శ్రీనగర్/రాంచి: జార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గంటలోపు ట్రెండ్ ఎలా ఉందనేది కౌటింగ్ మొదలైన గంట తర్వాత తెలిసే అవకాశముంది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు.
ఐదు దశల్లో జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో మునుపెన్నడూ ఎరుగని రీతిలో 66 శాతం పోలింగ్ నమోదయింది. జార్ఖండ్ లో బీజేపీ, జమ్మూకశ్మీర్ లో పీడీపీ అతిపెద్ద పార్టీలు అవతరించే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి
Published Mon, Dec 22 2014 8:09 PM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement
Advertisement