వానల్లో ఆరోగ్యం జాగ్రత్త!! | Health in Rain | Sakshi
Sakshi News home page

వానల్లో ఆరోగ్యం జాగ్రత్త!!

Published Sat, Sep 24 2016 12:24 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

వానల్లో ఆరోగ్యం జాగ్రత్త!! - Sakshi

వానల్లో ఆరోగ్యం జాగ్రత్త!!

హెల్త్ ఇన్  రెయిన్స్
అదేపనిగా కురిసే వానల మాటున కొన్ని రకాల జబ్బులు పొంచి ఉంటాయి. అలా జలజలా వాన కురవగానే ఇలా బిలబిలా ఈ జబ్బులు వచ్చేస్తుంటాయి. నేరుగా నీళ్లు కలుషితం కావడం వల్ల, దోమల కారణంగా, వాతావరణం చల్లబడటంతో వైరస్‌లు బలంగా ఉండటం వల్ల వ్యాధులు మామూలే. కుండపోతగా వర్షాలు కురుస్తున్న ఈ వాతావరణంలో ఒకింత అప్రమత్తంగా ఉండాలి. వర్షాలతో మన ఆరోగ్యం కొట్టుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
వర్షాలు మొదలు కాగానే నలువైపుల నుంచి నాలుగు రూపాల్లో వచ్చి పడతాయి వ్యాధులు. ఈ కింద పేర్కొన్న విభజన కేవలం మన సౌలభ్యం కోసమే. ఈ కింది వాటిలో దేనివల్లనైనా జ్వరాలు, జబ్బులు రావచ్చు.
 
1. నేరుగా నీటితో...
గ్యాస్ట్రోఎంటిరైటిస్, టైఫాయిడ్, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ, లెప్టోస్పైరోసిస్ అనేవి నీళ్ల నుంచి పుట్టి, నీళ్లతో వ్యాపించే (వాటర్‌బార్న్) వ్యాధులు.
 
2. పరోక్షంగా నీటి వల్ల వ్యాప్తి చెందేవి...
నేరుగా నీరు జబ్బులకు కారణం కాకపోయినా నీటి చినుకులు పరోక్షంగా ఈ వ్యాధుల వ్యాప్తికి తోడ్పడతాయి. ఈ సీజన్ దోమల బ్రీడింగ్‌కు తోడ్పడి వ్యాప్తి చెందే వులేరియూ, డెంగ్యూ, చికన్‌గున్యా వంటి వ్యాధులు వస్తాయి. నిజానికి... మలేరియా అనే వ్యాధి ప్రోటోజోవా పరాన్నజీవుల వల్ల వచ్చేది, చికన్‌గున్యా వైరస్‌తో వ్యాప్తి చెందేది. అతే ఇక్కడ ఈ వ్యాధుల వ్యాప్తికి వాన నీరు పరోక్ష కారణమై ఈ వ్యాధుల వాహకమైన దోమలు వృద్ధి చెందేలా చేస్తాయి. కాబట్టి వీటన్నింటికీ పరోక్షంగా వచ్చే జబ్బుల విభాగంలోకి చేర్చవచ్చు.
 
3. ఈ సీజన్‌లో వచ్చే వైరల్ ఫీవర్స్...
ఇవన్నీ చాలా రకాల వైరస్‌లతో వస్తాయి. ఇందులో ఫ్లూ వంటి జ్వరాలు చాలా సాధారణమైనవి.
 
4. కలుషితమైన నీటి వల్ల...
ఆహారం కలుషితం కావడంతో వచ్చే అమీబియాసిస్, జియార్డియాసిస్ వంటి వ్యాధులు కూడా ఈ సీజన్‌లో కనిపిస్తాయి. ఇవి వర్షాలలో కనిపించే వ్యాధుల్లో కొన్ని ముఖ్యమైనవి.
 
5. నేరుగా నీటితో...
డయేరియా మదిరి అతిసారం అవుతుంది. వర్షాలొచ్చాక నీళ్లు కాస్తా కలుషితమై అవి తాగితే  నీళ్ల విరేచనాలవుతాయి. అవి కాస్తా వురింత ఎక్కువై- విరేచనాలకు తోడు వాంతులూ జతగూడితే అదే గ్యాస్ట్రోఎంటిరైటిస్. కొన్ని సందర్భాల్లో జ్వరం రావడం, శరీరం నుంచి నీరు ఎక్కువగా బయుటకు వెళ్తే వుూత్రపిండాలు దెబ్బతినడం కూడా జరగవచ్చు.
 
జాండీస్ రూపంలో : హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ వైరస్‌ల వల్ల వచ్చే ఈ రెండు వ్యాధులు కామెర్ల రూపంలో తవు లక్షణాల్ని చూపుతాయి. ఆకలి వుందగించడం, వికారం, మాత్రం పచ్చగా రావడంతో పాటు జ్వరం, వాంతుల వంటి లక్షణాలు ఈ వ్యాధుల్లో ఉంటాయి.
* టైఫాయిడ్ కాస్తా ఎంటిరిక్ ఫివర్ అంటూ ఎంట్రీ ఇచ్చేస్తుంది. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియూ వల్ల వచ్చే ఇది దీర్ఘకాలం జ్వరం (ప్రొలాంగ్‌డ్ ఫీవర్), తీవ్రమైన తలనొప్పి, కడుపునొప్పితో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాల కూడా ఉంటాయి.
* లెప్టోస్పైరోసిస్ అనేది బ్యాక్టీరియూ వల్ల వచ్చే వ్యాధి. వర్షాలకు ఎలుకల వంటివి  ఇళ్లలోకి రావడంతో వాటి మాత్రంలో ఉండే బ్యాక్టీరియూ నీళ్ల వల్ల ఆహారపదార్థాలను చేరి కలుషితం చేస్తుంది. పైగా ఈ సీజన్‌లో సీవరేజ్ గుంటల్లో దిగి పనిచేసేవారికి కలుషితమైన నీటి కారణంగా త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. నీళ్లలో నిత్యం తిరిగే రైతులూ, కూలీలకూ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువే. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతుల రూపంలో లక్షణాలు కనిపిస్తాయి. కడుపునొప్పి, కళ్లెర్రబారటం, కళ్లు పచ్చగావూరడం వంటి లక్షణాలూ ఉంటాయి.
 
దోమలు జ్వరాలకు ఫ్రెండ్స్...
ఈ జ్వరాలదీ, వానలదీ పరోక్ష సంబంధం. వర్షం కురిసి నీళ్లు చేరడం వల్ల దోమల వంటి కొన్ని కీటకాల గుడ్లు పొదిగేందు (బ్రీడింగ్)కు అవకాశం చిక్కుతుంది. దాంతో వచ్చేవే మలేరియూ, చికన్‌గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు.
* మలేరియా అన్నది ప్రోటోజోవా అనే ఏకకణ పరాన్నజీవి అనాఫిలస్ దోవుతో వల్ల వ్యాప్తి చెంది వస్తుంది. వ్యాధి మదిరి తలకెక్కితే సెరెబ్రల్ వులేరియూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్-ఏఆర్‌డీఎస్), స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్), ఒక్కోసారి కామెర్లూ రావచ్చు.
* చికన్‌గున్యా వైరస్ ఎడిస్ ఈజిప్టై అనే దోమ ద్వారా వ్యాప్తి చెంది వస్తుంది. ఓ ఏడాదీ, రెండేళ్ల క్రితం తన సత్తా ఏమిటో సవుస్త జనాలకూ చూపెట్టిన ఈ వ్యాధి కూడా నీళ్లు చేరడంతో దోమలు పెరిగి వస్తుంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయి కీళ్లనొప్పులు లక్షణాలుగా ఇది తన తీవ్రత చూపుతుంది.
* డెంగ్యూ పేరెత్తితేనే ఇప్పుడు దడ పుడుతోంది. ఇదీ దోవుల్లోనే ఒక రకమైన దోమ అయిన ఏడిస్ ఈజిప్టై వల్ల వ్యాప్తి చెందుతుంది. జ్వరం, తలనొప్పి వంటివి దీని లక్షణాలు. వాటితో పాటు ఎముకలు విరిచినంత నొప్పి వస్తుంది కాబట్టే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. వ్యాధి ముదిరినప్పుడు అంతర్గత అవయవాల్లో రక్తస్రావానికి కారణవతుంది. శరీరానికి షాకిచ్చి అపస్మారక స్థితిలోకి నెట్టి ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారి తీస్తుంది. అంచెలంచెల తీవ్రతతో ప్రభావం చూపే మూడు దశల వ్యాధినే డెంగ్యూ క్లాసికల్ ఫీవర్, డెంగ్యూ హ్యావురేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటారు.
 
నీళ్ల జల జల... వైరస్‌లతో విలవిల...
ఈ వానల్లో వైరస్‌లు విపరీతంగా విజృంభిస్తాయి. ఇవన్నీ ఫ్లూ లాంటి జ్వరాలే. ఈ వైరస్ వల్ల వచ్చే జ్వరాలు ఫ్లూ లక్షణాలను చూపి ఈ సీజనంతా హడలగొట్టేస్తాయి. జ్వరంతో ఒళ్లు పెనంలా కాల్చడమే కాదు. వాంతులు విరేచనాలతో శరీరంలోని నీటిని బయటకు పంపేసి డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. అయితే వీటిలో చాలావరకు తవుంతట తామే తగ్గిపోయే (సెల్ఫ్ లిమిటింగ్) జ్వరాలే.
 
పరాన్నజీవులతో ఎన్నో వ్యాధులు
* బయట ఏదైనా తింటే చాలు... అమీబియూసిస్ ఈ సీజన్‌లో తప్పక కనిపించే అవకాశం ఉంది. ఎంటమిబా హిస్టలిటికా అనే అమీబాలాంటి ఈ పరాన్నజీవి నీళ్లు, ఆహారం కలుషితమైన కారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కడుపులోకి చేరగానే ఎక్కువగా విరేచనాలు అవుతాయి.  దీనికి తోడు కడుపునొప్పి, ఆకలిలేమి, బరువు తగ్గడం కూడా ఉండొచ్చు.
 
* జియార్డియా అనే ఏకకణ జీవి కూడా అమీబియాసిస్‌లాంటి జబ్బే వస్తుంది. అయితే జియార్డియా వల్ల వస్తుంది కాబట్టి దీన్ని జియార్డియాసిస్ అంటారు. ఇది ఒళ్లంతా దురదలు పుట్టిస్తుంది. కడుపులో ఉన్న సూక్ష్మజీవి వల్లగాక ఏదైనా చర్మవ్యాధి వల్లనేమోనని పొరబడేలా ఈ దురదలు ఉంటాయి.
 
వాన సమయంలో వ్యాధుల నుంచి జాగ్రత్తలిలా...

చేయాల్సినవి...
ఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం.
⇒  వాటర్‌ను డిస్ ఇన్ఫెక్ట్ చేయుడానికి క్లోరిన్ బిళ్ల వేసి క్లోరినేషన్ ద్వారా శుభ్రం చేసిన నీరు తాగడం వుంచిది.
తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి.
మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి.
పరిసరాల పరిశుభ్రత పాటించాలి.  
ఈ సీజన్‌లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మల, మూత్ర విసర్జనకు ముందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కోవాలి.
పాత్రలు శుభ్రం చేసే సవుయుంలో సబ్బు లేదా డిటర్జెంట్ వాడండి.
 
చేయకూడనివి...

కుండల్లో లేదా బిందెల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీరు తాగకండి.
బయుటి ఆహార పదార్థాలు ఈ సీజన్‌లో వద్దు.
చల్లారిన ఆహారాన్ని మాటిమాటికీ వేడి చేసుకొని తినవద్దు.
పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి కాబట్టి వాటిని ఇంటి పరిసరాల్లో ఉంచకండి.
హాఫ్ స్లీవ్స్ వంటి దుస్తులను ఈ సీజన్‌లో వాడకండి.
కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయువద్దు. మట్టితో చేతులు, పాత్రలు శుభ్రం చేయవద్దు.
- డాక్టర్‌ సి.హెమంత్
సీనియర్‌ ఫిజీషియన్‌,యశోద హాస్పిటల్స్‌,సోమాజిగూడ,హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement