janardhanreddy
-
పేపర్ లీక్ కేసు చైర్మన్ కూడా విచారణకు రావలసిందే!
-
నాలా ఆక్రమణలు సహించం కూల్చేస్తాం
గచ్చిబౌలి: నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలతోపాటు ఎఫ్టీఎల్, చెరువులు, కాలనీల్లోని అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ బి జనర్ధాన్ రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు నుంచి రాయదుర్గంలోని మల్కంచెరువు వరకున్న నాలా చుట్టూరా ఉన్న నిర్మాణాలను, షౌగౌస్ హోటల్‌కు చెందిన వంటసామగ్రి భద్ర పరిచే గోడౌన్ కూల్చివేతను మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ వరదలొచ్చినప్పుడు జనం పడే కష్టాలను ప్రత్యక్షంగా చూశామన్నారు. నగరంలోని అక్రమ నిర్మాణాలపై వివక్ష లేకుండా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు 117 రోడ్లు దెబ్బతిన్నాయని, 180 కిలోమీటర్ల రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని గుర్తించామన్నారు. రోడ్ల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి ?సవివరమైన నివేదికను అందించడం జరుగుతుందన్నారు.వర్షపునీటితో నిల్వ ఉండే ప్రాంతాలు, గుంతలు ఏర్పడిన రోడ్లను గుర్తించి వాటిని సిమెంట్ కాంక్రీట్‌తో పూడ్చివేసి రాకపోకలు సాఫీగా సాగేలా చేస్తామన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు అంతా కార్ పూలింగ్‌పై దృస్టి సారించాలని ఆయన కోరారు. నిర్మాణాలన్నీ కూల్చాల్సిందే : మేయర్ నాలాల ఆక్రమణలు, నిర్మాణాల నేపథ్యంలో డ్రామా కంపెనీలా చేయవద్దని, నాలా దగ్గరలో ఉన్న అన్ని నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులకు ఆయన స్పష్టం చేశారు. నాలా, చెరువులు, కుంటల వద్ద పట్టా భూములున్నవారు వ్యవసాయం చేసుకోవాలని, నిర్మాణాలను చేపట్టరాదని ఆయన స్పష్టం చేశారు. నాలా సమీపంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న భారీ భవనంను చూస్తూ ఈ నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని, వీటికి ఇచ్చిన అనుమతులను త్వరలో రద్దు చేస్తామన్నారు. శేరిలింగంపల్లి తహశీల్దార్ మధుసుధన్ శేరిలింగంపల్లి సర్కిల్ ?–11 డీసీ మనోహర్, ఏసీపీ కృష్ణమోహన్ , డీఈ కిష్టప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇక అక్రమ నిర్మాణాలు తొలగింపులే..!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని 24 సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సర్కిళ్లవారీగా డిమాలిషన్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి శనివారం సాయంత్రం ఉత్తర్వు జారీ చేశారు. నగరంలోని అక్రమ నిర్మాణాలను.. ముఖ్యంగా చెరువులు, నాలాలపై నిర్మించిన వాటిని తొలగించేందుకు గట్టి చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తక్షణమే స్పందించిన కమిషనర్ చర్యలు చేపట్టారు. డిమాలిషన్ స్క్వాడ్‌లో సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌తోపాటు సర్కిల్ పరిధిలోని తాసీల్దార్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌ను సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ స్క్వాడ్ల ఏర్పాటుతో పాటు వారికి అవసరమైన సిబ్బంది, వాహనాలు సమకూరుస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. నాలాలు, చెరువుల ఆక్రమణల వల్లే ప్రస్తుత దుస్థితి అంటూ కమిషనర్, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినందున ఈ స్క్వాడ్లు వెంటనే రంగంలోకి దిగుతాయని తెలిపారు. అక్రమ కట్టడాల సమాచారమివ్వండి.. నగరంలో నాలాలు, చెరువులు, శిఖం భూముల్లో అక్రమంగా నిర్మిం చిన కట్టడాల గురించి సమాచారం తెలిసిన వారు తమకు అందజేయాల్సిందిగా కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిపే వివరాలు గోప్యంగా ఉంటాయని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్(040–21 11 11 11)కు తెలియజేయాలన్నారు. కలెక్టర్లు, పోలీసు కమిషనర్లకు లేఖలు.. సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేస్తున్న డిమాలిషన్ స్క్వాడ్లలో సంబంధిత తహసీల్లార్లు, సహాయక పోలీస్ కమిషనర్లను సభ్యులుగా నియమించాలని కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసినట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. -
విధులకు డుమ్మాకొట్టిన టీచర్ సస్పెండ్
కడప ఎడ్యుకేషన్ (వైఎస్సార్ జిల్లా): నెల రోజులుగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడిని డీఈవో గురువారం సస్పెండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం ఒడ్డిపాళెం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న జనార్దన్‌రెడ్డి నెల రోజులుగా విధులకు డుమ్మాకొడుతున్నారు. డీఈవోకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజర్ అయిన టీచర్‌ను డీఈవో సప్సెండ్చేశారు.