
కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీదే విజయం: సిద్ధూ
ఘజియాబాద్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెల్చుకుంటుందని మాజీ ఎంపీ, క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్ రాజకీయాలను మార్చేలా ప్రస్తుత పోలింగ్ సరళి ఉండబోతుందని చెప్పారు.
నరేంద్ర మోదీ ఒన్ మ్యాన్ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించేందుకు సిద్ధూ నిరాకరించారు. జాతి ప్రయోజనాల కోసం మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. ఓ స్వచ్చంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు.