Janmabhumi our town
-
0/100.. జన్మభూమి
తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో కనీస మార్కులు సంపాదించలేకపోగా, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. రెండు విడతలుగా సాగినప్పటికీ కేవలం దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే పరిమితం కావడంతో ప్రజల మన్ననలు పొందలేకపోయింది. ప్రధానంగా పింఛన్ల కత్తిరింపు, రేషన్ కార్డుల తొలగింపు వంటి చర్యలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. కమిటీల పేరిట తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలు ఆ పార్టీకి చెరగని మచ్చగా మిగిలాయి. గుంటూరు: ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో, ప్రజల భాగస్వామ్యంతో అని చెబూతూ ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం అంతటా రసాభాసగానే ముగిసింది. వేదికలను తెలుగుదేశం నాయకులు ఆక్రమించడంతో ప్రభుత్వం కార్యక్రమం కాస్తా పార్టీ సమావేశాలుగా మారాయనే విమర్శలు జన్మభూమి జరిగిన అన్ని చోట్లా వినిపించాయి. ►అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు, హుదూద్ తుపాను సంభవిం చడంతో తిరిగి నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు రెండు విడతలుగా జిల్లాలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 433 వార్డులు, 1011 గ్రామ పంచాయతీల్లో జన్మభూమి సభలు జరిగినా ఎక్కడా ప్రయోజన కలిగిందనే మాటే వినిపించలేదు. ► ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లేకపోవడం వల్ల వివిధ పనులపై అక్కడకు వచ్చిన ప్రజలు నిరాశకు గురయ్యారు. ► జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం కేవలం పింఛన్లు పంపిణీ,దరఖాస్తుల స్వీకరణకే పరిమితం కావడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. ఫించన్ల పంపిణీకే పరిమితం... జిల్లాలో కమిటీల పేరుతో దాదాపు 53,095 పింఛన్లు తొలగించారు. 34,324 వృద్ధాప్య, 15,349 వితంతు, 860 అభయాస్తం, 1540 వికలాంగులు, 102 కల్లు గీత పింఛన్లు తొలగించారు. ఆధార్ అనుసంధానంతో లక్షకు పైగా రేషన్ కార్డులను తొలగించారు. అన్నిరకాల పింఛన్ల కింద రూ.19.85 కోట్లను పంపిణీ చేశారు. వైద్య శిబిరాలకు స్పందన అంతంత మాత్రమే... ►జన్మభూమి సభల్లో వైద్య శిబిరాలను నిర్వహించి 1,41,831 మందికి మందులు పంపిణీ చేశారు. వైద్య పరీక్షల కోసం 1,42,441 మంది రిజిస్టర్ చేయించుకొన్నారు. ► 8,380 మంది కంటి అద్దాలు, 3,819 మందికి కంటి ఆపరేషన్లు కోసం సిఫార్సు చేశారు. 1521 మందిని ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకం కింద వైద్యసేవలకు సిఫారసు చేశారు. ► 2,237 మంది గర్భిణులు, 2,472 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వైద్య సేవలు అవసరమని నిర్ధారించారు. ► ప్రభుత్వం ఆదేశించినా పశువైద్య శిబిరాల్లో నట్టల నివారణ మందులు పంపిణీ చేయలేదు. 1261 శిబిరాలు నిర్వహించి 97,943 పశువులకు వైద్య చికిత్సలు అందించారు. పొలం పిలువా లేదు..బడి రమ్మనా లేదు .. పొలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. పొలాల్లోకి వెళ్లి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చింది అంతంత మాత్రమే. 14,682 మంది రైతులకు భూసార పరీక్షలకు సంబంధించిన కార్డులు అందజేశారు. 5,801 రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశారు. 34,643 మంది సభ్యులను గుర్తించారు. పొలం బడికి సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ►బడి పిలుస్తోంది... ఆరు నుంచి 14 సంవత్సరాల లోపు 4,354 మంది పిల్లలను నమోదు చేశారు. బడిబయట ఉన్న పిల్లలను 3084 మందిని గుర్తించారు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న 66,631 మందిని అక్షరాస్యులుగా చేయాలని నిర్ణయించారు. ►పేదరికంపై గెలుపు.. ఈ కార్యక్రమంలో దాదాపు 67,515 గ్రూపులకు వివిధ పనులకు సంబంధించి శిక్షణ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 15,647 మంది యువకులకు శిక్షణ ఏర్పాటు చేశారు. స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,10, 248 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీరు-చెట్టు కార్యక్రమం కింద 2,298 హార్వెస్టింగ్ స్ట్రక్చర్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 76,737 మొక్కలు నాటారు. 1756 ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. 520 మంది మత్స్యకారులు బోట్లు, వలల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 5018 మంది నీటి కుంటల్లో వదిలేందుకు చేపపిల్లలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు: 1,17,289 పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులు : 59,246 మొత్తం దరఖాస్తులు : 1,76,535 రెండో కన్ను పోతే పింఛన్ ఇస్తామంటున్నారు నాకు ఒక కన్ను లేదు. గతంలో పింఛన్ వచ్చేది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పింఛన్ తీసేశారు. ఇప్పుడేమో రెండు కళ్లు పోయినవారికే పింఛను ఇస్తామంటున్నారు. పింఛన్ కోసం రెండో కన్ను పోగొట్టుకోవాలా? ఈ జన్మభూమి వల్ల ఒరిగిందేమీ లేదు. - వికలాంగుడు, మన్నవ హనుమంతరావు, పెనుమాక -
శుభ్రతపై దృష్టి
- అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం - రూ.2లకే 20 లీటర్ల శుద్ధి నీరు - జిల్లా అభివృద్ధే లక్ష్యం - మంత్రులు పల్లె, సునీత సాక్షి, అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రవేశపెట్టిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని జిల్లాలో గురువారం పండుగలా నిర్వహించారు. భారీ ా్యలీలు .. స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్లు ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ చేపట్టారు. అనంతపురంలో మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామిని బాల, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, బీకే పార్థసారథి, మేయర్ మదమంచి స్వరూప లాంఛనంగా ప్రారంభించారు. మొదట తాడిపత్రి బస్టాండ్ కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రభాకర్‌చౌదరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. తర్వాత మంత్రులతోపాటు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప బుడ్డప్పనగర్ కాలనీలో కాలువలు, రోడ్లు శుభ్రం చేశారు. నాల్గోరోడ్డు, ఎర్నాల కొట్టాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ప్లాంట్లను ప్రారంభించారు. హామీలు నెరవేర్చుతాం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రులు సునీత, పల్లె అన్నారు. సప్తగిరి సర్కిల్లో జరిగిన సభలో వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అమలు చేస్తున్న ‘జన్మభూమి - మాఊరు’కు ఆటంకాలు కలిగించకుండా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కుల, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. సాంకేతిక లోపాల కారణంగానో, అధికారుల తప్పిదాలతోనో ఎవరికైనా పింఛన్ మంజూరు కాకపోతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద రూ.2కే 20 లీటర్ల నీటిని అందిస్తున్నామన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘అనంత’ను పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. కోటా మేరకు హెచ్చెల్సీ నీటి విడుదలకు, హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పూర్తి చేయడానికి పాటుపడతామన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మరుగుదొడ్డి నిర్మించుకునే వారికి రూ.12 వేలు మంజూరు చేస్తామన్నారు. నీరు-చెట్లు ప్రాధాన్యతను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఆరోగ్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించాలని వైద్యులకు సూచించారు. అనంతపురంలో ఐదు ఎన్టీఆర్ (అన్న) క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5కు రాగి సంగటి, వేరుశనగ విత్తనాల చెట్నీ, పప్పు అందిస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్ ప్రసంగించారు. కార్యక్రమం చివర్లో స్వచ్ఛతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, జేసీ సత్యనారాయణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు, డీఆర్డీఏ పీడీ నీలకంఠారెడ్డి, జెడ్పీ సీఈవో సూర్యనారాయణ, సివిల్‌సప్లయీస్ డీఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ గంపన్న తదితరులు పాల్గొన్నారు. -
అంతా.. ప్రచార ఆర్భాటమే...
- 20 శాతం నిధులు ఏ మూలకు ? - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం అర్బన్: ‘జన్మభూమి- మా ఊరు’ పేరుతో ప్రభుత్వ ఆర్భాటమే కానీ ప్రజలకు ఒరిగిందేమి లేదని ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం మహాత్మాగాంధీ జయంత్యుత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే దేశ సమగ్రతను కాపాడగలుతామని నాడు మహాత్మగాంధీ సూ చించారన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత అభివృద్ధిని విస్మరి స్తోందన్నారు. జిల్లాలో 6 లక్షల 8 వేల మంది రైతులకు రూ.6.43 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. అ యితే ప్రభుత్వం 20 శాతం నిధులు కేటాయించి, మిగిలిన రుణమాఫీకి బాండ్ల రూపంలో ఇస్తామంటే ఎలా అన్నారు. 20 శాతం నిధులు కేటాయిస్తే ఎంత మం ది రైతులకు లబ్ధి చేకురుతుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటుతో రుణమాఫీ ఎలా మాఫీ చేస్తారో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అ ర్హుల పింఛన్లకు, రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం మం గళం పాడుతోందని ఆందోళన వ్యక్తం చే శారు. గ్రామీణ ప్రజలకు చం ద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నేరవేర్చినప్పుడే గాంధీ కలలు కన్నా స్వరాజ్యనికి అర్థం ఉంటుందన్నారు. హా మీలు అమలుచేయకపోవడంతో రైతు లు, డ్వాక్రా మహిళలు, చేనేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ క్ర మంలో త్వరలోనే టీడీపీ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీసే సమయం దగ్గరలోనే ఉందన్నారు. బాపూజీ ఆశయూలను కొనసాగిద్దాం ఉరవకొండ: జాతిపిత ఆశయు సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపు నిచ్చారు. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయుం వద్ద గురువారం మ హాత్మా గాంధీ విగ్రహానికి పూలవూల వేసి నివాళులర్పించారు. అ నంతరం ర్యాలీని ప్రారంభించారు. జెడ్పీటీసీ మీనుగ లలితవ్ము, ఎంపీపీ సుంకరత్నవ్ము, సర్పంచ్ నర్రాసుజాత, ఎంపీటీసీ చందా చంద్రవ్ము,తహసీల్దార్ బ్ర హ్మయ్యు, ఇన్చార్జ్ ఎంపీడీఓ హరున్ష్రీద్, నాయుకులు పాల్గొన్నారు.