James Pattinson retires from Test cricket: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ ముందు ప్యాటిన్సన్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన కారణాల్లో మోకాలి గాయం కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా మోకాలి సమస్యలతో ప్యాటిన్సన్ ఇబ్బంది పడుతున్నాడు. కాగా 2011లో టెస్టు క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్యాటిన్సన్.. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు సాధించి ప్రత్యర్ధి జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు.
అయితే ఆ తర్వాత మెకాలి గాయంతో చాలా సిరీస్‌లకు దూరమయ్యాడు. గాయం నుంచి కాస్త కోలుకున్నప్పటికీ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉండడం వల్ల ప్యాటిన్సన్‌కు టెస్ట్ క్రికెట్‌లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్యాటిన్సన్.. నాలుగు ఐదు వికెట్ల హాల్‌లతో సహా 81 వికెట్లు సాధించాడు.
చదవండి: T20 World cup 2021: ధోనికి వయస్సు అయిపోలేదు.. మాకు పోటీ ఇవ్వగలడు: కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment