ఐ మిస్ హిమ్!
ఒకరికొకరుగా తిరిగేసి... పార్టీలు, పబ్బుల్లో ఎంజాయ్ చేసేసి... ఎవరికి వారుగా విడిపోయిన హాలీవుడ్ తార జినెత్ పాల్ట్రో, పాప్ స్టార్ క్రిస్ మార్టిన్లు ఇప్పుడు బాధపడుతున్నట్టున్నారు. మార్టిన్ బయటపడలేదు గానీ... జినెత్ మాత్రం... ‘మేమిద్దరం పెళ్లి చేసుకుని ఉండాల్సింది’ అంటూ తెగ ఫీలై పోతోంది. ‘మా పిల్లల కోసమన్నా కలిసుండాల్సింది. నాడు మేం ఎన్నో పొరపాట్లు చేశాం. మంచి రోజులు... అలాగే దుర్దినాలూ షేర్ చేసుకున్నాం. ఒకటిగా కెరీర్లో ముందుకు సాగాం. ఎప్పుడూ.. ఏ విషయంలోనూ గొడవపడలేదు. అంత అద్భుతమైన రిలేషన్ మా మధ్య కొనసాగినందుకు గర్వపడుతున్నా’ అందీ ‘ఐరన్‌మ్యాన్’ తార. సుదీర్ఘకాలం కోల్డ్‌ప్లేతో వైవాహిక జీవితం గడిపిన జినెత్... గత ఏడాది మార్చిలో అతడి నుంచి విడిపోయింది.