల్ల బాగానే అలరిస్తుంటాయి. జీ టీవీలో ప్రసారమయ్యే ‘జమాయీ రాజా’ కూడా అంతే! ఏఎన్నార్ దగ్గర్నుంచి అల్లరి నరేష్ వరకూ ఎంతోమంది హీరోలు చేసిన సినిమాల్లోని సన్నివేశాలను మిక్స్ చేసినట్టుగా ఉంటుందీ సీరియల్. ఓ కోటీశ్వరుడైన అబ్బాయి... ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె పేదదేమీ కాదు. కానీ తాను పెరిగిన పరిస్థితుల వల్ల ఆమెకి డబ్బున్నవాళ్లంటే ఇష్టముండదు. దాంతో పేదవాడిగా నాటకమాడి ఆమె మనసును గెల్చుకుంటాడు హీరో. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఆమె తల్లి అడ్డు పడుతుంది. పేదవాడు తనకు అల్లుడు కావడానికి వీల్లేదంటుంది. ఆమెను ఎదిరించి హీరోని పెళ్లాడుతుంది కూతురు. అప్పట్నుంచీ తన కూతురి జీవితంలోంచి అతడిని ఎలా దూరం చేయాలా అని ప్లాన్లు వేస్తుంటుంది అత్తగారు. వాటిని ఆ అల్లుడు ఎలా తిప్పికొడతాడు అనేదే కథ! సీరియల్కి పెద్ద సమస్య కథే. కాకపోతే కథనం బాగుండటం, అల్లుడిగా రవి దూబే అదరగొట్టేయడం కలసి వచ్చింది. ఒక రకంగా అతడి ఇమేజ్, టాలెంట్, ఎనర్జీలే ‘జమాయీ రాజా’ని హిట్ సీరియళ్ల లిస్టులో చేర్చాయని చెప్పవచ్చు!