‘పురం’లో నీటిసమస్యకు చెక్!
నీటిఎద్దడి నివారణకు రూ.2.35కోట్లు
ట్యాంకర్లు, ప్రైవేట్బోర్లను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేయాలని నిర్ణయం
గద్వాల : జిల్లాలోని మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటిని పట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చడంతో కొన్ని పట్టణాల్లో రెండుమూడు రోజులకు ఒకమారు సరఫరా చేయాల్సి పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ‘పుర’వాసుల దాహం తీర్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఆయా పట్టణాల్లో తాగునీటి ఎద్దడిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.25కోట్లు కేటాయించింది. కొన్నిరోజుల క్రితం అన్ని పట్టణాలకు నిధులు మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పట్టణ ప్రాంత ప్రజలకు కాస్తఊరట లభించనుంది.
గద్వాల కృష్ణానది దగ్గర, జములమ్మ రిజర్వాయర్ వద్ద ఉన్న నిర్మించిన శాశ్వత పథకాల్లో నీళ్లు అడుగంటాయి. దీంతో గద్వాల పట్టణానికి తాగునీటి సరఫరా దినదినగండంగా మారింది. ఆయా పట్టణాల్లోనూ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. సమస్య నివారణకు అధికారులు ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. కానీ వేసవి ముగిసిన తర్వాత నిధులు విడుదలయ్యేవి. ఈసారి మాత్రం రాష్ర్ట ప్రభుత్వం ముందుచూపుతో ఆయా పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఈ నిధులను 15రోజుల క్రితమే విడుదల చేసింది. అయినప్పటికీ చాలా మునిసిపాలిటీలు ఇప్పటివరకు ప్రతిపాదనలు పంపించలేదు.
రూ.2.35కోట్లు మంజూరు
వేసవిలో తాగునీటి ఎద్దడినివారణకు రా ష్ట్ర ప్రభుత్వంజిల్లాలోని పురపాలక సం ఘాలు,నగర పంచాయితీలకు రూ.2.35 కోట్లు విడుదల చేసింది. అర్డర్స్ సీజనల్ కండిషన్స్ (ఏఎస్సీ)నిధుల ద్వారా వీటి ని కేటాయించింది. జిల్లాలో గద్వాల ము నిసిపాలిటీకి రూ.15 లక్షలు, వనపర్తికి రూ.15లక్షలు, నారాయణపేటకు రూ. 25లక్షలు, మహబూబ్‌నగర్‌కు రూ.40లక్షలు, కొల్లాపూర్‌కు రూ.20లక్షలు, నాగర్‌కర్నూల్‌కు రూ.20లక్షలు, షాద్‌నగర్‌కు రూ.20లక్షలు, బాదేపల్లికి రూ.20లక్షలు, అయిజకు రూ.20లక్షలు, కల్వకుర్తికి రూ.20లక్షలు,అచ్చంపేట నగర పం చాయితీకిరూ.20లక్షలచొప్పున మంజూ రయ్యాయి. ఆయా పట్టణాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా సరఫరా, సింగిల్‌ఫేజ్ మోటార్ల మరమ్మతులు కొత్తగా ఏర్పాటు, చేతిపంపులకు మరమ్మతులు అవసరమైన సామగ్రి కొనుగోళ్లు, బోర్ల తవ్వకం, ప్రైవేట్‌గా బోర్లను అద్దెకు తీసుకునేందుకు ఈ నిధులను వినియోగించేలా వెసులుబాటు కల్పించారు.