Jandis
-
కామెర్లు ఎందుకొస్తాయి...?
నేను వృత్తిరీత్యా కాంట్రాక్ట్ పనులు చేస్తుండటం వల్ల ఎక్కువగా ఊళ్లు తిరుగుతూ ఉంటాను. ఈమధ్య ఆకలి మందగించింది. నీరసంగా ఉండి ఎక్కువ సమయం నిద్రపోవాలనిపిస్తోంది. జ్వరంగా, అలసటగా ఉంటోంది. అప్పుడప్పుడూ కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. తరచూ ఒళ్లంతా దురదలు కూడా వస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్లి చూపించుకుంటే కామెర్లని చెప్పారు. వెంటనే చికిత్స ప్రారంభించాలని కూడా అన్నారు. అసలు కామెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది? ఒకసారి వ్యాధికి గురైతే పూర్తిగా తగ్గడం సాధ్యమేనా? నా లివర్‌కు ఏమైనా ప్రమాదం ఉంటుందా? దయచేసి కామెర్ల వ్యాధి గురించి వివరంగా చెప్పండి. చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగుకు మారడమే కామెర్ల (జాండీస్)కు కొండగుర్తు. రక్తంలో బైలిరుబిన్ అనే పదార్థం అధికంగా చేరడం అన్నది ఈ కండిషన్‌కు దారితీస్తుంది. బైలిరుబిన్ అనేది పసుపురంగులో ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఎర్రరక్తకణాలలోని హిమోగ్లోబిన్ తొలగిపోయాక మిగిలిపోయే భాగం ఇది. బైలిరుబిన్ పరిమాణం ఎక్కువైనప్పుడు అది చుట్టుపక్కల కణజాలాలోకి చేరి వాటికి పసుపురంగును కలిగిస్తుంది. సాధారణంగా రక్తంలోని బైలిరుబిన్‌ను కాలేయం తొలగిస్తుంటుంది. అది కాలేయానికి చేరగానే అక్కడ దానిపై కొన్ని రసాయనాలు పనిచేస్తాయి. ఆ రసాయన చర్యలతో అది అన్‌కాంజుగేటెడ్ బైలిరుబిన్ అనే పదార్థంగా తయారవుతుంది. కాలేయం దీన్ని పైత్యరసంలోకి పంపిస్తుంది. ఈ జీర్ణరసం ద్వారా ఆహారంలోకి చేరిన బైలిరుబిన్ జీర్ణప్రక్రియ చివరివరకూ కొనసాగి చివరకు మలంతో విసర్జితమవుతుంది. మలానికి రంగు దీనివల్లనే ఏర్పడుతుంది. అనేక కారణాలు, అలవాట్లు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడి కామెర్ల వ్యాధి వస్తుంది. గుర్తించడం ఎలా? సాధారణంగా బయటకు కనిపించేది, అత్యధికులకు తెలిసింది చర్మం, కళ్లు పచ్చగా మారడం. ఇది మొదట తల భాగంతో ప్రారంభించి క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ పచ్చదనం కాకుండా మరికొన్ని లక్షణాలు కూడా ఈ వ్యాధిలో కనిపిస్తుంటాయి. అవి... దురదలు : చర్మంలో బైల్ సాల్ట్స్ అధికంగా చేరడం వల్ల శరీరమంతటా దురదలు వస్తాయి. అలసట : స్పష్టమైన ఏ కారణం లేకుండానే విపరీతమైన అలసట కనిపిస్తుంది. బరువు తగ్గిపోతుంది. జ్వరం : హఠాత్తుగా జ్వరం వస్తుంది. వాంతులవుతాయి. నొప్పి : పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంది. మలమూత్రాల రంగు మారడం : సాధారణంగా కొద్దిపాటి లేత పసుపురంగుతో తేటగా ఉండే మూత్రం చిక్కగా గోధుమరంగులో వస్తుంది. అలాగే మలం పసుపు, ఆకుపచ్చ రంగులో ఉండటం కూడా కామెర్ల వ్యాధి లక్షణాలలో ముఖ్యమైనది. కారణాలు ప్రధానంగా రెండు కారణాల వల్ల జాండిస్ సోకుతుంది. వీటిలో మొదటిది శరీరంలోని బైలిరుబిన్ అత్యధికంగా ఉత్పత్తి అవుతుండటం. రెండో సహజంగా ఉత్పత్తి అవుతున్న బైలురుబిన్‌ను కాలేయం తొలగించలేకపోవడం. ఈ రెండు సందర్భాల్లోనూ బైలిరుబిన్ శరీర కణజాలంలో చేరి స్థిరపడుతుంది. కామెర్లవ్యాధి సోకిన వ్యక్తి శరీర అంతర్భాగంలో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. కాలేయం వాపు : ఇలా వాపు రావడం వల్ల బైలిరుబిన్‌ను గుర్తించి, దాన్ని తొలగించే సామర్థ్యం మందగించి, రక్తంలో ఆ వ్యర్థపదార్థం పరిమాణం పెరుగుతూపోతుంది. బైల్‌డక్ట్ వాపు : పైత్యరసం నాళం వాపు కారణంగా ఆ జీర్ణరసం స్రవించడానికీ, తద్వారా బైలిరుబిన్ తొలగించడానికి ఆటంకంగా తయారవుతుంది. దాంతో కామెర్ల వ్యాధి కనపడుతుంది. పైత్యరస నాళంలో అడ్డంకులు : ఇది బైలిరుబిన్‌ను తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. హీమోలైటిక్ అనీమియా : భారీసంఖ్యలో ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో పెద్దమొత్తంలో బైలిరుబిన్ తయారవుతుంది. మలేరియా, థలసేమియా వ్యాధుల వల్లగానీ లేదా కొన్ని రకాల ఔషధాల వల్ల ఎర్రరక్తకణాలు భారీగా విచ్ఛిన్నమవుతాయి. గిల్బర్ట్ సిండ్రోమ్ : వంశపారంపర్యంగా ఏర్పడే ఈ పరిస్థితి వల్ల పైత్యరసాన్ని విడుదల చేయగల ఎంజైముల సామర్థ్యం దెబ్బతింటుంది. కొలెస్టాటిస్ : ఈ కండిషన్లో కాలేయం నుంచి పైత్యరసం విడుదలకు అడ్డంకులు ఏర్పడతాయి. దాంతో కాంజెగేటెడ్ బైలిరుబిన్ విసర్జితం కావడానికి బదులు కాలేయంలోనే ఉండిపోతుంది. వయోజనుల్లో మరికొన్ని తీవ్రమైన కారణాల వల్ల కామెర్ల వ్యాధి వస్తుంది. వీటిలో కొన్ని ప్రాణాంతకమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. మితిమీరిన మద్యపానం (నాలుగేళ్లకు పైబడి), హెపటైటిస్ బి, సి వైరస్ల ఇన్ఫెక్షన్ల వల్ల ఎక్కువమంది కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. హెపటైటిస్ ఏ, ఈ వైరస్ల వల్ల కూడా కామెర్లు వస్తాయి. ఇవి ప్రమాదకరం. కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన హెపటైటిస్ ఏ, ఈ వైరస్లు శరీరంలోకి చేరుతుంటాయి. వ్యాధి నిర్ధారణ చాలా సందర్భాల్లో పేషెంట్ ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం, భౌతికంగా పరీక్షించడం, పొట్టదగ్గర పరిశీలించడం ద్వారా డాక్టర్లు కామెర్ల వ్యాధిని గుర్తిస్తారు. పొట్టలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, కాలేయం గట్టిపడిందా అని పరిశీలించి చూస్తారు. కాలేయం గట్టిగా మారడం సిర్రోసిస్ వ్యాధిని సూచిస్తుంది. అది అలా గట్టిగా మారడం క్యాన్సర్ లక్షణం. కామెర్ల తీవ్రతను తెలుసుకోడానికి చాలా రోగనిర్ధారణ పరీక్షలు ఉన్నాయి. వీటిలో మొదటిది లివర్ ఫంక్షన్ పరీక్ష. కాలేయం సరిగా పనిచేస్తున్నదీ లేనిదీ దీనితో వెల్లడవుతుంది. రోగిలో వ్యక్తమవుతున్న లక్షణాలకు కారణాలు బయటపడని పక్షంలో బైలిరుబిన్ పరిమాణం, రక్తపు తాజా పరిస్థితిని అర్థం చేసుకోడానికి బైలురుబిన్ టెస్ట్, ఫుల్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, హెపటైటిస్ వైరస్ల పరీక్షల వంటి వివిధ రకాల పరీక్షలను డాక్టర్లు సూచిస్తారు. నాళాలకు అడ్డంకులు ఏర్పడిన కారణంగా కామెర్లు వచ్చినట్లు అనుమానిస్తే ఎమ్మారై స్కాన్, అబ్డామినల్ అల్ట్రాసోనోగ్రఫీ, కాట్స్కాన్ వంటి పరీక్షలు చేయిస్తారు. సిర్రోసిస్, క్యాన్సర్, ఫాటీలివర్ ఏర్పడినట్లు అనుమానం కలిగితే బయాప్సీ చేయించాల్సిందిగా సూచిస్తారు. చికిత్స చాలామంది అవగాహన లేక జాండిస్‌కు నాటుమందులు వాడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. కామెర్లకు ఇప్పుడు మంచి చికిత్స అందుబాటులో ఉంది. కామెర్లకు సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. కామెర్లకు చికిత్స చేసే ముందర ఆ వ్యాధికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు పరీక్షలు జరుపుతారు. వాటిని అదుపుచేయడం, నివారించడానికి చికిత్స చేస్తారు. రక్తహీనత కారణంగా ఏర్పడిన కామెర్లను రక్తంలో ఎర్రరక్తకణాలను అభివృద్ధిపరచడం ద్వారా అదుపుచేస్తారు. ఇందుకు ఐరన్ సప్లిమెంట్లు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం సిఫార్సు చేస్తారు. హెపటైటిస్ కారణంగా వచ్చే కామెర్లను తగ్గించడానికి యాంటీవైరల్ మందులు, స్టెరాయిడ్స్ ఇస్తారు. నాళాలలో అడ్డంకుల కారణంగా కామెర్లు వస్తే, శస్త్రచికిత్స ద్వారా ఆ ఆటంకాలను తొలగిస్తారు.ఏమైనా మందులు వాటం వల్ల వాటిలోని రసాయనాల వల్ల కామెర్లు వస్తే మొదట వాటి వాడకాన్ని నిలిపేస్తారు. ప్రత్యామ్నాయ ఔషధాలను సిఫార్సు చేయడంతో పాటు వాటి దుష్ఫలితాలను తగ్గించేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు. హెపటైటిస్ ఏ, ఈ వైరస్ల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. దీనిలో హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి ప్రాణాపాయ ప్రమాదం ముంచుకువచ్చే అవకాశం ఉంది. కాలేయమార్పిడి మాత్రమే దీనికి నమ్మకమైన చికిత్స. సజీవులై వారి నుంచి లేదా బ్రెయిన్‌డెడ్ అయిన దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కాలేయంతో అవయవమార్పిడి ఆపరేషన్ చేస్తారు. డా. బి. రవిశంకర్, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
వికటించిన నాటు వైద్యం
కోహీర్(జహీరాబాద్): మండలంలోని మద్రి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని ప్రియాంక నాటు వైద్యం వికటించడంతో బుధవారం మృతి చెందింది. ఆమె గత కొంత కాలంగా కామెర్లతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు రెండు మూడు సార్లు నాటు వైద్యం చేయించినట్లు సమాచారం. అది వికటించడంతోనే విద్యార్థిని మృతి చెందినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం..మంగళవారం మధ్యాహ్నం పరీక్ష రాసి ఇంటికి వెళ్లిన ప్రియాంక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆటోలో జహీరాబాద్ ప్రభుథ్వాస్పత్రికి తరలించారు.డాక్టర్ల సూచన మేరకు బీదర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన అశోక్, లక్ష్మి దంపతుల కుమార్తె ప్రియాంక గురుజువాడ ప్రభుత్వోన్నత పాఠశాలలో 10 తరగతి చదివింది. దురదృష్టవశాత్తు ఒక పరీక్ష మిగిలి ఉండగానే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. తరగతిలో చురుకైన విద్యార్థుల్లో ఒకరైన ప్రియాంక ఎలాగైనా పాఠశాల ఫస్ట్ రావాలనే సంకల్పంతో చదివేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కామెర్లతో బాధపడుతున్న ప్రియాంకను ఆస్పత్రికి తీసుకెళ్లమని అనేక సార్లు తల్లిదండ్రులకు చెప్పానని, కానీ వారు నాటువైద్యాన్ని నమ్ముకోవడంతో అనార్థం జరిగిందని హెచ్ఎం జిన్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
వానల్లో ఆరోగ్యం జాగ్రత్త!!
హెల్త్ ఇన్ రెయిన్స్ అదేపనిగా కురిసే వానల మాటున కొన్ని రకాల జబ్బులు పొంచి ఉంటాయి. అలా జలజలా వాన కురవగానే ఇలా బిలబిలా ఈ జబ్బులు వచ్చేస్తుంటాయి. నేరుగా నీళ్లు కలుషితం కావడం వల్ల, దోమల కారణంగా, వాతావరణం చల్లబడటంతో వైరస్లు బలంగా ఉండటం వల్ల వ్యాధులు మామూలే. కుండపోతగా వర్షాలు కురుస్తున్న ఈ వాతావరణంలో ఒకింత అప్రమత్తంగా ఉండాలి. వర్షాలతో మన ఆరోగ్యం కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు మొదలు కాగానే నలువైపుల నుంచి నాలుగు రూపాల్లో వచ్చి పడతాయి వ్యాధులు. ఈ కింద పేర్కొన్న విభజన కేవలం మన సౌలభ్యం కోసమే. ఈ కింది వాటిలో దేనివల్లనైనా జ్వరాలు, జబ్బులు రావచ్చు. 1. నేరుగా నీటితో... గ్యాస్ట్రోఎంటిరైటిస్, టైఫాయిడ్, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ, లెప్టోస్పైరోసిస్ అనేవి నీళ్ల నుంచి పుట్టి, నీళ్లతో వ్యాపించే (వాటర్బార్న్) వ్యాధులు. 2. పరోక్షంగా నీటి వల్ల వ్యాప్తి చెందేవి... నేరుగా నీరు జబ్బులకు కారణం కాకపోయినా నీటి చినుకులు పరోక్షంగా ఈ వ్యాధుల వ్యాప్తికి తోడ్పడతాయి. ఈ సీజన్ దోమల బ్రీడింగ్‌కు తోడ్పడి వ్యాప్తి చెందే వులేరియూ, డెంగ్యూ, చికన్‌గున్యా వంటి వ్యాధులు వస్తాయి. నిజానికి... మలేరియా అనే వ్యాధి ప్రోటోజోవా పరాన్నజీవుల వల్ల వచ్చేది, చికన్‌గున్యా వైరస్‌తో వ్యాప్తి చెందేది. అతే ఇక్కడ ఈ వ్యాధుల వ్యాప్తికి వాన నీరు పరోక్ష కారణమై ఈ వ్యాధుల వాహకమైన దోమలు వృద్ధి చెందేలా చేస్తాయి. కాబట్టి వీటన్నింటికీ పరోక్షంగా వచ్చే జబ్బుల విభాగంలోకి చేర్చవచ్చు. 3. ఈ సీజన్లో వచ్చే వైరల్ ఫీవర్స్... ఇవన్నీ చాలా రకాల వైరస్‌లతో వస్తాయి. ఇందులో ఫ్లూ వంటి జ్వరాలు చాలా సాధారణమైనవి. 4. కలుషితమైన నీటి వల్ల... ఆహారం కలుషితం కావడంతో వచ్చే అమీబియాసిస్, జియార్డియాసిస్ వంటి వ్యాధులు కూడా ఈ సీజన్లో కనిపిస్తాయి. ఇవి వర్షాలలో కనిపించే వ్యాధుల్లో కొన్ని ముఖ్యమైనవి. 5. నేరుగా నీటితో... డయేరియా మదిరి అతిసారం అవుతుంది. వర్షాలొచ్చాక నీళ్లు కాస్తా కలుషితమై అవి తాగితే నీళ్ల విరేచనాలవుతాయి. అవి కాస్తా వురింత ఎక్కువై- విరేచనాలకు తోడు వాంతులూ జతగూడితే అదే గ్యాస్ట్రోఎంటిరైటిస్. కొన్ని సందర్భాల్లో జ్వరం రావడం, శరీరం నుంచి నీరు ఎక్కువగా బయుటకు వెళ్తే వుూత్రపిండాలు దెబ్బతినడం కూడా జరగవచ్చు. జాండీస్ రూపంలో : హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ వైరస్ల వల్ల వచ్చే ఈ రెండు వ్యాధులు కామెర్ల రూపంలో తవు లక్షణాల్ని చూపుతాయి. ఆకలి వుందగించడం, వికారం, మాత్రం పచ్చగా రావడంతో పాటు జ్వరం, వాంతుల వంటి లక్షణాలు ఈ వ్యాధుల్లో ఉంటాయి. * టైఫాయిడ్ కాస్తా ఎంటిరిక్ ఫివర్ అంటూ ఎంట్రీ ఇచ్చేస్తుంది. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియూ వల్ల వచ్చే ఇది దీర్ఘకాలం జ్వరం (ప్రొలాంగ్డ్ ఫీవర్), తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పితో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాల కూడా ఉంటాయి. * లెప్టోస్పైరోసిస్ అనేది బ్యాక్టీరియూ వల్ల వచ్చే వ్యాధి. వర్షాలకు ఎలుకల వంటివి ఇళ్లలోకి రావడంతో వాటి మాత్రంలో ఉండే బ్యాక్టీరియూ నీళ్ల వల్ల ఆహారపదార్థాలను చేరి కలుషితం చేస్తుంది. పైగా ఈ సీజన్లో సీవరేజ్ గుంటల్లో దిగి పనిచేసేవారికి కలుషితమైన నీటి కారణంగా త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. నీళ్లలో నిత్యం తిరిగే రైతులూ, కూలీలకూ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువే. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతుల రూపంలో లక్షణాలు కనిపిస్తాయి. కడుపునొప్పి, కళ్లెర్రబారటం, కళ్లు పచ్చగావూరడం వంటి లక్షణాలూ ఉంటాయి. దోమలు జ్వరాలకు ఫ్రెండ్స్... ఈ జ్వరాలదీ, వానలదీ పరోక్ష సంబంధం. వర్షం కురిసి నీళ్లు చేరడం వల్ల దోమల వంటి కొన్ని కీటకాల గుడ్లు పొదిగేందు (బ్రీడింగ్)కు అవకాశం చిక్కుతుంది. దాంతో వచ్చేవే మలేరియూ, చికన్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు. * మలేరియా అన్నది ప్రోటోజోవా అనే ఏకకణ పరాన్నజీవి అనాఫిలస్ దోవుతో వల్ల వ్యాప్తి చెంది వస్తుంది. వ్యాధి మదిరి తలకెక్కితే సెరెబ్రల్ వులేరియూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్-ఏఆర్డీఎస్), స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్), ఒక్కోసారి కామెర్లూ రావచ్చు. * చికన్‌గున్యా వైరస్ ఎడిస్ ఈజిప్టై అనే దోమ ద్వారా వ్యాప్తి చెంది వస్తుంది. ఓ ఏడాదీ, రెండేళ్ల క్రితం తన సత్తా ఏమిటో సవుస్త జనాలకూ చూపెట్టిన ఈ వ్యాధి కూడా నీళ్లు చేరడంతో దోమలు పెరిగి వస్తుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయి కీళ్లనొప్పులు లక్షణాలుగా ఇది తన తీవ్రత చూపుతుంది. * డెంగ్యూ పేరెత్తితేనే ఇప్పుడు దడ పుడుతోంది. ఇదీ దోవుల్లోనే ఒక రకమైన దోమ అయిన ఏడిస్ ఈజిప్టై వల్ల వ్యాప్తి చెందుతుంది. జ్వరం, తలనొప్పి వంటివి దీని లక్షణాలు. వాటితో పాటు ఎముకలు విరిచినంత నొప్పి వస్తుంది కాబట్టే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావానికి కారణవతుంది. శరీరానికి షాకిచ్చి అపస్మారక స్థితిలోకి నెట్టి ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారి తీస్తుంది. అంచెలంచెల తీవ్రతతో ప్రభావం చూపే మూడు దశల వ్యాధినే డెంగ్యూ క్లాసికల్ ఫీవర్, డెంగ్యూ హ్యావురేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు. నీళ్ల జల జల... వైరస్‌లతో విలవిల... ఈ వానల్లో వైరస్లు విపరీతంగా విజృంభిస్తాయి. ఇవన్నీ ఫ్లూ లాంటి జ్వరాలే. ఈ వైరస్ వల్ల వచ్చే జ్వరాలు ఫ్లూ లక్షణాలను చూపి ఈ సీజనంతా హడలగొట్టేస్తాయి. జ్వరంతో ఒళ్లు పెనంలా కాల్చడమే కాదు. వాంతులు విరేచనాలతో శరీరంలోని నీటిని బయటకు పంపేసి డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. అయితే వీటిలో చాలావరకు తవుంతట తామే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) జ్వరాలే. పరాన్నజీవులతో ఎన్నో వ్యాధులు * బయట ఏదైనా తింటే చాలు... అమీబియూసిస్ ఈ సీజన్లో తప్పక కనిపించే అవకాశం ఉంది. ఎంటమిబా హిస్టలిటికా అనే అమీబాలాంటి ఈ పరాన్నజీవి నీళ్లు, ఆహారం కలుషితమైన కారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కడుపులోకి చేరగానే ఎక్కువగా విరేచనాలు అవుతాయి. దీనికి తోడు కడుపునొప్పి, ఆకలిలేమి, బరువు తగ్గడం కూడా ఉండొచ్చు. * జియార్డియా అనే ఏకకణ జీవి కూడా అమీబియాసిస్లాంటి జబ్బే వస్తుంది. అయితే జియార్డియా వల్ల వస్తుంది కాబట్టి దీన్ని జియార్డియాసిస్ అంటారు. ఇది ఒళ్లంతా దురదలు పుట్టిస్తుంది. కడుపులో ఉన్న సూక్ష్మజీవి వల్లగాక ఏదైనా చర్మవ్యాధి వల్లనేమోనని పొరబడేలా ఈ దురదలు ఉంటాయి. వాన సమయంలో వ్యాధుల నుంచి జాగ్రత్తలిలా... చేయాల్సినవి... ⇒ ఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం. ⇒ వాటర్‌ను డిస్ ఇన్ఫెక్ట్ చేయుడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది. ⇒ తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. ⇒ మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. ⇒ పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ⇒ ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ⇒ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మల, మూత్ర విసర్జనకు ముందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కోవాలి. ⇒ పాత్రలు శుభ్రం చేసే సవుయుంలో సబ్బు లేదా డిటర్జెంట్ వాడండి. చేయకూడనివి... ⇒ కుండల్లో లేదా బిందెల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగకండి. ⇒ బయుటి ఆహార పదార్థాలు ఈ సీజన్లో వద్దు. ⇒ చల్లారిన ఆహారాన్ని మాటిమాటికీ వేడి చేసుకొని తినవద్దు. ⇒ పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకండి. ⇒ హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులను ఈ సీజన్లో వాడకండి. ⇒ కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయువద్దు. మట్టితో చేతులు, పాత్రలు శుభ్రం చేయవద్దు. - డాక్టర్ సి.హెమంత్ సీనియర్ ఫిజీషియన్,యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ,హైదరాబాద్ -
పచ్చకామెర్లతో దంపతుల మృతి
-
పచ్చకామెర్లతో దంపతుల మృతి
గజపతినగరం రూరల్ : పచ్చకామర్లెతో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొంపరాము (40), గొంప పాపమ్మ(36)లకు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. అప్పటికే రాము పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల వ్యాధి తీవ్రం కావడంతో రాము విశాఖపట్నంలోని ఆస్పత్రిలో, పాపమ్మ విజయనగరం కేంద్రాస్పత్రిలో ఆదివారం మృతి చెందారు. మృతులకు నలుగురు కుమార్తెలుండగా, ఒకరికి వివాహం జరిగింది. మిగిలిన ముగ్గురు చదువుకుంటున్నారు. -
లివర్ దెబ్బతింటే...
లివర్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. గృహిణిని. నాకు చిన్నప్పుడు, యుక్త వయసులో చాలాసార్లు జాండీస్ వచ్చాయి. అప్పట్లో పసరువైద్యం చేశారు. అయితే ఈమధ్య ఆకలి మందగించడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే కడుపునొప్పి, ఏ చిన్న పని చేసినా తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి, నా లివర్ పూర్తిగా పాడైపోయిందనీ, అందువల్లనే నేను తరచుగా అనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - అంజలి, వైజాగ్ లివర్ పాడవడానికి అనేక కారణాలున్నాయి.ఎక్కువ శాతం మంది హెపటైటిస్- బీ, హెపటైటిస్-సి వైరస్ సోకడం, జన్యుపరమైన సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీరు చిన్నప్పటి నుంచే కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ముందుగా కాలేయ నిపుణుడిని కలవండి. కంప్లీట్ బ్లడ్ టెస్ట్స్ నిర్వహించి మీ లివర్ ఎంతమేరకు చెడిపోయింది, ఎలా దెబ్బతిన్నదనే అంశాలను ప్రాథమికంగా గుర్తించాలి. ఆ తర్వాతే మీకు ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ లివర్ పాక్షికంగానే దెబ్బతింటే మందుల ద్వారా దానిని సరిచేయవచ్చు. అలా కాకుండా మీ లివర్ పూర్తిగా పాడైపోయి ఇక పనిచేయని తేలితే మాత్రం ‘లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. అలాంటి పరిస్థితి వస్తే దీనికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్గ్రూప్కి సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్ డోనార్’ ప్రక్రియ అంటారు. ఇది చాలా సురక్షితమైన విధానం. ఇది కాకుండా ‘కెడావర్ ఆర్గాన్ విధానం ద్వారా కూడా సర్జరీ చేయించుకోవచ్చు. దీనికోసం ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మరణానంతరం అవయవదాతల నుంచి లివర్ లభ్యమైనప్పుడు మాత్రమే ఇలా లివర్ లభించే అవకాశం ఉంది. కెడావర్ ఆర్గాన్ పద్ధతిలో అవయవాల లభ్యత తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పేషెంట్లు ‘లైవ్ డోనార్’ పైనే ఆధారపడుతున్నారు. మీరు తక్షణమే మీ సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోండి. ఒకవేళ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చినా ఆందోళన అవసరం లేదు. ఈ సర్జరీ సక్సెస్ రేటు 90 శాతం ఉంటుంది. కాకపోతే లివర్ అనేది చాలా సున్నితమైన అవయవం. కాబట్టి అధునాతనమైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ నిర్వహిస్తే రిస్క్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా లివర్ స్పెషలిస్ట్‌ను కలవండి. డాక్టర్ బాలచంద్రమీనన్ చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. ఎత్తు ఐదు అడుగులు. బరువు 92 కేజీలు. నా బరువు తగ్గడానికి ఆయుర్వేద మందులు, ఆహారం గురించి తెలియజేయగలరు. - అరుణాగాయత్రి, హైదరాబాద్ భౌతిక లక్షణాల్లో మనిషి మనిషికీ తేడాలు కనిపిస్తుంటాయి. ఆయుర్వేద సూత్రాలరీత్యా ఇవి వారి ‘ప్రకృతి, సార, సత్వం’ లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి. (అంటే శరీరతత్వం, సప్తధాతువుల్లోని భేదం, మానసిక తత్వం). మీ ఎత్తునుబట్టి మీరు ఉండాల్సిన దానికంటే సుమారు 35 కేజీల బరువు ఎక్కువగా ఉన్నారు. హైపోథైరాయిడిజం కుషింగ్ సిండ్రోమ్, పీసీఓడీ, రక్తహీనతల వంటి ప్రాథమిక రోగాలు, కొన్ని మందుల దుష్ర్పభావాలు కూడా అధిక బరువుకు కొన్ని కారణాలు. అవి లేనప్పుడు మన బరువు ఆహార విహారాలపైనే ఆధారపడి ఉంటుంది. స్థౌల్య కారణాలు: శారీరక శ్రమ లేకుండటం, పగటిపూట అధిక నిద్ర, కఫవృద్ధికర ఆహార సేవన... అంటే గుర్వాహారం (కొవ్వులు, మధుర ద్రవ్యాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినడం) (మాధవ నిదానం: అవ్యాయామ దివాస్వప్న శ్లేష్మలాహార సేవినః మధురోన్న రసః ప్రాయః స్నేహాత్ మేదః ప్రవర్ధయేత్) లక్షణాలు: ఆకలి, దప్పిక ఎక్కువగా ఉండటం, శరీరం లావెక్కడం, ఉత్సాహం లేకపోవడం వంటివి. చికిత్స: ఈ చికిత్స నియమాలు రోగికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎలాగంటే... ఉదాహరణకు గుర్వాహారం తినకూడదు, వ్యాయామం చాలా అవసరం (స్థూలకాయం వల్ల ఇది ప్రాణసంకటంగా ఉంటుంది). స్థౌల్యం తగ్గాలనే ప్రగాఢ కాంక్ష రోగికి కలిగేట్టు స్ఫూర్తినివ్వాలి (నిరుత్సాహం స్థూలకాయుల్లో ప్రధాన లక్షణం). అందుకే చరక మహర్షి స్థౌల్యాన్ని అత్యంత నిందితావస్థగా ఉటంకించాడు. ఈ సందర్భంలో వాగ్భటుడు ‘స్థౌల్యం కంటే కృశత్వమే వరం, స్థూలునికి మందుల్లేవు’ అని అతిశయోక్త్యలంకారంలో చెప్పాడు. (కార్శ్య మేవ వరం స్థౌల్యాత్, నహి స్థూలస్య భేషజం). ఈ చికిత్సలో ఆహార విహారాలు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఔషధాలది మూడో స్థానం మాత్రమే. 1. ఆహారం: పోషక విలువలుండాలి; కొవ్వులు మధురరసాయలు ఉండకూడదు. కాబట్టి ఉడికించని పచ్చి ఆహారం మంచిది. అవి... మొలకలు, క్యారట్, బీట్రూట్, దోసకాయ, టమాటా వంటి సలాడ్సు, తాజా ఫలాలు, కూరగాయల పచ్చిరసాలు. 2. వండిన ఆహారం: ఉప్పు, నూనెలు లేకుండా ఉడికించిన కూరగాయలు, పుల్కాలు, ముడిబియ్యపు అన్నం, పొట్టుతో కూడిన పప్పులు, ఆకుకూరలు. 3. పానీయాలు: గంజి, జావలు, ఉలవచారు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, కొంచెం తేనె కలిపిన గోరువెచ్చని నీరు. ఇలాంటి లఘ్వాహారంతో ఆకలిని నియంత్రించి జయించాలేగానీ... ఆకలిని అణచివేసే ద్రవ్యాల్ని ప్రయోగించడం శాస్త్రవిరుద్ధం. ఉప్పుని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. స్థౌల్యహర ద్రవ్యాలు: పసుపు, వెల్లుల్లి, గోధుమలు, బార్లీ, ఉలవలు, వేడినీరు. విహారం: ఏదో ఒక రూపంలో చెమట పట్టేలా తగినంత పరిశ్రమ చేయాలి. క్రమక్రమేణా వ్యాయామాలను పెంచాలి. పగలు నిద్రపోవద్దు. ప్రాణాయామం రెండుపూటలా తప్పనిసరిగా చేయాలి. ఔషధాలు: త్రిఫల / నవక గుగ్గులు (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 మేదోహర విడంగాది లోహం (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 తిప్పతీగ, తుంగముస్తలు, శొంఠి త్రవ్యాలతో చేసిన కషాయం రోజూ పరగడుపున 30 మిల్లీలీటర్లు తాగాలి. పంచకర్మలు: ఉద్వర్తనం (చూర్ణాలతో నలుగుపెట్టడం) స్వేదకర్మ (చెమట పట్టేట్టు చేయడం) అవసరాన్ని బట్టి వమన, విరేచన, వస్తికర్మల వల్ల గణనీయమైన ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి. గమనిక: బరువు తగ్గడమనేది క్రమబద్ధంగా జరగాల్సిన దీర్ఘకాలపు ప్రక్రియ. రాత్రికి రాత్రి బరువు తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. అది అశాస్త్రీయం, ప్రమాదభరితం. అధికబరువు వల్ల గుండెపోటు, పక్షవాతం రావచ్చు. ఆయాసం, నీరసం, సంభోగశక్తి తగ్గిపోవడం వంటి ఉపద్రవాలుంటాయి. బరువు పెరగకుండా జాగ్రత్తవహించడం శ్రేయస్కరం. అది మన చేతుల్లోనే ఉంది. మొండిగా, అదేపనిగా ఉపవాసాల వల్ల ప్రయోజనం ఉండదు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
నియోనేటాలజీ : కొత్త బంగారాలకు కొండంత అండ!
మీరు కొన్ని కార్ల వెనక రాసి ఉండే కామెంట్లు చదివే ఉంటారు. అప్పటివరకూ అది మామూలు కారు. కానీ పొత్తిళ్ల బిడ్డ ఎక్కగానే అది పూలతేరు. అలాగ మారిన ఆ తీరు చూసీ, వెనక ‘బి కేర్‌ఫుల్... బేబీ ఆన్ బోర్డ్’ లాంటి బోర్డులు చూసీ ఇక చేసేదేమీ లేక మురిపెంగా, ఆనందంగా విసుక్కుంటూ బుజ్జి వీఐపీగారికి దారినిస్తాం. అలాంటి చిన్నారులకూ వైద్యపరమైన అవసరాలు వస్తూ ఉంటాయి. ఇలా పుట్టీ పుట్టగానే కేర్‌కేర్‌మంటూ సదరు బుజ్జాయి చేసే మెడికల్ డిమాండ్లను తీర్చే వైద్యవిభాగమే నియోనేటల్ కేర్. ఎందుకీ నియోనేటల్ కేర్...? కొందరు బుజ్జాయిలు తల్లి కడుపులో ఉన్నప్పట్నుంచే... పుట్టీ పుట్టగానే తమకు అవసరమైన వైద్యసహాయాన్ని కోరతారు. ఉదాహరణకు... సాధారణంగా తల్లికి హైబీపీ ఉన్నప్పుడు బిడ్డ చాలా తక్కువ సైజుతో పుట్టవచ్చు. ఈ బిడ్డను ఐయూజీఆర్ బేబీ అంటారు. ఒకవేళ తల్లికి షుగర్ ఉంటే పుట్టబోయే బిడ్డ మరీ చిన్నగానైనా ఉండవచ్చు లేదా చాలా భారీగానైనా ఉండవచ్చు. ఇలాంటి భారీ పరిమాణంలో ఉండే బిడ్డను మ్యాక్రోజోమిక్ బేబీ అంటారు. అందరూ అనుకున్నదానికి భిన్నమైన పరిణామం ఏమిటంటే... షుగర్ ఉన్న తల్లికి పుట్టిన బిడ్డలో చక్కెరపాళ్లు చాలా తక్కువగా ఉండవచ్చు. ఇలాంటి పిల్లలకు పుట్టగానే వైద్యుల పర్యవేక్షణ, వైద్యం చేసేందుకు ప్రత్యేక ప్రదేశం కావాలి. ఆ ప్రదేశమే లెవెల్-త్రీ నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లలు మొదలుకొని, వాళ్లకు 28 రోజుల వయసు వచ్చే వరకు వచ్చే వైద్య సమస్యలకు చికిత్స చేసే డాక్టర్లను నియోనేటాలజిస్టులు అంటారు. ఇందుకు అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రమే నియోనేటాలజీ. దీని ప్రాధాన్యం ఏమిటంటే... సంభవించే శిశుమరణాలలో మూడోవంతు బిడ్డ పుట్టిన మొదటిరోజే జరుగుతుంటాయి. వాటిని నివారించడం చాలా అవసరం. ఇవి మన దేశంలో మరింత అవసరం. ఎందుకంటే... ప్రపంచవ్యాప్తంగా... పుట్టిన నాలుగు వారాల్లోపే చనిపోయే నలుగురు శిశువుల్లో ఒకరు మనదేశానికి చెందినవారే. పుట్టగానే బిడ్డకు అవసరమైన చర్యలూ, సపర్యలూ... పుట్టిన బిడ్డకు ఆహారం ఇవ్వడంలో భాగంగా రొమ్ముపాలు పట్టించడం అవసరం. సాధారణ ప్రసవం అయితే బిడ్డ పుట్టిన అరగంటకు రొమ్ముపాలు పట్టించాలి. శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీస్తే (సిజేరియన్ అయితే) గంట తర్వాత బిడ్డకు రొమ్ముపాలు ఇవ్వాలి. ఇలా రొమ్ము పాలు ఇవ్వడమే గొప్పచికిత్స. ఎందుకంటే ఈ పాలలో ఎన్నో రకాల అలర్జీలను, ఆస్తమాను, వైరస్‌లను, బ్యాక్టీరియాలను, ఎన్నెన్నో జబ్బులను, రుగ్మతలను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కొందరు బిడ్డలు కారణం లేకుండానే మరణిస్తుంటారు. ఈ కండిషన్‌ను ‘సడన్ ఇన్ఫేంట్ డెత్ సిండ్రోమ్’ (ఎస్ఐడీఎస్-సిడ్స్) అంటారు. రొమ్ముపాలు పట్టించడం బిడ్డకు ఆహారం కోసం మాత్రమే కాదు... ఈ రుగ్మతను ఎదుర్కోడానికి కూడా! కాకపోతే పుట్టినబిడ్డకు తల్లి రొమ్ము పట్టించడంలో ఇటు తల్లికీ, అటు బిడ్డకూ కొంత శిక్షణ అవసరం. విచిత్రం ఏమిటంటే... తల్లికంటే బిడ్డ కాస్త త్వరగా నేర్చుకుంటుంది. బిడ్డ ఎదుర్కొనే మొదటి వైద్య సమస్య... జాండీస్ అసలే బంగారుకొండ... దాన్ని మరింత స్వర్ణమయం చేయడానికి, మొదటి గండం పసుపు వర్ణంతో వచ్చి బిడ్డను అలదుకుంటుంది. దాన్నే మనం పుట్టుకామెర్లు అంటుంటాం. ఇంగ్లిష్‌లో జాండిస్ అని పిలిచే ఇవి... పుట్టిన ఒకటి రెండు రోజుల్లో దాదాపు 60 శాతం బిడ్డల్లో కనిపిస్తుంటాయి. బిడ్డ పుట్టగానే ఎదురయ్యే మొట్టమొదటి వైద్య సమస్య కావడంతో కొత్తగా తల్లులైన వారు బిడ్డకు వచ్చిన ఈ పరిస్థితితో బెంబేలెత్తుతారు. చిన్నారులందరికీ దాదాపుగా వచ్చే ఈ వ్యాధి పట్ల మనలో చాలామందికి అనేక అపోహలున్నాయి. వాటి కారణంగా మనం చేసే కొన్ని గృహవైద్యాలు, చిట్కావైద్యాలు ఒక్కోసారి వికటించి, చిన్నారులకు ప్రమాదంగా పరిణమించవచ్చు. అందుకే ఈ తొలివ్యాధి, దానికి సంబంధించిన అపోహలు, వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకీ పుట్టుకామెర్లు: ‘అసలు అప్పుడే పుట్టినబిడ్డకు ఎందుకిలాంటి సమస్య రావాలి?’ అన్నది చాలామందిలో మెదిలే సందేహం. బిడ్డ అప్పుడే పుట్టడం వల్ల ఆ చిన్నారి కాలేయానికి బిడ్డలో స్రవించే బిలురుబిన్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఇంకా అలవడదు. దాంతో అది చిన్నారుల రక్తంలో కలుస్తుంది. అందుకే ఇవి కనిపిస్తాయి. అయితే సమయం గడుస్తున్న కొద్దీ కాలేయం తన పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలా కనిపించిన కామెర్లు ఒకటి, రెండువారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. సాధారణంగా ఈ పుట్టుకామెర్లు బిడ్డ పుట్టిన మూడోరోజున కనిపించి, ఐదో రోజున ఉద్ధృతంగా ఉండి, ఏడోరోజు నుంచి క్రమంగా తగ్గడం మొదలవుతాయి. పుట్టుకామెర్లకు చికిత్స : నిజానికి జీవకార్యకలాపాల్లో కొద్దిపాటి సామర్థ్యలోపం వల్ల వచ్చే ఈ కామెర్ల (ఫిజియలాజికల్ జాండీస్)కు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. అయితే కొద్ది మందిలో ఈ పరిస్థితి విషమించవచ్చు. ఇలాంటి కామెర్లను పాథలాజికల్ / ఎగ్జాగరేటెడ్ జాండీస్‌గా చెబుతారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి... పుట్టిన బిడ్డకు ఉన్న బ్లడ్గ్రూప్కీ, రక్తంలోకి స్రవించిన బిలురుబిన్కీ సయోధ్య కుదరకపోవడం (బ్లడ్ గ్రూప్ ఇన్‌కంపాటబిలిటీ), తల్లులు బిడ్డలకు సరైన రీతిలో పాలు పట్టకపోవడం కారణంగా బిడ్డల్లో ద్రవాల, ఖనిజ లవణాల లోపం రావడం (డీ-హైడ్రేషన్), బిడ్డలో స్రవించే జీ6పీడీ అనే ఎంజైమ్ లోపించడం కారణంగా కామెర్లు మరింత ముమ్మరం కావచ్చు. పై పరిస్థితికి చికిత్స చాలా సులభం. బిడ్డలో స్రవించే అదనపు బిలురుబిన్‌ను తొలగిస్తే చాలు. దీనికి చేయాల్సింది కూడా చాలా సులువు. బిడ్డలో తగినంతగా ద్రవాలు నింపగలిగితే చాలు. అంటే బిడ్డకు కడుపునిండా పాలుపట్టడమే మంచి చికిత్స అవుతుందన్నమాట. ఇక దీనికితోడుగా బిడ్డను కొన్నిరకాల కాంతిపుంజాలకు ఎక్స్పోజ్ చేసే ఫోటోథెరపీతోనూ మంచి ప్రయోజనం ఉంటుంది. పరిస్థితి మరింత తీవ్రం అయినప్పుడు బిడ్డకు రక్తమార్పిడి (బ్లడ్ ఎక్స్ఛేంజ్ ట్రాన్స్ఫ్యూజన్) చికిత్స చేస్తారు. ఇంత సులభంగా పరిష్కరించగల ఈ సమస్యను కొందరు తమ అపోహలతో, మూఢనమ్మకాలతో జటిలం చేస్తుంటారు. ఆ అపోహలు, వాస్తవాలు ఈ పక్కనున్న పట్టికల్లో... 1. అపోహ: తల్లి పాలతో బిడ్డలో కామెర్లు మరింతగా పెరుగుతాయి. వాస్తవం: నిజానికి తల్లిపాలతో ఎలాంటి హానీ ఉండదు. పైగా బిడ్డకు తగినన్ని ద్రవాలు సమకూరి, జాండీస్ తగ్గడానికి ఉపకరిస్తుంది. అందుకే తల్లి మరింతగా ద్రవాహారం తీసుకుంటూ, రొమ్ముపాల ద్వారా బిడ్డకు అవసరమైన ద్రవాలు అందేలా చూడాలి. 2. అపోహ: బిడ్డకు నీళ్లు / కొన్ని ద్రవాల మిశ్రమాన్ని పట్టించడం ద్వారా కామెర్లకు చికిత్స చేయవచ్చు. వాస్తవం: నవజాత శిశువులకు తల్లిపాలకు మించిన ఆహారం లేదు. కృత్రిమ ఆహారాలు, ఫార్ములా మిల్క్‌లు తల్లిపాలకు సాటిరావు. కాబట్టి నీళ్లు పట్టించడం, ఏవైనా ద్రవాల మిశ్రమాలు నవజాత శిశువుకు ఇవ్వడం ఏవిధంగానూ మంచిది కాదు. 3. అపోహ: లేత ఎండ కాంతి పుట్టుకామెర్లకు మంచి చికిత్స. వాస్తవం: ఇది కొద్ది మేరకే సత్యం. నిజానికి చికిత్స అవసరమైన తీవ్రతతో జాండీస్ ఉన్నప్పుడు ఇది ఉపకరించదు. స్వాభావికంగా లభ్యమయ్యే లేతఎండ ద్వారా చర్మం గ్రహించే కాంతితోనే పని జరగదు. అందుకే జాండీస్ తగ్గించేందుకు అవసరమైనంతగా ప్రభావితం చేయగల ఫొటో థెరపీని బిడ్డకు అందించాలి. దీనికి బదులు బిడ్డను ఎండకు చూపిస్తూ ఉండటం వల్ల ఒక్కోసారి బిడ్డకు ఎండవల్ల చర్మం కమిలిపోవడం (సన్‌బర్న్స్)తో పాటు డీ-హైడ్రేషన్ సంభవించవచ్చు. 4. అపోహ: కొందరు తల్లులు ఆసుపత్రిలో ఇచ్చే కాంతి పుంజాల వంటి చికిత్సను తమ ఇంటిలోని ట్యూబ్‌లైట్ కాంతితోనూ చేయవచ్చని అనుకుంటారు. వాస్తవం : నిజానికి చూడటానికి ఆసుపత్రిలో చికిత్సకు ఉపయోగించే లైట్... మన ఇంట్లోని ట్యూబ్‌లైట్ ఒకేలా అనిపించినా, ఆ కాంతి తాలూకు తరంగాల దైర్ఘ్యం వేరుగా ఉంటుంది. అందుకే సరైన తరంగదైర్ఘ్యం (వేవ్‌లెంగ్త్) ఉన్న కాంతితో ఈ చికిత్స చేయడం వల్లనే అది బిడ్డపై మంచి ప్రభావం చూపుతుంది. 5. అపోహ: పుట్టుకామెర్ల వల్ల బిడ్డల మెదడు దెబ్బతింటుంది. వాస్తవం: ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. ఇది కేవలం జీవక్రియలకు సంబంధించిన చిన్న అంశం. పైగా పుట్టుకామెర్లు అన్న స్థితి చాలా తాత్కాలికం. కాబట్టి పిల్లల మెదడు దెబ్బతినడం అన్న ప్రసక్తి ఉండదు. కాకపోతే చాలా కొద్దిమంది పిల్లల్లో బిలురుబిన్ పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం, ఆ సమస్యకు చికిత్స జరగకపోవడం వంటి అరుదైన సందర్భాల్లో ఈ పరిస్థితి కొందరిలోనే రావచ్చు. మినహాయింపు ఆ ఒక్కసారే... కొందరిలో చాలా చాలా అరుదుగా తల్లిపాల వల్లనే కామెర్లు ముమ్మరం అవుతాయి. తల్లిపాలలో ఉండే ఒక పోషకం బిలురుబిన్ చక్కగా ప్రాసెస్ అవడానికి అవరోధమవుతుంది. అలాంటి చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే బిడ్డకు పాలు పట్టించ వద్దంటూ డాక్టర్లు సలహా ఇస్తారు. అయితే ఇది ఇలా జరిగాక కూడా తల్లిపాల వల్ల జరిగే మిగతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తల్లి పాలు పట్టడం తప్పక కొనసాగించాలని డాక్టర్లు చెబుతారు. మన ప్రపంచంలోకి మరో ప్రాణి వచ్చీ రాగానే... ఆ చిన్నారి కాస్తా అందరికీ ప్రత్యేకం అయిపోతుంది. అప్పటివరకూ పెద్దాయన కేకేస్తేనే మనమంతా హడలిచచ్చేవాళ్లం...అంతటి ఆయనే ఇప్పుడు కొత్త బుజ్జాయికి కట్టుబానిసవుతాడు. అంతవరకూ నానమ్మ అడుగులకు మనం మడుగులొత్తుతామా... అలాంటిది ఆమే పూనుకుని బుడతడికి ఊడిగం చేస్తుంది. అంతటి బుడుగులు మనింటికి వేంచేసి, మురిపించబోతున్నప్పుడు వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన సపర్యలూ తెలిపే నియోనేటాలజీ గురించి తెలుసుకుందాం... డాక్టర్ టి.పి. కార్తీక్ పీడియాట్రిషియన్ - నియోనేటాలజిస్ట్ యశోదా హాస్పిటల్స్, సికింద్రాబాద్.