Jamie
-
Eng vs NZ: ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రకటన.. ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ఎంట్రీ
పాకిస్తాన్లో చేదు అనుభవం చవిచూసిన ఇంగ్లండ్ తదుపరి మరో పర్యటనకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం తమ జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ ఈ టూర్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.కాగా బెన్ స్టోక్స్ బృందం ఇటీవల పాకిస్తాన్లో మూడు టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. పాక్ గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్.. రెండు, మూడో టెస్టుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది. ‘బజ్‌బాల్’కు కళ్లెం వేసిన పాక్ స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో 1-2తో ఇంగ్లండ్ పాకిస్తాన్‌కు సిరీస్‌ను కోల్పోయింది.కివీస్‌తో మూడు టెస్టులుఈ క్రమంలో నవంబరు 28 నుంచి ఇంగ్లండ్ న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆరంభం కానున్న ఈ సిరీస్‌కు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన జేమీ స్మిత్ దూరమయ్యాడు. అతడు పెటర్నిటీ సెలవులో వెళ్లిన కారణంగా.. జోర్డాన్ కాక్స్ వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.మరోవైపు.. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాణించిన ఆల్‌రౌండర్ జాకోబ్ బెతెల్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20 మ్యాచ్‌లు ఆడిన జాకోబ్ 738 పరుగులు చేశాడు. అదే విధంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన అతడు ఏడు వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈసారి అరంగేట్రం పక్కామరోవైపు.. కాక్స్ 53 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 3194 పరుగులతో రాణించాడు. దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద పారించినప్పటికీ అతడు ఇంతవరకు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. శ్రీలంక సిరీస్ నుంచి జట్టుతోనే ఉన్నా ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి మాత్రం ఈ వికెట్ కీపర్ బ్యాటర్ టెస్టు క్యాప్ అందుకునే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక కివీస్‌తో సిరీస్ ఆడే జట్టులో ముగ్గురు స్పిన్నర్లు జాక్ లీచ్, షోయబ్ బషీర్, రేహాన్ అహ్మద్‌లకు కూడా చోటిచ్చారు సెలక్టర్లు. కాగా 2008 తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారి కూడా న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ఇక కివీస్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. టీమిండియాతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకుంది.న్యూజిలాండ్‌తో టెస్టులకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్(కెప్టెన్), రేహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జాకోబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జాక్ లీచ్, ఒలీ పోప్, మాథ్యూ పాట్స్, జో రూట్, ఓలీ స్టోన్, క్రిస్ వోక్స్.చదవండి: Mumbai Pitch: కివీస్‌తో మూడో టెస్టు.. తొలిరోజు వారికే అనుకూలం!? -
పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్ సీడ్ జో సాలిస్బరీ (బ్రిటన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి. -
వెల్లువలా మద్దతు: బ్రిట్నీ స్పియర్స్‌కు భారీ ఊరట
Britney Spears తండ్రిని సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించాలని చేస్తున్న న్యాయ పోరాటంలో పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ‘సగం గెలుపు’ సాధించింది. తండ్రి జేమీ స్పియర్స్‌కు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన లాయర్(అటార్నీ)ను తానే నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉందని కోర్టు వెల్లడించింది. సుమారు మూడువారాల తర్వాత బుధవారం(జులై14న) జరిగిన వాదనల టైంలో లాస్ ఏంజెల్స్ కోర్టుకు ఫోన్ కాల్ ద్వారా విచారణకు హాజరైన బ్రిట్నీ.. ‘నన్ను చంపే ప్రయత్నం జరుగుతోంది’ అని కన్నీరు పెట్టుకుంది. గార్డియన్షిప్ నుంచి తన తండ్రిని తప్పించాలని.. ఆయన వ్యవహారశైలి క్రూరంగా ఉందని, కనీసం ఈ వ్యవహారంలో వాదనల కోసమైన తనకు స్వేచ్ఛను ప్రసాదించాలని ఆమె న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి స్పందించిన జడ్జి బ్రెండా పెన్నీ.. స్పియర్స్ తరుపున ఇంతకు ముందు అటార్నీ రాజీనామాను ఆమోదిస్తూనే, కొత్త అటార్నీ మాథ్యూ రోసెన్గార్ట్ను నియమించుకునే హక్కును బ్రిట్నీకి కల్పిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. జేమీ స్పియర్‌ను బ్రిట్నీ సంరక్షణ నుంచి తప్పించాలన్న పిటిషన్‌పై ఇక నుంచి వాదనలు వినిపించబోతున్నారు రోసెన్‌గార్ట్. గతంలో స్టీవెన్ స్పీల్బర్గ్, సీన్ పెన్ లాంటి ప్రముఖుల తరపున వాదించారు. Coming along, folks ... coming along 🖕🏻!!!!! New with real representation today ... I feel GRATITUDE and BLESSED !!!! Thank you to my fans who are supporting me ... You have no idea what it means to me be supported by such awesome fans !!!! God bless you all !!!!! pic.twitter.com/27yexZ5O8J — Britney Spears (@britneyspears) July 15, 2021 ఈ వ్యవహారంలో ఆమెకు మద్దతుగా భారీ ఎత్తున ఫ్రీబిట్నీ ‘#FreeBritney’ సైన్ పిటిషన్‌ను రన్ చేస్తున్నారు. లక్షల మంది సంతకాలు చేపడుతున్నారు. అయితే ఆమె మానసిక స్థితి దృష్ట్యా తండ్రిని తప్పించలేమని కోర్టు గత వాదనల టైంలో స్పష్టం చేసింది. అయితే తదనంతర పరిణామాలు ఆమెకు పూర్తి వ్యతిరేకంగా మారాయి. స్పియర్స్‌కు చాలాకాలంగా మేనేజర్‌గా వ్యవహరించిన లారీ రుడోల్ఫ్తో పాటు ఆమె అటార్నీ సామ్యుయెల్ ఇన్గ్హమ్ కూడా తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే మేనేజర్ లారీ తప్పుకోవడంతో 39 ఏళ్ల బ్రిట్నీ.. తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతోందంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి కూడా. -
నేటి నుంచి ఎల్లారమ్మ జాతర
జామి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, భక్తుల కొంగు బంగారమైన జామి ఎల్లారమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం తొలేళ్లు, ఆదివారం జాతర నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాతరకు ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి ఏడాదీ ఫాల్గుణ శుద్ధ అష్టమి రోజున జాతర నిర్వహిస్తారు. తొలేళ్లు.. జాతర అనువంశిక అర్చకుడు ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. శనివారం రాత్రి 11.15 గంటలకు పూజారి ఇంటి వద్ద అమ్మవారిని గద్దె నుంచి దింపి ఊరేగింపు చేపడతారు. గ్రామ పురవీధుల గుండా సాగిన ఊరేగింపు ఆలయానికి చేరుకున్న తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో అమ్మవారి చరిత్రను జముకుల కళాకారులు కథా రూపంలో వివరిస్తారు. మొదటి రోజు ఉత్సవంలో కోలాటం, నృత్య ప్రదర్శనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఆదివారం జరగనున్న జాతరలో భారీఎత్తున బాణసంచా కాలుస్తారు. ఏర్పాట్లు పూర్తి : ఈఓ వినోదీశ్వరరావు జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని ఈఓ వినోదీశ్వరరావు తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఆలయానికి రంగులు వేసినట్లు చెప్పారు. కమిటీ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి వీఐపీ పాస్‌లు మంజూరు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కొత్తలి శ్రీనివాస్ తెలిపారు. -
రోజుకో ఫొటో...
ఇప్పుడంటే ఫొటో తీయడం చాలా సులువు. సెల్ ఫోన్ ఉంటే చాలు సెల్ఫీల వర్షం కురిపించొచ్చు. కానీ ఇవేవీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో మాత్రం ఫొటో తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. సెల్ ఫోన్లు, సెల్ఫీ లేని రోజుల్లో జామీ లివింగ్ స్టన్ అనే వ్యక్తి గత 30 ఏళ్లుగా రోజుకో ఫొటో తీసుకున్నాడు. ఈ పని ఆయన చనిపోయే రోజు వరకూ చేశాడు. ఇందుకోసం పాతకాలం నాటి పోలరాయిడ్ కెమెరా ఆయన ఉపయోగించాడు. న్యూయార్క్‌కి చెందిన ఈ ఫొటోగ్రాఫర్ తన ఫొటోలన్నిటినీ జాగత్తగా భద్రపరచి ఉంచుకున్నాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో ఈ మధ్యే జామీ చనిపోయాడు. అతని మిత్రులు హ్యూ క్రాఫోర్డ్, బెట్సీ రీడ్‌లు ఈ ఫొటోలన్నిటినీ ప్రదర్శనగా ఉంచారు. జామీ జీవితంలోని వివిధ ఘట్టాలను, మిత్రులతో, బంధువులతో గడిపిన క్షణాలను మరోసారి రీప్లే చేయించింది ఈ ప్రదర్శన.