Jammu and Kashmir Assembly polls
-
ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి
శ్రీనగర్/రాంచి: జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గంటలోపు ట్రెండ్ ఎలా ఉందనేది కౌటింగ్ మొదలైన గంట తర్వాత తెలిసే అవకాశముంది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఐదు దశల్లో జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మునుపెన్నడూ ఎరుగని రీతిలో 66 శాతం పోలింగ్ నమోదయింది. జార్ఖండ్ లో బీజేపీ, జమ్మూకశ్మీర్ లో పీడీపీ అతిపెద్ద పార్టీలు అవతరించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. -
కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీదే విజయం: సిద్ధూ
ఘజియాబాద్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెల్చుకుంటుందని మాజీ ఎంపీ, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్ రాజకీయాలను మార్చేలా ప్రస్తుత పోలింగ్ సరళి ఉండబోతుందని చెప్పారు. నరేంద్ర మోదీ ఒన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు సిద్ధూ నిరాకరించారు. జాతి ప్రయోజనాల కోసం మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు.