James Pattinson
-
ఆ ఫాస్ట్ బౌలర్‌కు భారీ షాక్.. మ్యాచ్ ఆడకుండా నిషేధం
James Pattinson cops fine, one-match ban: ఆసీస్ మాజీ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ పాటిన్సన్కు క్రికెట్ ఆస్ట్రేలియా షాకిచ్చింది. ఈ స్పీడ్‌స్టర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పెట్టడంతో పాటుగా.. మ్యాచ్ నిషేధం విధించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. కాగా షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా పాటిన్సన్ విక్టోరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో న్యూసౌత్‌వేల్స్‌తో మ్యాచ్ సందర్భంగా నాలుగో రోజు ఆటలో పాటిన్సన్ దుందుడుకుగా ప్రవర్తించాడు. న్యూసౌత్ వేల్స్ కెప్టెన్ డేనియల్ హ్యూజెస్ ప్రత్యర్థి జట్టుకు అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ ఆడాడు. పాటిన్సన్ బౌలింగ్‌లో అదే తరహాలో ఆటను కొనసాగించాడు. దీంతో చిరాకుపడిన పాటిన్సన్.. అతడి వైపుగా కోపంగా బంతిని విసరగా.. పాదానికి దెబ్బ తగిలింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో పాటిన్సన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. క్రికెట్ ఆస్ట్రేలియా సైతం అతడి అనుచిత ప్రవర్తనను ఉపేక్షించేది లేదంటూ గట్టి చర్యలు తీసుకుంది. కాగా పాటిన్సన్ ఇటీవలే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందుకు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక గాయాల కారణంగా పలు సిరీస్‌లకు దూరమవడం.. అదే సమయంలో హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి పేసర్లు జట్టులోకి రావడంతో పాటిన్సన్కు అవకాశాలు సన్నగిల్లాయి. చదవండి: #JusticeForSanjuSamson: మా గుండె పగిలింది.. అసలేంటి ఇదంతా?! Ouch! Daniel Hughes 71* (283) continues to defy Victoria despite copping this throw from James Pattinson in the second session #SheffieldShield pic.twitter.com/ChTkupId1n — cricket.com.au (@cricketcomau) November 8, 2021 Ouch! Daniel Hughes 71* (283) continues to defy Victoria despite copping this throw from James Pattinson in the second session #SheffieldShield pic.twitter.com/ChTkupId1n — cricket.com.au (@cricketcomau) November 8, 2021 -
బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. కోపంతో బంతిని లాగిపెట్టి
James Pattinson Throw Injures Opponent Batter.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేమ్స్ పాటిన్సన్ చర్యపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళితే.. షాఫీల్డ్ షీల్డ్ టోర్నీలో జేమ్స్ పాటిన్సన్ విక్టోరియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా టోర్నీలో భాగంగా విక్టోరియా, న్యూసౌత్ వేల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో న్యూ సౌత్‌వేల్స్ కెప్టెన్ డేనియల్ హ్యూజెస్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 283 బంతులెదుర్కొన్న అతను 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చదవండి: IND vs NZ 2021: టి20 కెప్టెన్‌గా రోహిత్ .. తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్!? అయితే టీ విరామానికి ముందు డేనియల్ ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా డిఫెన్స్ ఆడుతూ చికాకు పెట్టాడు. ఈ నేపథ్యంలో బౌలింగ్‌కు వచ్చిన జేమ్స్ పాటిన్సన్కు హ్యూజెస్ ఆట చిరాకు తెప్పించింది. పాటిన్సన్ వేసిన బంతిని హ్యూజెస్ డిఫెన్స్ ఆడగా..పాటిన్సన్ చిర్రెత్తిపోయాడు. బంతిని అందుకొని హ్యూజెస్ క్రీజులోనే ఉన్నప్పటికీ కావాలనే అతన్ని టార్గెట్ చేస్తూ కోపంతో విసిరాడు. బంతి కాస్త వెళ్లి హ్యూజెస్ పాదానికి బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన అతను కాసేపు క్రీజులో నుంచి పక్కకు వెళ్లాడు. ఆ తర్వాత పాటిన్సన్ క్షమాపణ చెప్పేందుకు వెళ్లగా.. హ్యూజెస్ కోపంగా చూశాడు. టీ విరామ సమయంలో పెవిలియన్ వెళ్తున్న సమయంలో పాటిన్సన్, హ్యూజెస్ మధ్య మాటలయుద్ధమే నడిచింది. కొద్దిసేపు అలాగే ఉండి ఉంటే కొట్టుకోవడానికి సిద్దమయ్యేవారే. మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే పాటిన్సన్ చర్యపై సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చదవండి: Daryl Mitchell: ఇది ఫీల్డింగ్ అంటే.. క్యాచ్ పట్టకపోయినా హీరో అయ్యాడు ''ఇలాంటి వ్యక్తిని ఇంకా క్రికెట్ ఆడనిస్తున్నారా.. వెంటనే బ్యాన్ చేయండి.. ప్రత్యర్థి ఆటగాడు బాగా ఆడుతున్నాడని మండినట్టుంది.. అందుకే కోపంతో బంతిని విసిరాడు.. పాటిన్సన్ చర్య దారుణం.. ఒక బ్యాటర్‌పై కోపం వ్యక్తం చేయడం మంచి పద్దతి కాదు.. అందుకే ఆసీస్ టీమ్ అతన్ని పక్కకు పెట్టింది'' అంటూ కామెంట్స్ చేశారు. Ouch! Daniel Hughes 71* (283) continues to defy Victoria despite copping this throw from James Pattinson in the second session #SheffieldShield pic.twitter.com/ChTkupId1n — cricket.com.au (@cricketcomau) November 8, 2021 Absolutely ridiculous and unnecessary attempt by Pattinson to peg the ball back at Hughes’ stumps. I hope the match referee sanctions him for that pathetic act. — Rowan de Groen (@StuffedShoulder) November 8, 2021 Why is he still playing? Should be banned forever. Ridiculous of Pattinson. — Warisha (@Khan__Warisha) November 8, 2021 -
టెస్ట్ క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ గుడ్‌బై...
James Pattinson retires from Test cricket: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ ముందు ప్యాటిన్సన్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణాల్లో మోకాలి గాయం కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా మోకాలి సమస్యలతో ప్యాటిన్సన్ ఇబ్బంది పడుతున్నాడు. కాగా 2011లో టెస్టు క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన ప్యాటిన్సన్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు సాధించి ప్రత్యర్ధి జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే ఆ తర్వాత మెకాలి గాయంతో చాలా సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం నుంచి కాస్త కోలుకున్నప్పటికీ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉండడం వల్ల ప్యాటిన్సన్కు టెస్ట్ క్రికెట్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్యాటిన్సన్.. నాలుగు ఐదు వికెట్ల హాల్‌లతో సహా 81 వికెట్లు సాధించాడు. చదవండి: T20 World cup 2021: ధోనికి వయస్సు అయిపోలేదు.. మాకు పోటీ ఇవ్వగలడు: కేఎల్ రాహుల్ -
దూషించి నిషేధానికి గురైన క్రికెటర్
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ప్యాటిన్సన్పై నిషేధం పడింది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా విక్టోరియా తరఫున ఆడుతున్న ప్యాటిన్సన్.. క్వీన్లాండ్స్తో జరిగిన మ్యాచ్‌లోని ఆటగాడిపై వ్యక్తిగత దూషణలకు దిగాడు. అతనితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలాన్ని వాడాడు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీరియస్ అయ్యింది. క్రికెట్ ఆస్ట్రేలియా కోడ్ ఆఫ్ కండెక్ట్‌లో భాగంగా ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లు కల్గి ఉన్న ప్యాటిన్సన్.. మరోసారి దూకుడు ప్రదర్శించడంతో వేటు తప్పలేదు. ఫలితంగా పాకిస్తాన్‌తో గురువారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌లో ఉన్న ప్యాటిన్సన్పై నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఒక ఆటగాడ్ని దూషించిన కారణంగా ప్యాటిన్సన్పై ఒక టెస్టు నిషేధం విధిస్తున్నట్లు సీఏ పేర్కొంది. తాను సహనం కోల్పోవడం వల్లే క్వీన్‌లాండ్స్ ఆటగాడ్ని దూషించినట్లు సీఏకు ఇచ్చిన ఓ ప్రకటనలో ప్యాటిన్సన్ పేర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో వాడివేడి వాతావరణం చోటు చేసుకోవడంతో తాను నోరు జారినట్లు ఒప్పుకున్నాడు. తన తప్పిదాన్ని ప్యాటిన్సన్ తనకు తానుగా ఒప్పకోవడంతో ఒక మ్యాచ్ నిషేధంతో సీఏ సరిపెట్టింది. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ప్యాటిన్సన్ సభ్యుడు. మిచెల్ స్టార్క్‌తో కలిసి బౌలింగ్ పంచుకోవాల్సిన తరుణంలో ఇలా నిషేధానికి గురి కావడం ఆసీస్‌కు ఎదురుదెబ్బే. ఇప్పటికే పలువురి క్రికెటర్లు మానసిక సమస్యలతో జట్టుకు దూరమయ్యారు. -
తొలి డే/నైట్ టెస్టుకు పాటిన్సన్!
మెల్ బోర్న్: మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగే చివరిదైన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ పాటిన్సన్ కు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ వీడ్కోలు పలకడంతో ఆస్థానంలో పాటిన్సన్ కు అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా ఆసీస్ 13 మంది సభ్యుల బృందంలో పాటిన్సన్ పేరును చేర్చారు. నవంబర్ 27 నుంచి అడిలైడ్ లో ఇరు జట్ల మధ్య జరుగనున్న చివరిటెస్టు ఆరంభానికి ముందు పాటిన్సన్ తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. తాజాగా జట్టులో తిరిగి చోటు దక్కడంతో ఆశ్చర్చం వ్యక్తం చేశాడు పాటిన్సన్. తాను ఎప్పుడూ వంద మైళ్ల వేగంతో బౌలింగ్ వేయడంతోనే తరచు గాయపడుతున్నానని పేర్కొన్నాడు. పీటర్ సిడెల్ తో కలిసి జాన్సన్ ఎప్పుడూ బౌలింగ్ అటాక్ ను పంచుకునేవాడని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం తన ఫిట్ నెస్ పై ఎటువంటి అనుమానాలు లేవన్నాడు. ఇటీవల రెండు దేశవాళీ మ్యాచ్ ల్లో 40 ఓవర్లకు పైగా బౌలింగ్ వేసినట్లు తెలిపాడు. ఇప్పుడు తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని.. ఇక తదుపరి టెస్టుపైనే దృష్టి నిలిపినట్లు పాటిన్సన్ పేర్కొన్నాడు. కొంతకాలంగా దీర్ఘకాలిక నడుం నొప్పితో పాటు తొడ కండరాలు పట్టేయడంతో పాటిన్సన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. గత ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాటిన్సన్ చివరిసారి ఆడాడు. ఇప్పటివరకూ 13 టెస్టులు ఆడిన పాటిన్సన్ 51 వికెట్లను తీశాడు.