janauary 12
-
Army Day: భారత దేశ తొలి సైన్యాధ్యక్షుడు ఎవరు?
భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుకుంటారు. సైన్యంలో చేరడం గర్వకారణమని పలువురు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.1949లో జనరల్ కెఎం కరియప్ప(KM Cariappa) భారతదేశ తొలి సైన్యాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. అది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. భారతీయులకు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. మన రాజ్యాంగం 1950 నాటికి పూర్తిగా సిద్ధమైంది. అటువంటి పరిస్థితిలో తొలిసారిగా భారత సైన్యానికి చెందిన కమాండ్ ఒక భారతీయుని చేతుల్లోకి వచ్చింది.బ్రిటీషర్ల పాలన తరువాత ఇది భారతదేశ సైనిక చరిత్రలో ఒక మలుపుగా చెబుతారు. జనవరి 15న జనరల్ కరియప్ప భారత సైన్యానికి నాయకత్వం వహించారు. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే(Army Day) జరుపుకుంటారు. ఆర్మీ డే సందర్భంగా ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో గ్రాండ్ కవాతు నిర్వహిస్తారు. దీనిలో భారత సైన్యం తన ఆధునిక ఆయుధాలను ప్రదర్శిస్తుంది. అలాగే ఈ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, సైనిక విన్యాసాలు నిర్వహిస్తారు. సైనిక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.సైనిక దినోత్సవం మన వీర సైనికుల లెక్కలేనన్ని త్యాగాలను గుర్తు చేస్తుంది. భారత సైన్యం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటిగా గుర్తింపుపొందింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో కూడా భారత సైన్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారతమాతను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులను స్మరించుకునే రోజు ఆర్మీ డే. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: మహాకుంభమేళాలో మూడో రోజు విశేషాలు.. -
New Year 2025: ప్రారంభంలోనే ‘పరీక్షా కాలం’
నేటి (2025, జనవరి ఒకటి)నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు, ఉద్యోగార్థులకు పరీక్షా కాలంగా నిలిచింది. దీంతో వారు కాస్త ఆందోళనలో ఉన్నారు. ఈ పరీక్షలు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభంకానున్నాయి. యూజీసీ నెట్ మొదలుకొని జేఈఈ మెయిన్ వరకూ పలు పరీక్షలు ఈ మాసంలోనే జరగనున్నాయి. సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలుఈ సంవత్సరం ప్రారంభంలోనే సీబీఎస్ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు మొదలుకానున్నాయి. బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సీబీఎస్ఈ బోర్డు రెగ్యులర్ సెషన్ పాఠశాలలకు 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి 14 మధ్య జరగనున్నాయి.యూజీసీ నెట్ పరీక్షనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డిసెంబర్ 2024 సెషన్ కోసం యూజీసీ నెట్ పరీక్షను 2025, జనవరి 3, నుండి జనవరి 16 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష 85 సబ్జెక్టులలో కొనసాగుతుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.యూపీ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలుయూపీ బోర్డు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 23 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్ష జనవరి 23 నుంచి 31 వరకు, ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు రెండు దశల్లో నిర్వహించనున్నారు.ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్-2 పరీక్షస్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్)టైర్-2 పరీక్షను 2025, జనవరి 18, 19,20 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా గ్రూప్ బీ, సీ మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు. టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే టైర్-2కు హాజరుకాగలుగుతారు. మరింత సమాచారం కోసం ssc.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.యూకేసీఎస్సీ ఎస్ఐ పరీక్షఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్-ఇన్స్పెక్టర్ (యూకేసీఎస్సీ ఎస్ఐ) పోస్టుల రిక్రూట్మెంట్ పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ రిక్రూట్మెంట్ పరీక్ష 2025, జనవరి 12న నిర్వహిస్తున్నారు. ఆరోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్లను 2025, జనవరి 2 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 222 ఖాళీలను భర్తీ చేయనున్నారు.యూపీఎస్సీ సీఎస్ఈ 2024 ఇంటర్వ్యూయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జనవరి 7 నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు, ఇతర వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించవచ్చు.జేఈఈ మెయిన్స్ పరీక్షఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ మొదటి సెషన్ 2025, జనవరి 22 నుండి జనవరి 31 వరకు జరుగుతుంది. అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు పరీక్షకు మూడు రోజుల ముందు జారీ చేస్తారు. అయితే పరీక్ష జరిగే ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే అందుబాటులో ఉంచనున్నారు. మరిన్ని వివరాల కోసం nta.ac.in ని సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి: అంతటా న్యూఇయర్ జోష్.. హఠాత్తుగా వణికించే వార్త.. 1978లో ఏం జరిగింది? -
ఒక జననం ఒక మరణం
జనవరి 12... ఎవడో ఎగరేసిన జెండా తనకు తానుగా సగం దిగిపోయి అవనతమైన రోజు. మరణమెప్పుడూ చివరి చరణం కాదనే సంక్షోభగీతం ఆలపించిన రోజు. ‘కాలాన్ని ఖడ్గంగా పైకెత్తగల గాయాల్ని దిక్సుచిలా ప్రసరించగల వీరుడితో కరచాలనం చేస్తున్నా’ అంటూ నువ్వెళ్లిపోయావ్. అరచేతిలో అదృష్టరేఖలకు బదులు ‘రక్తరేఖ’లు చూసుకుంటూ, వందలాది క్యానమైసిన్లు పొడిచేసుకుంటూ... పచ్చగా బతికినోడివి పత్రహరితం కోల్పోయిన మొక్కలా నువ్వు చితికిపోయాక... నీకొచ్చిన కలలాగే... భూమ్మీద నూకలు చెల్లినవారికి ప్రభుత్వం తరపున స్వర్గంలో సన్నబియ్యమిచ్చినట్టే... పత్రికల్లో అలాంటి అవాంఛనీయ సంఘటనలే ఎక్కువయ్యాయి. ధాన్యపు గింజలొలిస్తే రైతు అస్థి పంజరాలు రాలిపడే దయనీయ దృశ్యాల్లో... ఎడారిలో కన్నీటి ఒయాసిస్సులు నింపిన ఆకలి మూలుగుల్లో... ఏకే 47 గర్జనల్లో... నువ్వే ముఖచిత్రమై కన్పిస్తున్నావ్. కలల మృతకళేబరాలు కాలుతున్న చోట నీ కవిత ప్రతిధ్వనిస్తూనే వుంది. కాలే కడుపుల కన్నీటి దృశ్యమై కదిలిపోతూనే వుంది. రెండున్నర దశాబ్దాల కింద నీ శరీరం మూగవోయినా, నీ కవిత్వం కడుపు మీద తడిసిన అగ్గిపుల్లతో గీసినా భగ్గున మండే ఆకలి కవిత్వమై జనం నాలుకలపై తచ్చాడుతోంది. ‘తమ్ముడూ తమ్ముడూ/ నవ్వొచ్చేటప్పుడు తప్పక/ పిడికెడు మట్టినైనా/ తీసుకురా...ఒక అమరవీరుని జ్ఞాపకమైనా/ మోసుకురా... మళ్లీ మళ్లీ నాకు/ జగిత్యాల గుర్తొస్తో్తంది/ జైత్రయాత్ర నను/ కలవరపెడుతోంది...’ ఆ ఉద్వేగభరిత సన్నివేశం నీ ఇంటిముందు నుంచి కదిలిపోయి నీ కవితా శక్తికి పోరాట పరిమళాన్ని అద్దింది. కాని అప్పటికే నీ జీవశక్తిని పీల్చేసిన క్షయ మృత్యుగీతాన్ని ఆలపించినా– ‘కాలం అంచున చిగురించిన నెత్తుటి ఊహను నేను/ కలల ఉపరితలం మీద కదలాడే కాంతిపుంజం నేను/... ఆయుధంగా రూపొందే ఆకలి నేపథ్యం నేను’ అన్నావ్. చనిపోయే రోజు సైతం కవిత రాసిన నీ ధీరత్వానికి నమస్కరించాల్సిందే. ‘మరణం నా చివరి చరణం కాదు/ మౌనం నా చితాభస్మం కాదుమనోహరాకాశంలో విలపించే/ చంద్రబింబం నా అశ్రుకణం కాదు’ అంటూ నిన్ను నువ్వు నిర్వచించుకొని వెళ్లిపోతే, గుండెలు చించుకుంది సాహితీలోకం. ఇప్పటికీ తెలంగాణ కంటì æనిండా తడి, జగిత్యాల జీవనాడిలో ఆగిపోని అలజడి. (జనవరి 12న అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా...) కె.వి.నరేందర్ 94440 28701