వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణహత్య
గుంటూరు: దుర్గి మండలం జంగామహేశ్వరపాడులో శుక్రవారం దారుణహత్య జరిగింది. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త వెంకటరమణను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. అతని ప్రత్యర్థులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల పనే అంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. దాంతో జంగమహేశ్వరపాడు గ్రామంలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.